ముద్దు పెట్టుకుంటే ఇన్ని సమస్యలా?

First Published | Jan 25, 2024, 3:08 PM IST

ప్రియమైన వారిని ముద్దు పెట్టుకునే ఛాన్స్ వస్తే ఎవరూ వదులుకోరు. కానీ ఒక చిన్న ముద్దు మీ మొత్తం లైంగిక ఆరోగ్యాన్ని దెబ్బతీస్తుందంటే నమ్ముతారా? అవును.. ఒక చిన్ని ముద్దు కూడా మిమ్మల్ని ఎన్నో వ్యాధుల బారిన పడేస్తుంది. 

kissing

ముద్దు ముచ్చటను ఇష్టపడనివారు ఎవరూ ఉండరు. ఇది మీకు లైంగిక ఆనందాన్ని మాత్రమే కాదు.. మీ  ఆరోగ్యానికి కూడా ఎన్నో విధాలుగా మేలు చేస్తుంది. సైన్స్ ప్రకారం.. ఎవరైనా మనలను ముద్దుపెట్టుకున్నప్పుడు మన శరీరంలో విడుదలయ్యే ఆక్సిటోసిన్ బలమైన బంధాన్ని నిర్మించడానికి సహాయపడుతుంది. ఇది మీ ఇద్దరి మధ్య ప్రేమను పెంచుతుంది. మీరు హ్యాపీగా ఫీలయ్యేటా చేస్తుంది. కానీ ముద్దు కూడా లైంగిక సంక్రమణ వ్యాధులకు కారణమవుతుందని నిపుణులు అంటున్నారు. ముద్దుతో ఎలాంటి అనారోగ్య సమస్యలు వస్తాయో ఇప్పుడు తెలుసుకుందాం పదండి. 

సంభోగం లేదా ఓరల్ సెక్స్ తో పోలిస్తే ముద్దుతో సంక్రమణ సోకే ప్రమాదం చాలా తక్కువ. అయినప్పటికీ ముద్దుతో ఎస్టీడీ సమస్యలు వచ్చే అవకాశం లేకపోలేదు. ముద్దు పెట్టుకునేటప్పుడు చర్మం నుంచి చర్మానికి స్పర్శ, లాలాజలంతో ఎస్టీడీల వ్యాప్తికి కారణమవుతుంది. ముఖ్యంగా ఒకరికి ఇన్ఫెక్షన్ లేదా నోటి పుండ్లు ఉన్నప్పుడు సంక్రమణ ప్రమాదం ఎక్కువగా ఉంది.
 



సోకిన వ్యక్తిని ముద్దు పెట్టుకోవడం వల్ల మీరు పొందే ఎస్టీడీలు ఇవే..

హెర్పెస్: హెర్పెస్ సింప్లెక్స్ వైరస్ రెండు రకాలు అవి:

హెచ్ఎస్వి -1:  దీనిని ఓరల్ హెర్పెస్ అని కూడా అంటారు. ఇది ముద్దు పెట్టుకోవడం వల్ల చాలా సులభంగా వ్యాపిస్తుంది. దీనివల్ల నోరు లేదా జననేంద్రియాలపై ఎరుపు లేదా తెలుపు బొబ్బలు అవుతాయి. ఈ వైరస్ ప్రధానంగా పుండును తాకడం లేదా ముద్దు పెట్టుకోవడం లేదా ముద్దు పెట్టుకునేటప్పుడు లేదా పాత్రలను పంచుకునేటప్పుడు లాలాజలం మార్పిడి ద్వారా వస్తుంది. 
 


హెచ్ఎస్వి -2: దీనిని జననేంద్రియ హెర్పెస్ అని కూడా అంటారు. ఇది సాధారణంగా లైంగిక సంబంధం ద్వారా వ్యాపిస్తుంది. నోటి నుంచి నోటికి కూడా సోకుతుంది. దీని లక్షణాలు హెచ్ఎస్వి -1 మాదిరిగానే ఉంటాయి.

2. సైటోమెగలోవైరస్: ఇది లాలాజలం ద్వారా వ్యాపించే వైరస్. గొంతునొప్పి, అలసట, ఒళ్లు నొప్పులు, జ్వరం ఈ వైరస్ లక్షణాలు. ఇది ఈ కింది వాటి ద్వారా కూడా వ్యాప్తి చెందుతుంది:

మూత్రం
చనుబాలు
రక్తం


3. సిఫిలిస్: ఇది బాక్టీరియల్ ఇన్ఫెక్షన్. ఇది సాధారణంగా నోటి, ఆనల్ లేదా జననేంద్రియ సెక్స్ ద్వారా వ్యాపిస్తుంది. ఇది సాధారణంగా నోటిలో పుండ్లను కలిగిస్తుంది. ఇది ముద్దు ద్వారా బ్యాక్టీరియా సంక్రమణను మరింత బదిలీ చేస్తుంది. దీని లక్షణాలు ఇలా ఉంటాయి..

గొంతు నొప్పి
తలనొప్పి
జ్వరం
జుట్టు రాలడం
ఒళ్లు నొప్పులు
అసాధారణ మొటిమలు
దృష్టి నష్టం
గుండె సమస్యలు
జ్ఞాపకశక్తి కోల్పోవడం
మెదడు దెబ్బతినడం

Latest Videos

click me!