వీటితో శుభ్రం చేసినా దుర్వాసన పోవాల్సిందే..
3. వెనిగర్ (Vinegar):
వైట్ వెనిగర్ క్లీనింగ్ ఏజెంట్‌గా చాలా పవర్‌ఫుల్ గా పని చేస్తుంది. ఒక గ్లాసు నీటిలో ఒక టేబుల్ స్పూన్ వెనిగర్ కలిపి ఆ మిశ్రమాన్ని బాక్సులో పోయండి. ఒక గంట తర్వాత సబ్బుతో కడిగేయండి. ఇది బ్యాక్టీరియాను అరికడుతుంది. వాసనను కూడా తొలగిస్తుంది.
4. న్యూస్ పేపర్ ట్రిక్ (Newspaper Trick):
ఇది వినడానికి వింతగా ఉన్నా చాలా బాగా పనిచేస్తుంది. రాత్రిపూట లంచ్ బాక్స్ కడిగి ఆరిన తర్వాత, ఒక న్యూస్ పేపర్‌ను ముక్కలుగా చేసి బాక్సులో పెట్టి మూత పెట్టేయండి. న్యూస్ పేపర్ లోని కార్బన్ ప్లాస్టిక్ లో ఉన్న చెడు వాసనను పీల్చుకుంటుంది. ఉదయం పేపర్ తీసేసి ఒక్కసారి నీటితో కడిగితే సరిపోతుంది.
5. కాఫీ పొడి (Coffee powder ):
కాఫీ పొడిలో వాసనలను పీల్చుకునే గుణం ఉంటుంది.కొద్దిగా కాఫీ పొడిని బాక్సులో వేసి మూత పెట్టి ఒక రోజంతా ఉంచండి. ఇది ప్లాస్టిక్ వాసనను పోగొట్టి మంచి ఎరోమాను ఇస్తుంది.