వెనిగార్
గోడలపై నూనె మరకలను తొలగించడానికి వెనిగర్‌ని ఉపయోగించవచ్చు. ఒక గిన్నెలో వెనిగర్, నీరు కలిపి బాగా కలపాలి. దాన్ని నూనె మరకపై చల్లి 10 నిమిషాల తర్వాత తడిబట్టతో తుడవాలి. ఇప్పుడు మరక పూర్తిగా పోయి ఉంటుంది.
బేకింగ్ సోడా
గోడలపై నూనె మరకలను తొలగించడానికి బేకింగ్ సోడాను ఉపయోగించవచ్చు. బేకింగ్ సోడా మొండి నూనె మరకలను కూడా సులభంగా తొలగిస్తుంది. కొద్దిగా బేకింగ్ సోడాలో నీరు కలిపి ఆ పేస్ట్‌ను మరక ఉన్న చోట రాసి కొద్దిసేపు అయ్యాక బట్టతో బాగా తుడవాలి. ఇప్పుడు మరక పూర్తిగా పోయి ఉంటుంది. దీన్ని ఉపయోగించే ముందు చేతి తొడుగులు, మాస్క్ ధరించడం మర్చిపోవద్దు.