మీ పిల్లలు స్మార్ట్ ఫోన్ చూడకుండా ఉండాలంటే ఇలా చేయండి..

First Published Mar 8, 2022, 2:43 PM IST

Kids Using Smartphones: పిల్లలు ఫోన్లకు అడిక్ట్ అవ్వడానికి ప్రధాన కారణం వారి తల్లిదండ్రులే. అవును వారి పనులకు అడ్డు పడుతున్నారని పేరెంట్స్ యే కొత్త ఫోన్ కొనిచ్చి వారిని ఫోన్లకు అడిక్ట్ చేస్తున్నారు. దీనివల్ల పిల్లలు శారీరకంగానే కాదు.. మానసికంగా కూడా ఎన్నో సమస్యలను ఎదుర్కోవాల్సి ఉంటుంది. వీలైనంత తొందరగా ఫోన్ ను చూడటం మాన్పించకపోతే తీవ్రపరిణామాలను ఎదుర్కోవాల్సి ఉంటుంది.

 ఆడుతూ పాడుతూ.. బొంగరాళ్లా తిరగాల్సిన పిల్లలు నేడు ఒక చోటుకే పరిమితమైతున్నారు. దీనికంతటికి ప్రధాన కారణం వాళ్లు ఫోన్లకు బాగా అలవాటు పడిపోవడమే. ఫోన్లకు పెద్దలే కాదు పిల్లలు కూడా బాగా అలవాటు పడిపోయారు. 

ఎవరు ఉన్నా లేకున్నా.. ఫోన్ ఒకటి ఉంటే చాలనే పరిస్థితికి చేరుకున్నారు. పిల్లలు ఇలా తయారవ్వడానికి ప్రధాన కారణం మాత్రం వారి తల్లిదండ్రులే. వారి పనులకు అడ్డుగా వస్తున్నారని, సతాయిస్తున్నారని వారి ముందు ఒక ఫోన్ పెడుతున్నారు. 
 

వీడియో గేమో లేకపోతే బొమ్మలో, పాటలో పెట్టి పిల్లలకు ఫోన్లను ఇస్తున్నారు. దీనివల్ల పిల్లలు కూర్చున్న చోటు నుంచి ఇంచు కూడా కదలడం లేదు. ఈ ఫోన్లు పిల్లలపై తీవ్రమైన ప్రభావాలను చూపిస్తున్నాయి. 

పిల్లల కోసమే సపరేట్ గా ఫోన్లను కొనే వారు చాలా మందే ఉన్నారు. కుదురుగా ఉండటం లేదని వారిని ఒకే చోట కూర్చోబెట్టడానికి ఇలా ఫోన్లను పిల్లలకు ఇస్తున్నారు. ఇక మా బాధ్యత తీరిపోయిందన్నట్టుగా ఫీలవుతున్నారు నేటితరం తల్లిదండ్రులు. ఈ ఫోన్ ద్యాసలో పడి పిల్లలు ఆడుకోవాలి, తినాలి అన్న సోయిని కూడా మర్చిపోతున్నారు.

తల్లిదండ్రులకు పిల్లలు కదలకుండా కూర్చోవడం పద్దతిగా అనిపిస్తుండొచ్చు కానీ దీనివల్ల పిల్లలు దీర్ఘకాలిక రోగాల బారిన పడే ప్రమాదం పొంచి ఉంది. 

పిల్లలు తరచుగా ఫోన్ చూడటం వల్ల ముందుగా వారి కళ్లు పాడయ్యే అవకాశం ఉంది. దగ్గరి నుంచి చూడటం వల్ల స్క్రీన్ లైట్ కళ్లపై పడి చూపు దెబ్బతింటుంది. ముఖ్యంగా వంగి చూడటం వల్ల వారి మెడ నరాలు దెబ్బతినే ప్రమాదం ఉంది. తరచుగా ఫోన్ చూసే పిల్లలు మానసికంగా, శారీరకంగా వీక్ గా ఉంటారు. ఇతర పిల్లల మాదిరి యాక్టీవ్ గా అస్సలు ఉండరు.
 

kids

ఫోన్ చూడకుండా ఉండాలంటే ఏం చేయాలి? 

పిల్లల చేతికి ఎప్పుడూ స్మార్ట్ ఫోన్ ఇవ్వకండి. వాళ్లు అరిచి గోల చేసి ఏడ్చినా ఫోన్ మాత్రం ఇవ్వకండి. ఏడుస్తున్నారు కదా అని ఫోన్ ఇస్తే పిల్లలు నెక్ట్స్ టైం కూడా అలాగే చేస్తారు. 
 

ఎన్ని పనులున్నా.. పిల్లల పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరించకండి. వారితో ఎక్కువ సమయాన్ని గడపండి. వారిని ఆడించండి. వీడియో గేమ్స్ అస్సలు ఆడించకండి. ఆరుబయటకు తీసుకెళ్లి వాళ్లకు ఇష్టమైన ఆటలను ఆడించండి. వాళ్లతో పాటుగా మీరు ఆడండి. అప్పుడే వాళ్లు సంతోషంగా ఉంటారు. 

బిల్డింగ్ బ్లాక్స్, పజిల్స్ వంటి గేమ్స్ ను ఆడించడం వల్ల పిలల బ్రెయిన్ షార్ప్ అవుతుంది. ఇది వారి ఎదుగుదలకు ఎంతో సహాయపడుతుంది. 

మీకు సమయం దొరికినప్పుడల్లా వారిని బయటకు తీసుకెళ్లండి. దీనివల్ల పిల్లలు స్మార్ట్ ఫోన్ చూసే అలవాటు చాలా వరకు తగ్గుతుంది.

रस्सी कूदना

ఆల్ఫాబెట్స్, అక్షర మాలలను నేర్పిస్తూ వాటితోనే గేమ్ పెట్టండి. దీనివల్ల వారు వాటిని తొందరగా నేర్చుకుంటారు. గేమ్ లా కూడా ఫీలవుతారు. 

ప్రస్తుత పిల్లలకు కథలు చెప్పడమే మర్చిపోయారు. ఏమంటే ఫోన్లను ఇస్తున్నారు. ఇక నుంచి ఇలా చేయకండి. వారికి నీతి కథలను చెప్పండి. దానిగురించి వారేమనుకుంటున్నారో అడగండి. 

వాళ్ల గోల్స్ ఏంటివి. ఎలా ఉండాలనుకుంటున్నారు వంటి విషయాలను అడిగి తెలుసుకోండి. ఆ దిశగా వారిని ప్రోత్సహించండి. పేరెంట్స్ లా కాకుండా ఫ్రెండ్ లా మూవ్ అవ్వండి.   
 

click me!