Weight loss: బరువు తగ్గడానికి కష్టపడుతున్నారా? కేవలం ఇంట్లో తయారు చేసుకునే కొన్ని రకాల ఫుడ్స్ తినడం వల్ల నెలరోజుల్లోనే బబరువు తగ్గవచ్చని మీకు తెలుసా? అదెలాగో ఇప్పుడు తెలుసుకుందాం..
effective indian diet plan for one month weight loss results
Diet for Weight loss:
పెరిగిన బరువును తగ్గించుకోవడానికి చాలా మంది చాలా కష్టపడుతూ ఉంటారు. అంతేకాదు.. బరువు తగ్గాలని ఏవేవో ఆహారాలు తినాలని.. మనం రోజూ ఇంట్లో వండుకునే అన్నం, కూరలతో బరువు తగ్గడం చాలా కష్టం అని అందరూ అనుకుంటూ ఉంటారు. కానీ, కేవలం మనం ఇంట్లో వండుకునేవి తింటూనే ఈజీగా బరువు తగ్గవచ్చు. అదెలాగో ఇప్పుడు తెలుసుకుందాం..
26
డైట్ లో ఏమేం ఉండాలి?
మనం రోజూ తినే ఆహారంలో కార్బో హైడ్రేట్స్ చాలా ఎక్కువగా ఉంటాయి. అందుకే, వాటి వల్ల మనం బరువు పెరుగుతాం. కానీ, కార్బో హైడ్రేట్స్ తో పాటు.. ప్రోటీన్, విటమిన్లు,ఫైబర్ కలిపి తీసుకుంటే.. కచ్చితంగా బరువు తగ్గొచ్చు. డైట్ చేసేవాళ్లు అన్ని పోషకాలు బ్యాలెన్స్ గా తీసుకోవాలి. ముఖ్యంగా ప్రోటీన్ ఫుడ్స్ తీసుకోవాలి.
36
బ్రేక్ ఫాస్ట్
బరువు తగ్గడానికి బ్రేక్ ఫాస్ట్ లో ఇడ్లీ వంటివి తీసుకోవచ్చు. వీటిని మోతాదుగా ప్రోటీన్ ఫుడ్స్ తో తింటే బరువు పెరగరు. ఉప్మా లేదా వెజిటబుల్స్ వేసిన అటుకుల ఉప్మా తినొచ్చు. ఇడ్లీలను ఎక్కువ చట్నీలతో కాకుండా.. ఎక్కువ కూరగాయలు ఉన్న సాంబార్ తో తినొచ్చు. అవి కూడా రెండే తినాలి. ఇక ఉప్మా చిన్న గిన్నెడు తినొచ్చు. అందులోనూ ఎక్కువ కూరగాయలు ఉండేలా చూసుకోవాలి.
46
లంచ్...
వేయించిన పదార్థాలు తగ్గించాలి. నూనె లేకుండా గ్రిల్ చేసిన చికెన్ లేదా చేపలు, సలాడ్, చపాతీ లేదా గోధుమ రొట్టె తినొచ్చు. మధ్యాహ్నం అన్నం తిన్నా 200 గ్రాముల లోపే ఉండాలి. కూరగాయలు, రెండూ మూడు కూరలు తినొచ్చు. ప్రోటీన్ కోసం పప్పు తీసుకోవచ్చు.
56
డిన్నర్;
రాత్రి 2 ఇడ్లీలు లేదా చపాతీలు తినొచ్చు. కూరగాయలు, ప్రోటీన్ తీసుకోవచ్చు. గ్రిల్ చేసిన చికెన్ లేదా చేపలు, వెజిటబుల్ సూప్, ఉడికించిన కూరగాయలు, తందూరి చికెన్
66
బరువు తగ్గడానికి ముఖ్యమైన చిట్కాలు..
చిన్న ప్లేట్లలో తినండి. ఎంత తింటున్నారో జాగ్రత్తగా ఉండండి. రోజంతా నీళ్లు బాగా తాగండి. ప్రాసెస్ చేసిన ఆహారాలకు వీలైనంత దూరంగా ఉండండి.
పొరపాటున కూడా చేయకూడని పనులు..
స్వీట్ స్నాక్స్ తినడం మానేయండి. స్వీట్ డ్రింక్స్ తాగొద్దు. స్వీట్ కాఫీ, టీ తాగొద్దు. స్వీట్స్ పూర్తిగా మానేయండి. తొందరగా బరువు తగ్గడం ఆరోగ్యానికి మంచిది కాదు.