Apple at Night: రాత్రి నిద్రపోయే ముందు ఆపిల్ తింటున్నారా? మీకు జరిగేది ఇదే

Published : Aug 07, 2025, 08:01 PM IST

రాత్రిపూట భోజనం చేశాక కొందరికి పండ్లు తినే అలవాటు ఉంటుంది. అలా ఎంతోమంది రాత్రి నిద్రపోయే ముందు ఆపిల్ పండు తింటూ ఉంటారు. ఇలా తినడం వల్ల ఏం జరుగుతుందో తెలిస్తే వారు తినడమే మానేస్తారు. రాత్రిపూట యాపిల్ పండు తింటే ఏం జరుగుతుందో తెలుసుకోండి. 

PREV
15
రాత్రిపూట యాపిల్ తింటే

రాత్రిపూట భోజనం చేశాక ఫోన్లో సినిమా చూస్తూ ఏదైనా తినాలనిపిస్తుంది. అలాంటప్పుడు హెల్తీగా ఉన్న ఆపిల్ ని ఎక్కువమంది ఎంపిక చేసుకుంటారు. ఎందుకంటే ఆపిల్ ఎంతో ఆరోగ్యకరమైనది. తక్కువ క్యాలరీలు ఉన్నది. పడుకునే ముందు ఒక యాపిల్ తినడం మంచిదనే భావిస్తారు. కానీ రాత్రి తొమ్మిది తర్వాత ఆపిల్ తినడం ఏ మాత్రం మంచిది కాదని చెబుతున్నారు డైటీషియన్లు. ముఖ్యంగా మీరు బరువు పెరుగుతున్నా, నిద్ర పట్టడానికి ఇబ్బంది పడుతున్నా, జీర్ణక్రియ ఇబ్బందిగా సాగుతున్నా.. మీరు ఆపిల్ ని రాత్రి 9 తర్వాత తినకూడదు.

25
పొట్ట సున్నితంగా ఉంటే

రాత్రిపూట ఆపిల్ తినడం వల్ల కొన్ని రకాల నష్టాలు ఉన్నాయి. ముఖ్యంగా కొందరు పొట్ట చాలా సున్నితంగా ఉంటుంది. ఏమాత్రం పడని ఆహారం తిన్న వెంటనే గ్యాస్ ఉబ్బరం వంటివి వస్తాయి. అలాంటివారికి ఆపిల్ తిన్న తర్వాత రాత్రిపూట గ్యాస్ట్రిక్ సమస్య వచ్చే అవకాశం ఉంది. ముఖ్యంగా రాత్రిపూట జీర్ణక్రియ మందగిస్తే ఇంకా ఇబ్బందిగా ఉంటుంది. కాబట్టి సున్నితమైన పొట్ట కలిగిన వారు ఈ ఆపిల్ ను తినకపోవడమే మంచిది.

35
నీటి శాతం ఎక్కువ

అలాగే ఆపిల్ లో నీటి శాతం ఎక్కువగా ఉంటుంది. కాబట్టి యాపిల్ రాత్రిపూట తింటే మూత్ర విసర్జనకు ఎక్కువసార్లు వెళ్లాల్సి రావచ్చు. దీనివల్ల మీరు నిద్రలోంచి రెండు మూడు సార్లు లేవాల్సి వస్తుంది. ఇది నిద్రకు భంగం కలిగిస్తుంది. కొందరు కొంతమందికి తిన్న వెంటనే పడుకుంటే యాసిడ్ రిఫ్లెక్స్ వస్తుంది. అలాంటి వారు యాపిల్ తింటే ఇంకా సమస్య పెరిగిపోతుంది. మీరు యాపిల్ ఒకవేళ రాత్రిపూట తింటే వెంటనే నిద్రపోకండి. కనీసం గంట పాటు కూర్చోవడానికి ప్రయత్నించండి ఆ తర్వాతే నిద్రపోవాలి.

45
ఎరుపు రంగు యాపిలే తినాలి

రాత్రిపూట మీరు ఆపిల్ ని తినాలనుకుంటే కేవలం ఎరుపు రంగు యాపిల్ ని మాత్రమే ఎంపిక చేసుకోండి. ఇవి త్వరగా జీర్ణం అవుతాయి. అలాగే తియ్యగా ఉంటాయి. ఆపిల్ తో పాటు ఏదైనా ప్రోటీన్ ఉన్న ఆహారాన్ని తింటే మంచిది. రక్తంలో చక్కెరను ఆ రెండూ కలిపి సమతుల్యం చేస్తాయి. పొట్ట నిండినట్లు ఉంచుతాయి. అదే ఆపిల్ తిన్న తర్వాత పాలు తాగడం లేదా పాలు తాగిన తర్వాత యాపిల్ తినడం వంటివి చేయకండి. దీనివల్ల తీవ్రమైన కడుపుబ్బరం సమస్యలు రావచ్చు.

55
ఆరోగ్యకరమైన చిరుతిండి

ఆపిల్ నిజానికి ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. కానీ దాన్ని సరైన సమయానికి తినాలి. రాత్రిపూట తినడం వల్ల ఆపిల్ మనకి కీడు చేసే అవకాశమే ఎక్కువ. ఆపిల్ తినడం నిజానికి ఒక తెలివైన పనే. దాన్ని చిరుతిండిగా భావించి స్నాక్స్ టైంలో తినండి. దీనివల్ల ఆరోగ్యానికి కీడు చేసే చిరుతిళ్లను తినడంలో అరికట్టవచ్చు. జీర్ణ క్రియ కూడా ఇది మద్దతు ఇస్తుంది. నిద్రపోవడానికి కూడా సహాయపడుతుంది. కానీ రాత్రిపూట తింటే మాత్రం కడుపుబ్బరం, నిద్ర పట్టకపోవడం అంటే సమస్యలు ఎక్కువైపోతాయి.

Read more Photos on
click me!

Recommended Stories