వావ్.. పానీపూరీ తింటే బరువు తగ్గుతారట..

Published : Mar 11, 2022, 12:46 PM IST

అధిక బరువు తగ్గేందుకు రకరకాల చిట్కాలు, వ్యాయామాలు, స్పెషల్ డైట్ ను పాటించే వారు చాలా మందే ఉన్నారు. అయితే వెయిట్ లాస్ అవ్వడానికి పానీపూరీ కూడా ఎంతో సహాయపడుతుందని కొంతమంది నిపుణులు అభిప్రాయ పడుతున్నారు.   

PREV
113
వావ్.. పానీపూరీ తింటే బరువు తగ్గుతారట..

 ఇండియాలో ఫేమస్ స్ట్రీట్ ఫుడ్ ఏదైనా ఉందంటే.. అది పానీ పూరీ అనే చెప్పాలి. సాయంత్రం అయ్యిందంటే చాలు పట్టణాలు, నగరాల్లోని పానీపూరి బండి దగ్గర జనాలు గుమిగూడుతుంటారు. చిన్న పిల్లల నుంచి మొదలు పెడితే.. పెద్దవారు కూడా పానీ పూరీ ప్రియులుగా మారిపోయారు. చాలా మందికి ఇది ఫేవరెట్ స్ట్రీట్ ఫుడ్ కూడా. ఇతర స్నాక్స్ కంటే ఇది చాలా ఢిఫరెంట్ టేస్ట్ తో ఉంటుంది.

213

నూనెలో వేయించిన పూరీ, తరిగిన ఉల్లిపాయ ముక్కుల, ఉడికించిన బంగాళదుంప, పప్పు, జీరకర్ర పౌడర్, యాలకుల పౌడర్, కారం, ఉప్పు, చింతపండు, పుదీనాలతో పానీ పూరీని తయారు చేస్తుంటారు. మిగతా స్నాక్స్ కంటే ఇది డిఫరెంట్ టేస్ట్ ను కలిగి ఉంటుంది. పుల్లగా, కారంగా, ఉప్పుగా, తియ్యగా ఇలా రకరకాల రుచులను కలిగి ఉండటంతోనే జనాలు ఎక్కువగా వీటిని తినడానికి ఇష్టపడుతుంటారు. 

313
panipuri

వెయిట్ లాస్: పానీ పూరీలో వాడే నీళ్లల్లో చింతపండు, జీలకర్ర, పుదీనా ఉంటాయి. ఇవి వెయిట్ లాస్ అవ్వడానికి ఎంతో సహాయపడతాయి. అంతేకాదు ఇవి Intestinal syndrome ను నయం చేయడానికి సహాయపడుతుంది. 

413

అజీర్థి సమస్యల నుంచి ఉపశమనం కలిగించడానికి ఇవి ఎంతో సహాయపడతాయి. రోగ నిరోధక  శక్తిని కూడా పెంచుతాయి. పానీపూరీలో ఎన్నో పోషకవిలువలుంటాయి. విటమిన్ ఎ, బి6, బి12, మిటమిన్ డి, పొటాషియం, మెగ్నీషియం, జింక్ పుష్కలంగా ఉంటాయి. 
 

513
PANIPURI

పరిశుభ్రమైన ప్లేస్ లోనే తినండి: పానీ పూరీని తినడం ఎంత ముఖ్యమో.. దాన్ని ఎక్కడ తింటున్నామన్నది కూడా ఇంపార్టెంట్ యే. అపరిశుభ్రమైన ప్లేస్ లో ఉండే పానీ పూరీ బండి దగ్గర తినడం వల్ల అందులో రకరకాల వైరస్ లు, బ్యాక్టీరియా, ఇంతర క్రిములు వాటిపై చేరే అవకాశం ఎక్కువగా ఉంది. ఒకవేళ అవి కలుషితమైతే.. ఫుడ్ పాయిజనింగ్ అవుతుందని ఆరోగ్య నిపుణులు హెచ్చరిస్తున్నారు.  కలుషితమైన పానీపూరీని తినడం వల్ల అనేక అనారోగ్య సమస్యలు వస్తాయి. 

