చాణక్య నీతి: రాత్రిపూట ఈ పనులు చేస్తే ధనవంతులు అవుతారు

Published : Aug 21, 2025, 02:02 PM IST

ఆచార్య చాణక్యుడు తన నీతిశాస్త్రంలో ఎన్నో విషయాల గురించి చెప్పుకొచ్చాడు. చాణక్య నీతి ప్రకారం.. రాత్రిపూట కొన్ని చిన్న చిన్న పనులను చేస్తే జీవితంలో విజయం సాధిస్తారు. మీరు తొందరలోనే ధనవంతులు అవుతారు. 

PREV
15
చాణక్య నీతి

జీవితంలో విజయం సాధించాలని ప్రతి ఒక్కరికీ ఉంటుంది. కానీ చాలా సార్లు ఎంత కష్టపడి పనిచేసినా విజయం మాత్రం రాదు. ఇది చాలా బాధిస్తుంది. విజయం సాధించాలని ఎంతో కష్టపడి పనిచేస్తుంటారు. కానీ విజయవంతం మాత్రం కారు. నిజానికి మనం జీవితంలో విజయం సాధించాలన్నా, సక్సెస్ కావాలన్నా, ఏదైనా చేయాలనుకున్నా సరైన ప్లానింగ్ ఖచ్చితంగా అవసరం.

 అయితే ఆచార్య చాణక్యుడు ఈ సక్సెస్ ఫార్ములాను తన పాలసీలో చెప్పాడు. ముఖ్యంగా కొన్ని చిన్న చిన్న అలవాట్ల గురించి వివరించాడు. వాటిని గనుక ఫాలో అయితే జీవితంలో తప్పకుండా విజయం సాధిస్తారు. అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం పదండి.

25
ఈ రోజు ఎలా గడిచిందో ఆలోచించండి

ఆచార్య చాణక్యుడి ప్రకారం.. తన కర్మలను లెక్కలోకి తీసుకునే వ్యక్తి తన జీవితంలో ఖచ్చితంగా విజయం సాధిస్తాడు. కాబ్టటి మీ రోజంతా ఎలా గడిచిందో రాత్రిపూట గుర్తుచేసుకోవాలి. 

మీరు చేసిన తప్పులేంటి? వాటి నుంచి మీరు ఏం నేర్చుకున్నారు? అలాగే జీవితాన్ని మెరుగుపర్చుకోవడానికి మీరు ఏం చేయాలి? వంటి విషయాలను మీరు ప్రతిరోజూ రాత్రిపూట ఆలోచించాలి. మీరు గనుక రాబోయే రోజు కోసం ప్లాన్ చేసుకుంటే మీరు బాగా డబ్బును సంపాదించగలుగుతారు.

35
మీ పరిజ్ఞానాన్ని విస్తరించుకోండి

రోజూ నిద్రపోయే ముందు కొద్దిసేపు పుస్తకాలను చదవడం అలవాటు చేసుకోండి. కనీసం పుస్తకాన్ని చదవడానికి రోజూ గంటా లేదా అరగంట సమయాన్ని కేటాయించండంటాడు ఆచార్య చాణక్యుడు. మీరు చదివే పుస్తకాలు మీ జ్ఞానాన్ని పెంచేవిగా ఉండాలి. ఎందుకంటే చాణక్యుడి ప్రకారం.. మీ జ్ఞానమే గొప్ప సంపద. అందుకే మీరు జీవితంలో విజయం సాధించాలన్నా, ధనవంతులు కావాలన్నా రాత్రిపూట మంచి పుస్తకాన్ని చదవడం అలవాటు చేసుకోవాలి.

45
మీ లక్ష్యం గురించి ఆలోచించండి

చాణక్యుడు మన లక్ష్యం గురించి ఎప్పుడూ మర్చిపోకూడదంటాడు. మన లక్ష్యాన్ని సాధించాలనుకుంటే మన మనస్సు ఎప్పుడూ దానిపై స్థిరంగా ఉండాలి. లక్ష్యాన్ని మర్చిపోని వాడు ఎప్పటికైనా విజయాన్ని సాధించి తీరుతాడు.

 అందుకే పడుకునే ముందు కాసేపు మీ లక్ష్యం గురించి ఆలోచించండి. అలాగే ఎలా సాధించాలో కూడా ఆలోచించండి. ఇవే మిమ్మల్ని మీ లక్ష్యం వైపు తీసుకెళ్లెల్లా కష్టపడి పనిచేసేలా చేస్తాయి. విజయం కోసం మీ మెదడును ప్రోత్సహిస్తాయి.

55
పాజిటివ్ థింకింగ్ తో రోజును ముగించండి

నెగిటీవ్ ఆలోచనలే మన జీవితాన్ని సగం దెబ్బతీస్తాయి. మీరు విజయం సాధించాలనుకుంటే గనుక ప్రతిరోజూ రాత్రి నిద్రపోయేటప్పుడు మీ మనస్సులోకి నెగిటీవ్ ఆలోచనలు రానీయకండి. మీరు ఏ విషయం గురించైనా నెగిటీవ్ గా ఆలోచించడం మొదలుపెడితే.. ఇక ప్రతీదీ నెగిటీవ్ గానే ఆలోచిస్తారు.

 అందుకే రోజును ముగించేముందు సంతోషంగా ఉండండి. నిద్రపోయేటప్పుడు పాజిటీవ్ గానే ఆలోచించండి. మీ జీవితంలోని మంచి విషయాలను గుర్తుచేసుకోండి. అప్పుడే మీరు ప్రశాంతంగా నిద్రపోగలుగుతారు.

Read more Photos on
click me!

Recommended Stories