
రిలేషన్ షిప్ లో గొడవలు, కొట్లాటలు చాలా కామన్. మీకు తెలుసో తెలియదో.. కానీ గొడవల వల్ల కూడా బంధం బలపడుతుందట. ఆ గొడవలకు పరిష్కార మార్గం కనుకున్నప్పుడే ఇది సాధ్యమవుతుంది. పార్టనర్ తో గొడవలు వస్తే మీ బంధం బలహీనపడిందనో, మీ బంధంలో సంతోషాలు కరువయ్యాయనో మీరు బాధపడాల్సిన అవసరం లేదు.
కొంతమంది భార్యా భర్తలు ఎంతగా కొట్లాడుకున్నా.. తిరిగి కొద్ది క్షణాలకే ఒకటైపోతారు. కారణం.. వారు ఆ గొడవల్ల వల్ల తమ బంధం బలహీనపడొద్దని భావిస్తారు. అలాగే ఆ గొడవలు ఎందుకు వచ్చాయో తెలుసుకుని వాటిని పరిష్కరించుకుంటారు. కాబట్టి గొడవలను పుట్టించే విషయాల గురించి చర్చించుకోండి. ఆ సమస్యల పరిష్కారం దిశగా ఆలోచించండి.
సమస్యల గురించి చర్చించుకోకపోతే.. మీ మధ్య ప్రేమకు బదులుగా ఎప్పుడూ కొట్లాటలు, గొడవలు జరుగుతాయి. ఒక్కో సారి ఆ గొడవల మూలంగా మీరు విడిపోయే అవకాశం కూడా రావొచ్చు. మరి కొట్లాటలకు కారణమయ్యే సమస్యలను ఎలా పరిష్కరించుకోవాలో ఈ ఆర్టికల్ ద్వారా తెలుసుకుందాం పదండి.
డైరెక్ట్ గా చెప్పేయండి: పార్టనర్స్ మధ్య గొడవలు జరిగినప్పుడు వారిలో ఎవరో ఒకరు తమ పార్టనర్ ను బాధపెట్టే విషయాల గురించి మాట్లాడుతుంటారు. వారికి స్ట్రెయిట్ గా చెప్పకుండా వేరే విషయంపై మాట్లాడుతూ ఉంటారు. అసలు వారు వారి పార్టనర్ కు విలువ అసలే ఇవ్వరు. ఇలా ప్రవర్తించడం మీ సమస్య ఎక్కడికో దారితీయొచ్చు. మీరు సూటి పోటి మాటలతో మీ పార్టనర్ ను బాధపడితే.. అసలు ఎందుకు తిడుతున్నారో వారికి తెలియదు. ఏం చేయాలో కూడా తెలియదు. దీంతో మీ మధ్య మరిన్ని కొట్లాటలు జరిగే ప్రమాదం ఉంది.
ఎలా ఫీల్ అవుతున్నారో చెప్పేసేయండి: పార్టనర్ ను చులకనగా చూడటం, నువ్వెంత అనే మాటలు మీ బంధాన్ని మరింత బలహీనంగా మారుస్తాయి. కాబట్టి మీ పార్టనర్ ను తక్కువ చేసే మాటలను మాట్లాడకండి. వారి ప్రవర్తన వల్ల మీరెలా ఫీలవుతున్నారో చెప్పండి.. కానీ వారిని బ్లేమ్ చేసి మాట్లాడకండి.
వినండి: సగం కొట్లాటలు వినకపోవడం వల్లే జరుగుతాయన్న సంగతి మీకు తెలుసా.. అవును ఒక సమస్య పరిష్కారానికి మాట్లాడటం ఎంత ముఖ్యమో.. వినడం కూడా అంతే ముఖ్యం. ఒక విషయం గురించి మాట్లాడుతున్నప్పుడు ఐ కాంటాక్ట్ చాలా ఇంపార్టెంట్. చర్చ జరుగుతున్నప్పుడు టీవీ, ఫోన్ చూడటం వంటివి అస్సలు చేయకండి.
సరైన సమయం: పార్టనర్ తో ఒక విషయం గురించి చర్చించాలనుకున్నప్పుడు దానికి సరైన సమయాన్ని చూడండి. ఆఫీస్ నుంచి వచ్చిన వెంటనో లేకపోతే ట్రాఫిక్ లో ఇరుక్కున్నప్పుడో, ఫ్రెండ్ తో మాట్లాడుతున్నప్పుడో మాట్లాడకండి. మీ పార్టనర్ ప్రశాంతంగా ఉన్నప్పుడు ఒక దగ్గర కూర్చొని మీరు చెప్పాలనుకున్న విషయాన్ని స్ట్రెయిట్ గా చెప్పండి.
రెస్పెక్ట్ ఇవ్వండి: ఏ రిలేషన్ షిప్ లోనైనా రెస్పెక్ట్ ఎంతో ముఖ్యం. మీకు ఒకరు గౌరవం ఇస్తే.. అవతలి వారికి కూడా మీరు గౌరవం ఇవ్వండి. అప్పుడే మీ బంధం స్ట్రాంగా ఉంటుంది. ఇలాంటి బంధంలో గొడవలు జరిగినా.. తొందరగా పరిష్కరించుకోగలుగుతారు. గొడవ పడుతున్నప్పుడు వారిమాటలకు అడ్డు పడటం, వారు చెప్పేది వినకపోవడం, ఆ విషయాన్ని వదిలేసి దేనిగురించో మాట్లాడటం వంటి చేష్టల ద్వారా మీ పార్టనర్ కు మీరెంత రెస్పెక్ట్ ఇస్తున్నారో ఇట్టే తెలిసిపోతుంది.