తామరతుడుల్లాంటి చేతివేళ్లు కావాలని అందరూ కోరుకుంటారు. అంతేకాదు ఈ వేళ్లు అందంగా, ఆరోగ్యంగా ఉండాలని అనేక రకాల ప్రయత్నాలు చేస్తారు. ఇందులో భాగంగానే గోర్లకు రకరకాల నెయిల్ పాలిష్ లతో అలంకరిస్తారు. అయితే నెయిల్ పాలిష్ ఎక్కువకాలం పెచ్చులు పోకుండా ఉండడం అనేది పెద్ద టాస్క్.
నెయిల్ పాలిష్ పెట్టుకున్న ఒకటి రెండు రోజుల్లోనే పోతూ ఉంటుంది. మరెలా.. ఇలా కాకుండా ఎక్కువ కాలం ఉండాలంటే ఏం చేయాలి? అంటే కొన్ని సులువైన చిట్కాలతో నెయిల్ పాలిష్ ఎక్కువకాలం పెచ్చులూడిపోకుండా ఉంచుకోవచ్చు.
కొన్నిరకాల నెయిల్ పాలిష్ లు కూడా పెట్టిన గంటకే ఊడిపోతూ ఉంటాయి. వీటిని వాడాలంటే తెగ చికాకు పెడుతుంది. ఇలాంటి పాలిష్ లకు ఎంత దూరంగా ఉంటే అంత మంచిది.
నెయిల్ పాలిష్ పెట్టుకునేముందు చేతుల్ని బాగా శుభ్రంగా కడుక్కోవాలి. కడుక్కోకపోవడం వల్ల గోర్ల మీద తేలికగా ఆయిలీగా ఉంటే.. పెయింట్ సరిగా అతుక్కోదు.
నెయిల్ పాలిష్ ఎక్కువ కాలం తాజాగా, ఊడిపోకుండా ఉండాలంటే తొందరగా డ్రై అయ్యే నెయిల్ పాలిష్ లు వాడొద్దు. ఎంత తొందరగా నెయిల్ పాలిష్ ఆరిపోతే అంత తొందరగా ఊడిపోతుందని అర్థం.
నెయిల్ పాలిష్ వేసుకునేముందు తప్పనిసరిగా బేస్ కోట్ వేయాలి. చాలా మంది బేస్ కోట్ వేయకుండా నేరుగ నెయిల్ పాలిష్ పెట్టుకుంటారు. దీనివల్ల పాలిష్ త్వరగా ఊడిపోయి అసహ్యంగా తయారవుతుంది. ప్లెయిన్ పెయింట్స్ కంటే మెరుపులతో ఉండే షిమ్మరీ పాలిష్ లే ఎక్కువ కాలం ఉంటాయి. అందుకే ఇలాంటి వాటిని ప్రిఫర్ చేయండి.
నెయిల్ పాలిష్ వేసుకున్న తరువాత ఎంత సేపు ఆరబెడుతున్నారు? పదినిమిషాలా..? అయితే ఇది కరెక్ట్ టైం కాదు.. కనసం 30 నిమిషాల పాటు పాలిష్ ను ఆరనివ్వాలి.. అప్పుడే పాలిష్ పోకుండా ఉంటుంది.
ఒక వేళ ఇన్ని జాగ్రత్తలు తీసుకున్నా.. రెండు,మూడు రోజులకే పాలిష్ చిన్న చిన్న పగుళ్లు వస్తే టచప్ చేయండి. ఇలా రెగ్యులర్ టచప్స్ తో ఎక్కువ కాలం నెయిల్ పాలిష్ ను ఉండేలా చేసుకోవచ్చు.
నెయిల్ పాలిష్ వేసుకునేముందు చేతుల్ని మాయిశ్చరైజ్ చేయడం మరిచిపోవద్దు. పొడిగా ఉండే గోళ్ల కంటే మాయిశ్చరైజ్ చేసిన గోళ్ల మీద నెయిల్ పాలిష్ ఎక్కువ కాలం నిలుస్తుంది.