ఇలా చేస్తే.. ఎక్సర్ సైజ్ చేయకుండానే మీ పొట్ట, బరువు రెండూ తగ్గుతాయి

First Published | Sep 12, 2024, 3:05 PM IST

వ్యాయామం చేసే టైం అందరికీ ఉండకపోవచ్చు. కానీ వ్యాయామం చేయకపోతే బరువు పెరుగుతుంది. పొట్ట కూడా బాగా పెరిగిపోతుంది.                                                                                                                       
 

belly fat


నేటి బిజీ లైఫ్ లో ఒత్తిడి ప్రతి ఒక్కరి జీవితంలో సర్వ సాధారణ సమస్యగా మారిపోయింది. అది పని ఒత్తిడి కావొచ్చు. ఇంటి బాధ్యతల వల్ల కలిగే ఒత్తిడి కావొచ్చు. భవిష్యత్తు గురించి కావొచ్చు.

రోజూ ఏదో ఒక విధంగా ఒత్తిడికి గురవుతూనే ఉంటారు. కాన ఈ ఒత్తిడి మానసిక ఆరోగ్యాన్నే కాదు శారీరక ఆరోగ్యాన్ని కూడా దెబ్బతీస్తుంది. 

దీర్ఘకాలిక ఒత్తిడి వల్ల గుండె జబ్బులు వస్తాయి. అలాగే  ఊబకాయం, అధిక రక్తపోటుతో పాటుగా ఎన్నో అనారోగ్య సమస్యలు వస్తాయి. అందుకే ఈ ఒత్తిడిని తగ్గించుకోవడానికి ప్రయత్నం చేయాలి. మీరు ఆరోగ్యంగా, హెల్తీగా ఉండటానికి, వ్యాయామం చేయకుండా బరువు తగ్గడానికి ఏం చేయాలో ఇప్పుడు తెలుసుకుందాం పదండి. 
 

Belly Fat

ఆరోగ్యకరమైన ఆహారం 

పొట్ట తగ్గడానికి మీరు చేయాల్సిన ముఖ్యమైన పని ఆరోగ్యకరమైన ఆహారాన్ని తినడం. అవును మీరు తినే ఆహారం ఎంత హెల్తీగా ఉంటే.. మీరు బరువు అంత తొందరగా తగ్గుతారు. అనారోగ్యకరమైన ఫుడ్ ను తింటే శరీరంలో కొవ్వు అస్సలు తగ్గదు. 

మీరు వ్యాయామం చేయకుండా బరువు తగ్గాలంటే మాత్రం ఆకుకూరలు, పండ్లు, తృణధాన్యాలు, పప్పుధాన్యాలు వంటి ఫైబర్  కంటెంట్, ప్రోటీన్లు పుష్కలంగా ఉండే ఆహారాలను తినాలి. ఫైబర్ కంటెంట్ మీ కడుపును చాలా సేపటి వరకు నిండుగా ఉంచి మీరు అతిగా తినకుండా చేస్తుంది. ఇది మీరు బరువు తగ్గడానికి సహాయపడుతుంది.
 


చక్కెర, ప్రాసెస్ చేసిన ఆహారాలు వద్దు 

చక్కెర,  ప్రాసెస్ చేసిన ఆహారాల్లో కేలరీలు ఎక్కువ మొత్తంలో ఉంటాయి. కానీ ఇవి నేరుగా మీ పొట్టపైనే పేరుకుపోతాయి. ముఖ్యంగా చక్కెర పానీయాలు, స్నాక్స్ ను తగ్గిస్తేనే మీ పొట్ట తగ్గుతుంది. ఇది మీ ఇన్సులిన్ లెవెల్స్ ను నియంత్రిస్తుంది. అలాగే బెల్లి ఫ్యాట్ తగ్గుతుంది. మీకు స్వీట్ తినాలనిపిస్తే  బెల్లం, ఖర్జూరం వంటి హెల్తీ ఫుడ్స్ ను తినండి. 


బాగా నిద్రపోవడానికి ప్రయత్నించండి.

మీరు ఎంత బాగా నిద్రపోతే అంత తొందరగా బరువు తగ్గుతారు. మీకు తెలుసా? సర్వ రోగాలకు మూలం నిద్రసరిగ్గా పోకపోవడం. దీనివల్ల మీ శరీరంలో ఆకలిని నియంత్రించే హార్మోన్లను అసమతుల్యంగా అవుతాయి.

నిద్రలేమి మీ ఆకలిని పెంచుతుంది. ఇది మీరు బాగా బరువు పెరగడానికి దారితీస్తుంది. అందుకే ప్రతిరోజూ 7 నుంచి 8 గంటల పాటు నిద్రపోయేలా చూసుకోండి. దీంతో మీ శరీరానికి తగినంత విశ్రాంతి లభిస్తుంది. అలాగే కొవ్వు కూడా కరుగుతుంది. 

belly fat

పుష్కలంగా నీరు తాగాలి

మీరు నీళ్లను పుష్కలంగా తాగితే బెల్లీ ఫ్యాట్ చాలా వరకు తగ్గుతుంది. వాటర్ మీ జీవక్రియను పెంచుతుంది. అలాగే మీ శరీరాన్ని నిర్విషీకరణ చేస్తుంది. దీంతో పొట్ట కొవ్వు తగ్గడం మొదలవుతుంది.

ఆరోగ్య నిపుణుల అభిప్రాయం ప్రకారం.. ప్రతిరోజూ తగినంత నీళ్లను తాగితే మీరు ఆరోగ్యంగా కూడా ఉంటారు. అలాగే మీ జీర్ణవ్యవస్థ మెరుగుపడుతుంది. చర్మం కూడా కాంతివంతంగా ఉంటుంది. 

నెమ్మదిగా తినండి

చాలా మంది ఏదో వెంటబడుతున్నట్టే తొందర తొందరగా తింటుంటారు. కానీ ఎప్పుడైనా సరే ఫుడ్ ను చాలా నెమ్మదిగా, బాగా నమిలి తినాలి. హడావిడిగా తినడం వల్ల చాలా తింటారు.

మీకు తెలుసా? మీరు నెమ్మదిగా తింటే మీ కడుపు తొందరగా నిండిన అనుభూతి కలుగుతుంది. దీంతో మీరు చాలా తక్కువ తింటారు. మీరు నెమ్మదిగా తింటే ఫుడ్ ను సరిగ్గా నములుతారు. ఇది మీ జీర్ణ ప్రక్రియను సులభతరం చేస్తుంది. అలాగే కడుపును ఓవర్ లోడ్ చేయదు. 

ఒత్తిడిని తగ్గించుకోండి

ఒత్తిడి వల్ల మీ శరీరంలో కార్టిసాల్ హార్మోన్ బాగా పెరుగుతుంది. ఇదే పొట్ట పెరగడానికి అసలు కారణం. అందుకే ఒత్తిడిని తగ్గించుకోవడానికి ధ్యానం, యోగా, లోతైన శ్వాస వ్యాయామాలు చేయండి.

ఇవి మీ మానసిక ఆరోగ్యాన్ని కూడా మెరుగుపరుస్తాయి. అలాగే మీరు బరువు తగ్గేలా కూడా చేస్తాయి. ఎప్పుడూ మీరు ఒత్తిడికి లోనైతే  గుండె జబ్బులు, అధిక రక్తపోటు, ఊబకాయం, మానసిక సమస్యలు వస్తాయి. 
 

Latest Videos

click me!