ఇలా చేస్తే.. తల్లి అయిన తర్వాత కూడా మీ చర్మ సంరక్షణ భేష్....

First Published Sep 7, 2021, 11:00 AM IST

తల్లిగా, గృహిణిగా, ఉద్యోగినిగా బాధ్యతలు నిర్వహిస్తూనే మీ చర్మ సంరక్షణకు చిన్న చిన్న చిట్కాలు పాటిస్తే సరిపోతుంది. దీనికోసం ప్రత్యేకంగా సమయం వెచ్చించాల్సిన అవసరం లేదు. చేసేపనిలోనే కాసింత జాగ్రత్తలు తీసుకుంటే సరిపోతుంది. అటు బాధ్యతలతో పాటు, మీ ఆరోగ్యమూ, అందమూ బాగుంటాయి. 

కొత్తగా తల్లులైన వారికి పని తెమలదు. ఇక ఉద్యోగాలు చేస్తుంటే.. చెప్పాల్సిన పనిలేదు. ఓ వైపు పిల్లల బాధ్యతలు, ఇంటిపని, ఆఫీస్ వర్క్.. వీటిమధ్య కనీసం సరిగా కునుకు తీయడానికి కూడా సమయం దొరకదు. ఈ సమయంలోనే మహిళలు తమ మీద తాము నిర్లక్షం చూపిస్తారు. తమని తాము అంతగా పట్టించుకోరు. ఇది వారి చర్మ సంరక్షణ విషయంలో బాగా కనిపిస్తుంది. 

తల్లిగా, గృహిణిగా, ఉద్యోగినిగా బాధ్యతలు నిర్వహిస్తూనే మీ చర్మ సంరక్షణకు చిన్న చిన్న చిట్కాలు పాటిస్తే సరిపోతుంది. దీనికోసం ప్రత్యేకంగా సమయం వెచ్చించాల్సిన అవసరం లేదు. చేసేపనిలోనే కాసింత జాగ్రత్తలు తీసుకుంటే సరిపోతుంది. అటు బాధ్యతలతో పాటు, మీ ఆరోగ్యమూ, అందమూ బాగుంటాయి. అవేంటో చూడండి..

మంచి సమతుల ఆహారం : మచ్చలు,ముడతలు లేని ఆరోగ్యవంతమైన చర్మం అనేది అంతర్గతమైన విషయం. ఇది మీ ఆరోగ్యానికి ప్రతిబింబం. అందుకే ప్రతిరోజూ మీరు తినే ఆహారంలో జాగ్రత్త వహించాలి. దీని ద్వారా మీ చర్మాన్ని హెల్తీగా ఉంచుకోవచ్చు. రక్షణ కల్పించొచ్చు. 

దీంతోపాటు బాగా నీళ్లు తాగండి. కాలానుగుణంగా దొరికే పండ్లు తినండి. ఆకుకూరలు, కూరగాయలు, చేపలు, పండ్లు, చక్కెర, జంక్, ఎరేటెడ్ పానీయాలు వంటి యాంటీఆక్సిడెంట్‌లు అధికంగా ఉండే ఆహారాన్ని తీసుకోవడం వల్ల మీ చర్మం యవ్వనంగా, మెరుస్తూ, ఆరోగ్యంగా ఉంటుంది.

మంచి ఫేస్ క్లెన్సర్ ను వాడండి. క్లెన్సింగ్ అనేది చర్మ సంరక్షణలో ప్రాథమిక దశ. మీ చర్మ రకానికి అనువైన ఆర్గానిక్, రసాయన రహిత ఫేస్ క్లెన్సర్ లనే వీలైనంత వరకు వాడండి. ఇవి ముఖంమీద పేరుకున్న అదనపు నూనె /ధూళిని తొలగించడంలో సహాయపడతాయి. క్లెన్సర్ తో చర్మం మృధువుగా తయారవుతుంది. అలాగే ముఖం కడుక్కున్న తరువాత మీ చర్మం పొడిబారకుండా మీ క్లెన్సర్ తేమను లాక్ చేస్తే మంచిది.

