వాడిన నూనెను మళ్లీ ఎలా వాడాలి..?
పూరీలు, బూరెలు లాంటివి వండినప్పుడు.. కాచిన నూనె అడుగుభాగం మురికిగా తయారౌతుంది. అంటే మిగిలిన పార్టికల్స్ నూనె అడుగుభాగంలో మిగిలిపోతాయి. అందుకే.. ఆ నూనెను మళ్లీ చాలా మంది వాడటానికి ఇష్టపడరు. కానీ.. ఆ నూనెను ఉపయోగించి ఇంట్లోకి కీటకాలు రాకుండా చేయవచ్చు. మీరు నూనెను మరో గిన్నెలోకి ఫిల్టర్ చేయాలి. ఇప్పుడు ఆ నూనెలో లవంగాలు, నిమ్మకాయ ముక్క వేయాలి. ఇప్పుడు అందులో దీపం వత్తి వేసి వెలిగించాలి. ఇలా వెలిగించడం వల్ల ఇంట్లోకి దోమలు, కీటకాలు రాకుండా ఆపగలం.