Sleeping : మంచి పోషకవిలువలుండే ఆహారాన్ని తీసుకుంటే మీరు తొందరగా నిద్రలోకి జారుకుంటారు. ముఖ్యంగా రాత్రుళ్లు స్పైసీ ఫుడ్ ను ఎట్టిపరిస్థితిలో తినకూడదు. మీ భోజనానికి , పడుకునే సమయానికి రెండు గంటల గ్యాప్ ఉండేట్టు చూసుకోవాలి.
Sleeping : ప్రస్తుత కాలంలో నిద్రలేమి సమస్యతో బాధపడేవారి సంఖ్య రోజు రోజుకు పెరిగిపోతూనే ఉంది. నిద్రలేమి సమస్యను అంత తేలిగ్గా తీసిపారేయడానికి లేదు. ఎందుకంటే కంటినిండా నిద్రలేకపోతే సర్వరోగాలు చుట్టుకునే ప్రమాదం ఉంది. హార్ట్ బీట్ రేట్ పెరగడం, ఛాతిలో నొప్పి, అధిక రక్తపోటు వంటి సమస్యలన్నింటికీ నిద్రలేమి సమస్య కూడా ఒక కారణమని నిపుణులు చెబుతున్నారు.
211
ప్రపంచ వ్యాప్తంగా పది నుంచి ముప్పై శాతం మంది ఈ నిద్రలేమి సమస్యను ఎదుర్కొంటున్నారని పలు అధ్యయనాలు స్పష్టం చేస్తున్నాయి. నిద్రలేమి సమస్యతో హార్ట్ ప్రాబ్లమ్స్ కూడా మరింత ఎక్కువ అవుతాయట.
311
నిద్రసరిగ్గా పోకపోతే పనిపై ఏకాగ్రత తగ్గుతుంది. ఊబకాయం, అధిక రక్తపోటు, హార్ట్ ఎటాక్, హార్ట్ స్ట్రోక్, టైప్ 2 డయాబెటీస్, గుండె జబ్బులు వచ్చే ప్రమాదం పెరగుతుందని నిపుణులు స్పష్టం చేస్తున్నారు.
411
ఏ జబ్బులు సోకకుండా ఆరోగ్యంగా ఉండాలంటే మాత్రం ఖచ్చితంగా రోజుకు 7 నుంచి 9 గంటలు నిద్రపోవాలని వైద్యులు చెబుతున్నారు. మీరు ప్రశాంతంగా ఉంటేనే మీ గుండె ఆరోగ్యంగా ఉంటుంది. లేదంటే ప్రమాదంలో పడే అవకాశం ఉంది.
511
రాత్రుళ్లు ప్రశాంతంగా నిద్రపోవాలంటే మాత్రం.. టీ, కాఫీలకు దూరంగా ఉండాలి. ముఖ్యంగా ఫోన్, కంప్యూటర్ లను అస్సలు చూడకూడదు. ఈ స్క్రీన్ ల నుంచే వెలువడే బ్లూ స్క్రీన్ వల్ల నిద్రదూరమవుతుంది. కాబట్టి పడుకునే ముందు ఫోన్లను, ల్యాప్ టాప్ లను చూడటం మానేయండి.
611
పడుకునే ముందు కొద్ది సేపు పుస్తకాలను చదివే అలవాటును అలవర్చుకోండి. బుక్ లను చదవడం వల్ల త్వరగా నిద్రలోకి జారుకునే అవకాశం ఉంది.
711
ఆల్కహాల్, స్మోకింగ్ అలవాట్లకు ఎంత దూరంగా ఉంటే అంత మంచిది. వీటివి వల్ల కూడా మీకు నిద్రరాకపోవచ్చు. కాబట్టి వీటిని త్వరగా మానేయండి.
811
చెడు ఆహారపు అలవాట్ల వల్ల మీ ఆరోగ్యం దెబ్బతినడమే కాదు బంగారం లాంటి నిద్రకూడా మీకు దూరమవుతుంది. ముఖ్యంగా స్పైసీ ఫుడ్, జంక్ ఫుడ్ కు దూరంగా ఉండాలి. ఇవి మీకు నిద్రరాకుండా చేస్తాయి. మరొక ముఖ్యమైన విషయం.. మీ భోజనానికి పడుకోవడానికి మధ్య రెండు గంటల గ్యాప్ ఉండాలి. అలా అయితేనే మీరు హాయిగా నిద్రపోతారు.
911
పడుకునే ముందు కాసేపు మెడిటేషన్ చేయండి. దీనివల్ల మీ మనస్సు ప్రశాంతంగా మారిపోయి మీరు హాయిగా నిద్రలోకి జారుకుంటారు.
1011
మీ గదిని ఎప్పుడూ నీట్ గా సర్దిపెట్టుకోండి. పిల్లోలు, బెడ్ షీట్స్ శుభ్రంగా ఉండేట్టు చూసుకోండి. మీరు పడుకునే రూముల్లో టీవీ, గడియారం, ఫ్రిజ్ వంటివి ఉండకుండా చూసుకోండి. వీటి సౌండ్స్ వల్ల మీరు సరిగ్గా నిద్రపోలేరు.
1111
పగటి పూట పడుకునే అలవాటుంటే వెంటనే మానుకోండి. ఈ కారణంగా కూడా మీకు రాత్రుళ్లు నిద్రలేకపోవచ్చు. రాత్రి పడుకునే ముందు చల్లని లేదా గోరువెచ్చని నీళ్లతో స్నానం చేయడం వల్ల మీరు తొందరగా నిద్రలోకి జారుకునే అవకాశం ఉంది.