Yawning: ఆవలింతలు రావడానికి అసలు కారణం ఇదా?

Published : Jan 30, 2022, 02:54 PM ISTUpdated : Jan 30, 2022, 02:59 PM IST

Yawning: అరేయ్ తెల్లందాక పడుకోలేదారా.. పొద్దు పొద్దున్నే ఆవలింతలు వస్తున్నాయి. అంటూ ఏవరైనా ఆవలిస్తే మందలిస్తూ ఉంటారు. నిజానికి ఆవలింతలకు నిద్రకు ఎటువంటి సంబంధం లేదు తెలుసా.. మరి ఆవలింతలు ఎందుకొస్తాయని మీకు డౌట్ రావొచ్చు. ఇందుకు బలమైన కారణమే ఉంది.

PREV
14
Yawning: ఆవలింతలు రావడానికి అసలు కారణం ఇదా?

Yawning: క్లాస్ వింటుంటేనో,  వర్క్ చేస్తుంటేనో చాలా మంది విరామం లేకుండా ఆవలిస్తూనే ఉంటారు. మరికొందరైతే పొద్దున లేచాకా కూడా ఓ గంట పాటు ఆవలిస్తూనే ఉంటారు. ఇక మరికొందరికి సాయంత్రం అయితే చాలు ఆవలింపులు ఎక్కువవుతూనే ఉంటాయి. ఎవరు ఆవలించినా.. ఎదుటివారి నుంచి వచ్చే మాటేంటో తెలుసా.. నీకు నిద్ర వస్తుంది అందుకే ఆవలిస్తున్నావంటూ చెబుతుంటారు. ఆవలింత వస్తే అది నిద్రకు సూచికగా చెప్తుంటారు. ఈ సిద్దాంతాన్నే చాలా మంది నమ్ముతుంటారు. ఎందుకంటే వారికి ఆవలింతలు ఎందుకు వస్తాయో అసలు కారణం తెలియదు గనక. నిజానికి అందరూ భావించినట్టుగా ఆవలింతలు నిద్ర సరిపోకపోతే రావు. మీకు నిద్ర వస్తుందని అని సూచనలిచ్చేవి అసలే కావు. మరి ఆవలింతలు ఎందుకు వస్తాయో.. ఇవి రావడానికి అసలు కారణమేంటో ఇప్పుడు తెలుసుకుందాం.

24


ఆవలింతలు ఎప్పటినుంచి స్టార్ట్ అయ్యాయంటే మీరేం చెప్తారు.. హా ఏముంది నేను పుట్టినప్పటి నుంచి ఆవలిస్తూ ఉండొచ్చు అని సమాధానమిస్తారు కదా.. కానీ మీకు తెలియని విషయమేమిటంటే ఈ ఆవలింతలు తల్లి గర్భంలో ఉన్నప్పటినుంచే మొదలవుతాయట. ఆవలింతలు వచ్చినప్పుడు అప్పుడప్పుడే తగ్గవు. ప్రతి వ్యక్తికి ఏదో ఒక సమయంలో రోజుకు ఒకసారైనా ఈ ఆవలింతలు వస్తూ ఉంటాయి. ఇలా రావడానికి ప్రధాన కారణం ఆక్సిజన్. మన బాడీలో ప్రతి కణానికి ఆక్సిజన్ సరఫరా ఎంతో ముఖ్యం. ఈ ఆక్సిజన్ను రక్తమేప్రతి కణానికి మోసుకెళ్తుంతుంది.

34

 మెదడుకు లేదా శరీరానికి కావాల్సిన ఆక్సిజన్ అందకపోతేనే ఆవలింతలు వస్తాయి. రాత్రి సమయంలో సరిగ్గా నిద్రపోని వారికి కూడా ఆక్సిజన్ సరిగ్గా అందదు. వారికి ఉదయం ఆవలింతలు వస్తాయి. అంతేకాదు అతిగా నిద్రించే వారి శరీరానికి కూడా కావాల్సిన ఆక్సిజన్ అందదు. దాంతో వారు కూడా ఆవలింతలు తీస్తారు 
 

44

మనం ఏ పనిచేసినా.. మెదడు కూడా పనిచేస్తుంది. మనం విరామం లేకుండా పనిచేసినప్పుడో లేకపోతే.. మెదడుపై ప్రెజర్ ఎక్కువైనప్పుడో మెదడు బాగా అలసటకు గురవుతుంది. నేను అలసిపోయాను అని మెదడు మనకు చెప్పాలనుకున్నప్పుడు.. ఆవలింతలు మొదలవుతాయి. అంటే మెదడు తాను అలసిపోయిన విషయాన్ని ఆవలింతల రూపంలో చెప్తుందన్నమాట. అంతేకాదు.. ఇక పనికి కాస్త బ్రేక్ ఇచ్చి కొంచెం సేపు విశ్రాంతి తీసుకోండి అని సూచనలిస్తుందట. మరొక ముఖ్యమైన విషయం ఏమిటంటే ఆవలిస్తే మెదడు రీఫ్రెష్ అవడంతో పాటుగా చరుగ్గా కూడా పనిచేస్తుంది. అందుకే ఇప్పటి నుంచి మీకు ఆవలింతలు వస్తే వాటిని ఆపుకోవడం మానేసి.. వెంటనే నోరు తెరిచి ఆవలింతలను తీసేయండి. అప్పుడే మీ మెదడు ప్రశాంతంగా ఉంటుంది. చురుగ్గా మారుతుంది. 

click me!

Recommended Stories