చలికాలంలో పెదవులను ఎలా సంరక్షించుకోవాలి : గుర్తుంచుకోండి:
1. పెదవులు తేమగా ఉంటే పగుళ్లు ఏర్పడవు. ఇందుకోసం మీరు వాజ్ లైన్ వాడొచ్చు. ఇది మీ పెదవులను మృదువుగా ఉంచుతుంది. పగుళ్లు ఏర్పడకుండా రక్షిస్తుంది.
2. ఒక్క మన చర్మానికి మాత్రమే కాదు.. పెదవులకు కూడా ఎండ నుంచి రక్షణ అవసరం. కాబట్టి పగటివేళ మీరు బయటకు వెళితే.. ఎస్‌పీఎఫ్ ఉన్న లిప్ బామ్ ను వాడండి. ఇది అతినీలలోహిత కిరణాల వల్ల కలిగే నష్టం నుంచి మీ పెదవులను రక్షిస్తుంది.
3. చాలా మందికి పెదవులను కొరికే లేదా నాకే అలవాటు ఉంటుంది. కానీ ఇది అస్సలు మంచిది కాదు. ఎందుకంటే ఇది కూడా పెదవులు పగలడానికి కారణమవుతుంది. కాబట్టి మీకు ఈ అలవాటుంటే వెంటనే మానుకోండి.
4. మీ పెదవులు పగిలితే లిప్‌స్టిక్ ను అస్సలు వాడకండి. లేదంటే పెదవులు మరింగ పగులుతాయి.