నగ్నంగా పడుకుంటే.. పురుషుల్లో ఆ సామర్థ్యం పెరుగుతుందట..

First Published Sep 1, 2021, 12:29 PM IST

పురుషుల సంతానోత్పత్పి సామర్థ్యం మీద కూడా నగ్నంగా పడుకోవడం సానుకూల ప్రభావం చూపిస్తుంది. బిగుతుగా ఉండే అండర్ వేర్లు వేసుకుని పడుకోవడం వల్ల వృషణాల ఉష్ణోగ్రతను పెంచుతుంది. దీని వల్ల స్పెర్మ్ కౌంట్, స్పెర్మ్ యాక్టివిటీ మీద ప్రభావం పడుతుంది. 

కొంత మందికి నగ్నంగా పడుకుంటేనే నిద్ర వస్తుంది. ఒంటిమీద నూలు పోగు అనేది లేకుండా పడుకోవడం వారికి హాయిగా ఉంటుంది. అయితే ఇలా పడుకోవడం వల్ల కలిగే ప్రయోజనాలు గురించి పక్కా ఆధారాలు లేవు.. కానీ విభిన్న ఆధ్యయనాలు మాత్రం అనేక ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయని చెబుతున్నాయి. 

nude sleep

నగ్నంగా పడుకోవడం వల్ల తొందరగా నిద్ర పడుతుందట. నిద్ర పట్టడంలో బాడీ టెంపరేచర్ ప్రముఖ పాత్ర పోషిస్తుంది. శరీర ఉష్ణోగ్రత తగ్గడం వల్ల తొందరగా నిద్ర పడుతుంది. నగ్నంగా పడుకోవడం వల్ల శరీరం ఉష్ణోగ్రత తొందరగా తగ్గుతుంది. దీనివల్ల తొందరగా నిద్రలోకి జారుకుంటారు. 

పడుకునే సమయంలో శరీర ఉష్ణోగ్రత తగ్గడం అనేది తొందరగా నిద్ర పట్టడానికే కాదు.. మీ మొత్తం నిద్రనూ ప్రభావితం చేస్తుంది. అందుకే మామూలుగా బెడ్ రూంలో టెంపరేచర్ 15 నుంచి 19 సెంటిగ్రేడ్ ఉండాలని చెబుతారు. 

సరిగా నిద్రలేకపోవడం వల్ల చర్మం మీద అయ్యే చిన్న చిన్న గాయాలు కూడా తగ్గడానికి చాలా సమయం పడుతుంది. అదే రాత్రి పూట మంచి నిద్ర పోయినట్లైతే మీ చర్మం గాయాలు త్వరగా తగ్గడమే కాకుండా.. ఆరోగ్యవంతంగా తయారవుతుంది. 

నగ్నంగా పడుకోవడం వల్ల శరీరానికి బాగా గాలి తగులుతుంది. యోనిలో కాండిడా ఈస్ట్ పెరగకుండా అడ్డుకుంటుంది. కాండిడా ఈస్ట్ పెరగడం వల్ల ఈస్ట్ ఇన్ఫెక్షన్ బారిన పడతారు. ఇది యోనిలోని మ్యూకస్ మెంబ్రైన్ మీద ప్రభావం చూపించి.. దురద, నొప్పి, మంటకు కారణమవుతుంది. 

ఇక పురుషుల సంతానోత్పత్పి సామర్థ్యం మీద కూడా నగ్నంగా పడుకోవడం సానుకూల ప్రభావం చూపిస్తుంది. బిగుతుగా ఉండే అండర్ వేర్లు వేసుకుని పడుకోవడం వల్ల వృషణాల ఉష్ణోగ్రతను పెంచుతుంది. దీని వల్ల స్పెర్మ్ కౌంట్, స్పెర్మ్ యాక్టివిటీ మీద ప్రభావం పడుతుంది. 

ఇక స్త్రీల సంతానోత్పత్తి మీద కూడా నగ్నంగా పడుకోవడం మంచి ప్రభావమే చూపిస్తుంది. నగ్నంగా నిద్రపోవడం వల్ల యోనిలో ఈస్ట్ ఇన్ఫెక్షన్ వచ్చే ప్రమాదం తగ్గుతుంది. అందుకే చాలా మంది గైనకాలజిస్టులు కమాండోని నివారణ చర్యగా సిఫార్సు చేస్తున్నారు. ఒకవేళ మీకు లోదుస్తులు లేకుండా పడుకోవడం అంత సౌకర్యవంతంగా లేకపోతే, వదులుగా ఉండే దుస్తులు వాడొచ్చు. 

naked

దీనివల్ల లైంగిక జీవితమూ ప్రభావితం అవుతుంది. మీ భాగస్వామితో దగ్గరితనం పెరుగుతుంది. చర్మం  తక్కువ ఇంటెసిటీ స్టిమ్యులేషన్‌కు ప్రతిస్పందనగా ఆక్సిటోసిన్ విడుదల చేయబడిందని ఒక అధ్యయనం చూపించింది. ఉదా. తాకడం, స్ట్రోకింగ్ ఇలా... అయితే మీరు నగ్నంగా పడుకోవడం వల్ల మీ భాగస్వామితో శారీరక సాన్నిహిత్యం పెరిగి తద్వారా అధిక ఆక్సిటోసిన్ విడుదలకు కారణమవుతుంది. 

సరిగా నిద్రలేకపోవడం వల్ల శారీరక ఆరోగ్యం దెబ్బతిని రోగనిరోధక వ్యవస్థ ప్రభావితం అవుతుంది. దీనివల్ల వైరల్ ఇన్ఫెక్షన్లు ఎక్కువగా వస్తాయి. నగ్నంగా పడుకోవడం వల్ల వ్యాధుల్ని దూరంగా ఉంచే అవకాశం ఉంది. 

click me!