Anemia In Body: బెల్లం తింటే శరీరంలో రక్తానికి లోటే ఉండదు తెలుసా..

Published : May 07, 2022, 03:23 PM IST

Anemia In Body: దానిమ్మ పండు, బీట్ రూట్ తోనే కాదు బెల్లంతో కూడా శరీరంలో రక్తం బాగా పెరుగుతుంది. అంతేకాదు బెల్లం ఎన్నో అనారోగ్య సమస్యలను తగ్గిస్తుంది. 

PREV
18
Anemia In Body: బెల్లం తింటే శరీరంలో రక్తానికి లోటే ఉండదు తెలుసా..

Anemia In Body: రక్తహీనత ఎన్నో అనారోగ్య సమస్యలకు దారి తీస్తుంది. శరీరంలో రక్తం మొత్తమే తగ్గినప్పుడు రక్తం బాటిల్ ను పెట్టాల్సి వస్తుంది. ఇలాంటి పరిస్థితే వస్తే ఎన్నో అనారోగ్య సమస్యలు వస్తాయి. ఈ సమస్య గర్భిణులకే కాదు చిన్నపిల్లలకు, యువతకు కూడా వస్తుంది. అయితే కొన్ని రకాల ఆహార పదార్థాలను తీసుకుంటే ఈ సమస్య నుంచి తొందరగా బయటపడతారు. 

28

దానిమ్మ, బీట్ రూట్, ఆకుపచ్చ కూరగాయలను తింటే రక్తహీనత సమస్య తొలగిపోతుందని ఆరోగ్య నిపుణులు, వైద్యులు చెబుతుంటారు. వీటితో పాటుగా బెల్లం తినడం వల్ల రక్తహీనత సమస్య తగ్గుతుంది. అంతేకాదు బెల్లం ఎన్నో అనారోగ్య సమస్యలను కూడా దూరం చేస్తుంది.  అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం. 
 

38

బెల్లం తింటే రక్తం పెరుగుతుందా.. మన శరీరంలో రక్త పరిమాణాన్ని పెంచడానికి బెల్లం ఎంతో సహాయపడుతుందని ఇప్పటికే చాలా నివేదికలు స్పష్టం చేశాయి. అంతేకాదు ఇది రక్తాన్ని కూడా శుభ్రపరుస్తుంది. బెల్లంలో విటమిన్ ఎ, విటమిన్ బి, సుక్రోజ్, గ్లూకోజ్, ఐరన్, కాల్షియం , ఫాస్పరస్, పొటాషియం, జింక్, మెగ్నీషియం పుష్కలంగా ఉంటాయి. ఇవేకావు దీనిలో ఉండే ఇతర విటమిన్లు, ఖనిజాలు రక్తాన్ని పెంచడానికి ఎంతో సహాయపడతాయి. 

48

బెల్లం తినడం వల్ల కలిగే ఇతర ప్రయోజనాలు.. శరీరంలో రక్త లోపం లేకుండా చూడటమే కాదు బెల్లం జీర్ణశక్తిని కూడా బలోపేతం చేస్తుంది. అంటే బెల్లం పొట్టకు సంబంధించిన సమస్యలను కూడా నయం చేస్తుందన్న మాట. 
 

58

బెల్లం బరువును నియంత్రించడానికి ఎంతగానో సహాయపడుతుంది. టీ లో షుగర్ కు బదులుగా బెల్లాన్ని వేసుకుని తాగితే చక్కటి ఫలితం ఉంటుంది. 

68

అధిక రక్తపోటుతో బాధపడేవారికి బెల్లం దివ్య ఔషదంలా పనిచేస్తుంది. ఎందుకంటే రెగ్యులర్ గా బెల్లం తినండం వల్ల రక్తపోటును నియంత్రణలోకి వస్తుందని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. 

78

చాలా మంది అమ్మాయిలకు పీరియడ్స్ సమయంలో పొత్తికడుపులో నొప్పి వస్తుంది. అయితే ఆ సమయంలో బెల్లం తింటే కడుపు నొప్పి మటుమాయం అవుతుంది.

88

ప్రస్తుత కాలంలో కీళ్ల నొప్పులు, వాపుతో బాధపడేవారు చాలా మందే ఉన్నారు. ఈ కీళ్ల నొప్పులు వయసుతో సంబంధం లేకుండా వస్తున్నాయి. అయితే వీళ్లు బెల్లం తింటే మంచి ఫలితం ఉంటుంది. రెగ్యులర్ గా బెల్లం తింటే కీళ్ల నొప్పులు మటుమాయం అవుతాయి. 

click me!

Recommended Stories