613

పానీ పూరీ వాటర్ లో ఉపయోగించే జీలకర్ర, పుదీనాలను నోట్లో ఏర్పడే బొబ్బలను తగ్గిస్తాయి. బ్లాక్ సాల్ట్, మిరియాల పొడి, జీలకర్ర పౌడర్లు జీర్ణక్రియను మెరుగుపరుస్తాయి. 

713

పానీపూరీలో కేలరీలు తక్కువ మొత్తంలో ఉంటాయి. కాబట్టి వీటిని తింటే మీ రక్తంలో షుగర్ లెవెల్స్ పెరుగుతాయన్న భయం కూడా పెట్టుకోవక్కర్లే. వీటిని డయాబెటిస్ పేషెంట్లు ఎలాంటి భయం పెట్టుకోకుండా లాగించొచ్చు. 

813

ప్రమాదాలు: పానీ పూరీలల్లో పూరీలను నూనెలో డీప్ ఫ్రై చేస్తుంటారు. వాళ్లు వాడే నూనెలు ఆరోగ్యకరమైనవి కాకపోవచ్చు. ఈ పూరీలు  ట్రాన్స్ ఫ్యాట్ ను కలిగే ఛాన్సెస్ ఉన్నాయి. దీనివల్ల అనారోగ్య సమస్యలు వచ్చే ప్రమాదముంది. 

913

పానీ పూరీ వాటర్ శుభ్రమైన నీటితో తయారుచేయకపోతే .. డయేరియా వంటి భయంకరమైన రోగాల బారిన  పడాల్సి వస్తుంది. 

1013

ఇకపోతే కర్రీకోసం వాడే బంగాళాదుంపలు ఎప్పటివో, కుళ్లినవి అయితే మాత్రం ఫుడ్ పాయిజనింగ్ వంటి సమస్యలను ఎదుర్కోవాల్సి ఉంటుంది.  మరొక ముఖ్యమైన విషయం ఏమిటంటే.. పానీ పూరీ వాటర్ లో, పూరీల్లో ఉప్పును ఎక్కువగా వేస్తే రక్తపోటు (Blood pressure) వచ్చే ప్రమాదం ఉంది.

1113

పానీపూరీలో వాడే జీలకర్రలో యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. అలాగే ఇవి క్యాన్సర్ నిరోధక లక్షణాలను కూడా కలిగి ఉంటాయి. ఇవి ఇమ్యూనిటీపై దాడికి పాల్పడే బ్యాక్టీరియాను చంపేస్తాయి. అంతేకాదు ఇవి మన శరీరంలో పేరుకు పోయిన కొలెస్ట్రాల్ ను కూడా తగ్గిస్తాయి.

1213

పానీపూరీలో వాడే బ్లాక్ సాల్ట్ ఖనిజాలను ఎక్కువ మొత్తంలో కలిగి ఉంటుంది. ఇందులో టేబుల్ సాల్ట్ కంటే తక్కువ మొత్తంలోనే సోడియంను కలిగి ఉండటం వల్ల దీనిని తింటే మన జీర్ణక్రియ మెరుగ్గా పనిచేస్తుంది. అలాగే చర్మం, జుట్టు నాజూక్కా, నిగనిగలాడేలా చేస్తుంది. ముఖ్యంగా రాక్ సాల్ట్ వల్ల గొంతు నొప్పి, కండరాల తిమ్మిరి వంటి సమస్యలు తొలగిపోతాయి. 
 

1313

పానీపూరీ ఆరోగ్యానికి మంచిదా? కాదా? : పానీపూరీని తయారు చేసేవిధానంపైనే మన ఆరోగ్యానికి మంచి చేస్తుందా? చెడు చేస్తుందా? అనే విషయం ఆధారపడి ఉంటుంది. ఎందుకంటే పానీపూరీలో వాడే అన్ని పదార్థాలు ఆరోగ్యకరమైనవే. వీటి వల్ల మన శరీరానికి కావాల్సిన పోషకాలు, ఖనిజాలు అందుతాయి. మంచి పద్దతిలో దీన్నితయారుచేస్తే మన ఆరోగ్యానికి ఏ నష్టం జరగదు. కానీ వీటి తయారీలో అపరిశుభ్రత ఉంటేనే అది మనల్ని అనారోగ్యం పాలు చేస్తుంది. 
 

click me!

Recommended Stories