శృంగారం అనేది పట్టులాంటిది.. అదే అశ్లీలత నైలాన్ లాంటిది అని లూసీ ఫిషర్ అనే అమెరికన్ ఫిల్మ్ ప్రొడ్యూసర్ ఒకరు ఓ సందర్భంలో అన్నారు. లూసీ ఫిషర్ ను మహిళలు, వర్కింగ్ మదర్స్ కు ఎంటర్టైన్మెంట్ ఇండస్ట్రీలో మార్గదర్శకుడిగా చెబుతారు.
ఎరోటికా(శృంగారం) అనేది మనలాంటి మంచి మధ్యతరగతి, అక్షరాస్యత కలిగిన వ్యక్తుల కోసం.. అదే అశ్లీలత ఒంటరి, ఆకర్ణణలేని, చదువురాని వారి కోసం... అని చెప్పుకొచ్చారు.
అశ్లీలత, శృంగారాన్ని విడిగా చూడలేని చాలామందికి ఫిషర్ వ్యాఖ్యలు ఆశ్చర్యం కలిగిస్తుంది. ఈ వ్యాఖ్యల్లో సామాజిక వివక్ష తాలూకు స్పృహ ఉన్నప్పటికీ మనలో ఆసక్తిని రేపుతుంది.
చాలా తక్కువమందికి మాత్రమే అశ్లీలత, శృంగారం.. రెండూ వేరు వేరు అనే విషయం మీద అవగాహన ఉంటుంది. అశ్లీలత, శృంగారం రెండూ ఎప్పుడూ ఒకదానిమీదొకటి ఓవర్ లాప్ అవుతూనే ఉంటాయి.
శృంగారం ఒక కళ. మనసును వీణలా మీటి.. శరీరంలో ప్రకంపనలు పుట్టించి.. సృష్టికార్యానికి ప్రేరేపిస్తుంది. శృంగారం కళ కాబట్టే.. దీని ఇతర కళలైన పెయింటింగ్, శిల్పం, ఫోటోగ్రఫీ, డ్రామా, ఫిల్మ్, మ్యూజిక్ లేదా సాహిత్యం సహా అన్ని రకాల కళల్లోనూ శృంగార విషయాలను వర్ణిస్తాయి. అందుకే దీన్ని కమర్షియల్ ఫోర్నోగ్రఫి నుంచి వేరు చేసి చూడాలి.
మరోవైపు, అశ్లీల చిత్రాలను లైంగిక కోరికను ప్రేరేపించడం తప్ప మరే సాహిత్య లేదా కళాత్మక విలువలు లేని సృజనాత్మక చర్యగా అది రచన, పెయింటింగ్, సినిమాల ఏదైనా సరే.. అలాగే వర్ణించవచ్చు.
లియోన్ ఎఫ్. సెల్ట్జర్ అనే ఒక రిటైర్డ్ అమెరికన్ క్లినికల్ సైకాలజిస్ట్ 2011లో శృంగారం, అశ్లీలతల మధ్య ఉండే తేడాల మీద ఓ వ్యాసంలో ఇలా వ్రాశారు..
రెండు శరీరాలు ఆనందం పొందడం కోసం చేసే అందమైన ఆట శృంగారం. అందుకే దీనికి సృష్టికర్త కూడా సంతోషపడతాడని అంటాడాయన. అదే అశ్లీలత ఇంద్రియాలకు లేదా శరీరానికి సంబంధించిన ఆకలిని మాత్రమే కనిపించేలా చేస్తుంది.
శృంగారం సౌందర్య భావనను కలిగి ఉంటుంది. శృంగార చర్యలు ఎదుటివారు ఏం చెప్పడానికి ప్రయత్నిస్తున్నారో అర్థం చేసుకోవడానికి పనికి వస్తుంది. వారు ఎంత కళాత్మకంగా పనిచేశారో చెప్పడానికి తోడ్పడుతుంది.
కానీ అశ్లీలత విషయానికి వచ్చేసరికి దాని ఏకైక లక్ష్యం వీక్షకుడిని ఆన్ చేయడం. అశ్లీల రచయిత లక్ష్యం చదువుతున్న లేదా చూస్తున్న ప్రేక్షకులు శారీరకసాన్నిహిత్యం మీద గౌరవాన్ని కలిగించడం కాదు. తీవ్రంగా ప్రేరేపించడం మాత్రమే.
అంతేకాదు అశ్లీలత అనేది ముఖ్యంగా డబ్బు సంపాదించే వెంచర్. శృంగారం విషయంలో ఇది ఎప్పుడూ ఉండదు. ముఖ్యంగా చాలాకాలంగా ఫెమినిస్టులు అశ్లీలత మీద వ్యతిరేకించేది ఏంటంటే.. వీటిల్లో స్త్రీని వస్తువులుగా చూస్తారని. వ్యక్తి కామవాంఛలు తీర్చడానికి మాత్రమే అశ్లీలత ఉపయోగపడుతుంది.
అశ్లీలత, శృంగారం రెండింటికి ఇన్నిరకాల వైరుధ్యాలు ఉన్నప్పటికీ... ఒక్కోసారి కొంతమందికి శృంగారంగా కనిపించేంది మరొకరికి అశ్లీలతగా అనిపించవచ్చు. ఉదాహరణకు, ఒక మత్స్యకన్య శిల్పం ఒకరికి ఆర్ట్ పీస్ లా అనిపిస్తే.. మరొకరికి అశ్లీలంగా అనిపించవచ్చు.
మన సమాజంలో సెక్స్ గురించి మాట్లాడడం తప్పుగా పరిగణిస్తారు. దీంతో శృంగారానికి, అశ్లీలతకు తేడా ఏంటి అనేది తెలియకుండా పోతుంది. ఈ రెండింటిమధ్య తేడా ఏంటో తెలిపే చర్చలు జరిగితే.. కనీసం దీనిమీద ఓ అవగాహన వస్తుంది. అప్పుడు శృంగారం విషయంలో ఏది చదవాలి, ఏది చదవకూడదు, ఏది పోర్స్ ఏది ఎరోటిక్ అనేది క్లారిటీ వస్తుంది.