భర్త కన్నా.. భార్యకు సెక్స్ కోరికలు ఎక్కువగా ఉంటే..?

First Published | Jul 22, 2021, 12:35 PM IST

సంస్థ చేసిన పరిశోధనలో తేలిన విషయం ఏమిటంటే.. ఎక్కువ మంది మహిళలు.. అసలు తమ భర్తల కారణంగా అసలు శృంగారాన్ని ఆస్వాదించలేకపోతున్నామని చెప్పడం గమనార్హం.

‘ మహిళలకు సెక్స్ కోరికలు తక్కువగా ఉంటాయి. సెక్స్ విషయంలో వారు భర్తకు వెంటనే లొంగిపోతారు. అసలు సెక్స్ పట్ల వారికి ఆసక్తి ఉండదు. శృంగారం మీద ఆసక్తి కేవలం పురుషులకు మాత్రమే ఉంటుంది.’ ఈ అభిప్రాయాలు చాలా మందిలో ఉండే ఉంటాయి.
అయితే.. ఇందులో ఎలాంటి నిజం లేదు. మహిళలకు కూడా సెక్స్ కోరికలు ఎక్కువగా ఉంటాయట. అయితే.. అందులో ఎలాంటి తప్పు లేదట.

ఓ సంస్థ చేసిన పరిశోధనలో తేలిన విషయం ఏమిటంటే.. ఎక్కువ మంది మహిళలు.. అసలు తమ భర్తల కారణంగా అసలు శృంగారాన్ని ఆస్వాదించలేకపోతున్నామని చెప్పడం గమనార్హం.
కాగా.. ఓ సర్వేలో పలువురు మహిళలు.. సెక్స్ విషయంలో తమకు ఎక్కువ కోరికలు ఉన్నాయని.. తమ జీవితంలో ఎదురైన అనుభవాలను వివరించారు. వారు ఏం చెప్పారో మనం చూద్దాం..
‘‘ నేను, నా భర్త ఆఫీసు నుంచి ఇంటికి చేరుకోగానే పూర్తిగా అలసిపోతాం. అయినా.. నాకు కాసేపు అయినా సెక్స్ ని ఎంజాయ్ చేయాలని ఉంటుంది. ఆ విషయం నా భర్తకు చెబితే.. తనకు ఓపిక లేదని పక్కకు వెళ్లిపోతాడు. నేనే చొరవ చూపిస్తాను’’ అంటూ ఓ మహిళ వివరించింది.
‘‘ పెళ్లికి ముందు నేను వైబ్రేటర్( సెక్స్ టాయ్) ని ఉపయోగించేదాన్ని. పెళ్లి తర్వాత దాని అవసరం లేదని పడేశాను. కానీ మా ఆయన బిజీగా ఉన్నప్పుడు కుదరడం లేదని.. తానే నాకు స్వయంగా సెక్స్ టాయ్ కొనిచ్చారు. ఆయన బిజీగా ఉన్నప్పుడు నేను దానిని వాడతాను’’ అంటూ మరో మహిళ తెలిపింది.
‘‘ మా ఆయనకు నేను సెక్స్ విషయంలో చొరవ చూపించడం నచ్చదు. తనకు నచ్చినట్లుగానే చేయాలని అనుకుంటాడు. నా కోరిక తీర్చాలని అనుకోడు. నాకు తృప్తి లభించదు’’ అంటూ మరో మహిళ వాపోయింది.
‘ నా భర్త కేవలం సెక్స్ ని అదో పనిలా భావిస్తాడు. ప్రేమగా చేయడం రాదు. ఒకవేళ నేను చొరవ చూపించినా.. నన్ను తక్కువ చేసి చూస్తాడు. ఈ విషయంలో నాకు ఎప్పుడూ అసంతృప్తిగానే ఉంటుంది’ అంటూ మరో మహిళ తెలిపింది.

Latest Videos

click me!