Cleaning Hack: మాడిపోయిన స్టీల్ గిన్నెలను శెనగపిండితో సులువుగా మెరిపించేయండి

Published : Aug 02, 2026, 08:02 AM IST

Cleaning Hack: వంటగదిలో స్టీల్ గిన్నెలు వాడుతున్నవారి సంఖ్య అధికంగానే ఉంది.  కానీ ఒక్కోసారి అవి మాడిపోతూ ఉంటాయి. మొండి మరకలు వాటి నుంచి త్వరగా పోవు. అలాంటప్పుడు చిన్ని చిట్కాల ద్వారా స్టీల్ గిన్నెలను తిరిగి మెరిసేలా చేయవచ్చు.

PREV
14
స్టీల్ గిన్నెలు మాడిపోతే

ఇప్పుడు స్టీల్ గిన్నెలనే ఎక్కువగా వాడుతున్నారు. రోజులు గడుస్తున్న కొద్దీ అవి మెరుపు కోల్పోతాయి. ఒక్కోసారి ఆ గిన్నెల్లో కూరలు, అన్నం వంటివి మాడిపోయినా మామూలు సబ్బుతో తోమితే పోవు. అలాంటప్పుడు ఇంట్లోనే చిన్న చిట్కాలను ఫాలో అయితే సరిపోతుంది. మీ ఇంట్లో ఉండే శెనగపిండే చాలు స్టీలు గిన్నెలను తళతళలాడేలా చేస్తుంది.

24
ఇలా చేయండి

మాడిపోయిన స్టీలు గిన్నెలు తోమేందుకుశనగపిండి - 2 చెంచాలు, బేకింగ్ సోడా - 1 టేబుల్ స్పూన్, నిమ్మకాయ - 1, వెనిగర్ - అవసరమైనంత తీసుకోండి. ఒక చిన్న గిన్నె తీసుకుని, అందులో రెండు చెంచాల శనగపిండి, ఒక చెంచా బేకింగ్ సోడా వేయండి. దీనిలో ఒక నిమ్మకాయ రసం పిండండి. తర్వాత కొద్దిగా వెనిగర్ కలపండి. వెనిగర్, బేకింగ్ సోడా కలవగానే నురుగు వస్తుంది. ఈ పదార్థాలన్నింటినీ బాగా కలిపి చిక్కటి పేస్ట్ లా చేసుకోండి. పిండేసిన నిమ్మచెక్కలను పడేయకండి. వాటితోనే గిన్నెలను తోమాలి.

34
నిమ్మ చెక్కతో తోమేయండి

మాడిపోయిన గిన్నెలను ముందుగానే నీళ్లు పోసి ఒక గంట పాటూ నానబెట్టండి. ఇప్పుడు నిమ్మ చెక్కను తీసుకుని ముందుగా రెడీ చేసుకున్న పేస్ట్‌లో ముంచి, మరకలు ఉన్నచోట రుద్దండి. శనగపిండి జిడ్డును పీల్చుకుంటుంది. బేకింగ్ సోడా, వెనిగర్ మరకలను సులభంగా తొలగిస్తాయి. నిమ్మకాయ గిన్నెకు సహజమైన మెరుపును అందిస్తుంది.

44
చల్లటి నీటితో కడగండి

గిన్నెను బాగా తోమాక  ఒక కిచెన్ టవల్ లేదా పొడి వస్త్రం ==తో ఒకసారి తుడవండి. దీనివల్ల వదులుగా మారిన మరకలు వస్త్రానకి అతుక్కుంటాయి.  తరువాత శుభ్రమైన చల్లటి నీటితో గిన్నెను కడిగేయండి. ఇలా చేస్తే మీ పాత స్టీల్ గిన్నెలు కూడా తళతళ మెరుస్తాయి. ఇందులో హానికర రసాయనాలు లేవు కాబట్టి చేతులకు కూడా సురక్షితం. వారానికి ఒకసారి ఇలా చేస్తే గిన్నెలు ఎప్పుడూ కొత్తవాటిలా ఉంటాయి.

Read more Photos on
click me!

Recommended Stories