నిమ్మకాయ , ఉప్పు: ముందుగా నిమ్మకాయను సగానికి కట్ చేసి, ఉప్పుతో తవాపై రుద్దండి. కాసేపు అలాగే ఉంచిన తర్వాత, తవాను మెత్తని స్క్రబ్‌తో బాగా రుద్దండి. తర్వాత గోరువెచ్చని నీటితో శుభ్రం చేసుకోవాలి.
వేడి నీరు: తవాపై అంటుకున్న మురికిని తొలగించడానికి తవాను గోరువెచ్చని నీటితో కడగాలి, ఆపై తవాను డిష్ వాష్‌తో శుభ్రం చేసి, తవాను తుడవడానికి మళ్లీ వేడి నీటిని ఉపయోగించాలి. ఇలా చేస్తే.. తవా మెరుస్తుంది.