మీ చర్మానికి మంచి స్నేహితులు ఎవరో తెలుసా.. మాయిశ్చరైజర్, సన్‌స్క్రీన్. చర్మానికి ప్రతిరోజూ మాయిశ్చరైజర్‌తో మసాజ్ చేయాలి. మీ చర్మంకోల్పోయిన నీటి శాతాన్ని తిరిగి పూరించడానికి మాయిశ్చరైజర్ చాలా అవసరం. మాయిశ్చరైజర్ వల్ల మీ మేకప్ కూడా స్థిరంగా ఉంటుంది. అందుకే దీన్ని మేకప్ వేసుకునే ముందుకానీ, ఫౌండేషన్ స్థానంలో వాడొచ్చు. మాయిశ్చరైజర్లలోనూ టింటెడ్ మాయిశ్చరైజర్లను వాడితే ఫౌండేషన్ వాడని తేడా తెలియకుండా ఉంటుంది. 

ఆల్ ఇన్ వన్ ప్రొడక్ట్ లను వాడండి.. యాంటీ-ఏజింగ్ ఎఫెక్ట్ కోసం హైఅలురోనిక్ యాసిడ్, యాంటీఆక్సిడెంట్స్ ఉన్న ఎస్ పిఎఫ్ ఉన్న లేతరంగు మాయిశ్చరైజర్‌లను ఎంచుకోండి. మంచి సన్‌స్క్రీన్‌ను వాడండి. దీనివల్ల సూర్యుడి నుండి వచ్చే యూవీ కిరణాల వల్ల మీ చర్మం దెబ్బతినకుండా, ముడతలు, మచ్చలు వంటి వృద్ధాప్య సంకేతాలను తగ్గిస్తుంది. మీ పిల్లలతో బయట తిరగాల్సి వచ్చినప్పుడు, ఆరుబయట పనులు చేస్తున్నప్పుడు.. వంట  సమయాల్లో ఇది చాలా ముఖ్యం. 

పడుకున్నప్పుడు పనిచేసే సీరమ్‌ వాడండి. బిడ్డలకు జన్మనివ్వడి స్త్రీకి పునర్జన్మ. దీనివల్ల శరీరానికి అదనపు బూస్ట్ అవసరం, చర్మం కూడా కొన్నిసార్లు అలసిపోతుంది. యాంటీ-ఏజింగ్ ఎసెన్స్‌తో నైట్ క్రీమ్/లోషన్/సీరం ఉపయోగించడం వల్ల అలిసిన చర్మానికి స్వాంతన కల్పించొచ్చు. ఈ సీరంను పడుకునేముందు ముఖానికి రాసుకోండి. ఫోన్‌ను దూరంగా పెట్టేయండి. ప్రశాంతమైన సంగీతాన్ని వింటూ, మీ పిల్లల్ని గట్టిగా హత్తకుని పడుకోండి. దీనివల్ల మీ చర్మం చాలా యవ్వనంగా కనిపిస్తుంది.

skin care

అయితే, ఇవి ప్రతిరోజూ మీ దినచర్యలో తప్పనిసరి భాగం కావాలి. ఎంత ఒత్తిడి ఉన్నా... వీటిని మీ డెయిలీ రొటీన్ లో చేర్చాల్సిందే. అప్పుడే మరు మృదువైన, యవ్వన, ప్రకాశవంతమైన చర్మాన్ని ఆస్వాదిస్తారు.

దీంతోపాటు పూర్తి ఆరోగ్యం కోసం నిత్యం ప్రకృతిలో 20 నిమిషాల నడక, పిల్లలతో ఆడుకోవడం మూడ్‌ని మెరుగుపరిచే, ఒత్తిడిని తగ్గించే హార్మోన్‌లను సృష్టిస్తుందని అధ్యయనాలు చెబుతున్నాయి. సూపర్ మామ్ లా అలిసిపోతూ పనిచేయడం కంటే.. పనుల్లో చిన్న చిన్న బ్రేక్ లు తీసుకుంటూ.. పిల్లలతో పాటూ ఆడుతూ, పాడుతూ గడపడం వల్ల కూడా మీ చర్మం యవ్వనంగా ఉంటుంది.

పిల్లల ఎదుగుదలను ఆస్వాదించండి. వారితో కలిసి మీరూ కొత్త విషయాలు నేర్చుకోండి. వారితో మాట్లాడండి, నవ్వండి, ఆడండి.. వారిని గట్టిగా హత్తుకోండి. వారితో పాటు ఆదమరిచి నిద్రపోండి. ఇవి మీ చర్మాన్ని మరింత యవ్వనంగా మారుస్తాయి. 

click me!