- మీ ఓవెన్‌ను 350°F (175°C)కి వేడి చేయండి. హార్ట్ షేప్ కేక్ పాన్‌ను గ్రీజ్ చేసి, మైదా చల్లి పక్కన పెట్టుకోవాలి.
- ఒక గిన్నెలో, మైదా, బేకింగ్ పౌడర్, బేకింగ్ సోడా, ఉప్పు, కోకో పౌడర్‌లను కలిపి పెట్టండి.
- మరొక పెద్ద గిన్నెలో, చక్కెర, నూనె బాగా కలిసే వరకు కలపండి. ఒక్కొక్కటిగా గుడ్లు వేసి, ప్రతిసారీ బాగా కలపాలి. బట్టర్ మిల్క్, వెనిల్లా ఎసెన్స్, వెనిగర్, బీట్రూట్ గుజ్జు కలపండి.
- బ్యాటర్‌ను తయారుచేసిన కేక్ పాన్‌లో పోయాలి.
- ముందుగా వేడిచేసిన ఓవెన్‌లో 25-30 నిమిషాలు బేక్ చేయండి.
- ఓవెన్ నుంచి కేక్‌ను తీసి 10 నిమిషాలు పాన్‌లో చల్లారనివ్వండి.
క్రీమ్ చీజ్ ఫ్రాస్టింగ్ తయారు చేయండి
- ఒక పెద్ద గిన్నెలో, మెత్తబడిన వెన్న, క్రీమ్ చీజ్‌ను క్రీమీగా అయ్యే వరకు కలపండి. క్రమంగా చక్కెర, వెనిల్లా ఎసెన్స్ వేసి కలపండి. మెత్తగా అయ్యే వరకు కలపాలి.
- కేక్ పూర్తిగా చల్లబడిన తర్వాత, క్రీమ్ చీజ్ ఫ్రాస్టింగ్ చేయండి.
- ఫ్రాస్టింగ్ సెట్ కావడానికి కనీసం 30 నిమిషాలు రిఫ్రిజిరేటర్‌లో కేక్‌ను చిల్ చేయండి. తర్వాత కట్ చేసి మీ భాగస్వామితో ఆస్వాదించండి.