Snake Revenge: సినిమాల్లో చూపించినట్లు నిజంగా పాములు పగపడతాయా? మనుషులను గుర్తు పెట్టుకుంటాయా?

Published : Apr 30, 2026, 11:19 AM IST

Snake Revenge:  చాలా సినిమాల్లో పాములు మనుషులపై పగ పెంచుకుంటాయి. పగ ప్రకారమే ప్రతీకారం తీర్చుకుంటాయి. కానీ, నిజ జీవితంలో కూడా  పాములు పగబడతాయా? సైన్స్ ఏం చెబుతోంది? దీని వెనక అసలు నిజం ఏంటి? 

PREV
14
పాములకు పగ, ప్రతీకారాలు ఉంటాయా?

అనుకోకుండా ఇంటి సమీపంలో పాము కనిపించింది అంటే ఎవరైనా భయపడిపోతారు. ఎవరినైనా కాటేస్తుందేమో అనే భయంతో చాలా మంది పాము కనపడగానే కర్రతో కొట్టి చంపాలని అనుకుంటారు. చాలా మంది చంపేస్తూ ఉంటారు కూడా. అయితే... ఎవరైనా పామును చంపితే.. ఆ వ్యక్తిపై మరో పాము పగ పట్టి, ప్రతికారం తీర్చుకుంటుంది అనే నమ్మకం చాలా మందిలో ఉంటుంది. చాలా సినిమాల్లో దీనిని చూపించడంతో నిజమని ప్రజలు నమ్మేస్తూ ఉంటారు. దీని గురించి శాస్త్రవేత్తలు ఏం చెబుతున్నారో ఇప్పుడు తెలుసుకుందాం....

24
ఆత్మ రక్షణ కోసం మాత్రమే....

నిజానికి, మనుషులకులాగా పాములకు దీర్ఘకాలిక జ్ఞాపకాలు లేదా వ్యక్తిగత పగలు ఉండవు. ప్రతీకారం తీర్చుకునే అలవాటు పాములకు ఉండదు. పాముల ప్రధాన లక్ష్యం బతకడం, ఆహారం సంపాదించుకోవడం. తమకు ముప్పు ఉందని భావించినప్పుడు మాత్రమే అవి తమను తాము రక్షించుకోవడానికి కాటు వేస్తాయి.

అంతేకాదు, పాముకి తెలివితేటలు కూడా ఉండవు.  ప్రతీకారం, ప్రేమ ,ద్వేషం వంటి సంక్లిష్టమైన భావోద్వేగాలను వ్యక్తపరచడానికి అవసరమైన 'లింబిక్ సిస్టమ్' వాటికి ఉండదు. వాస్తవం ఏమిటంటే, ఒక మనిషిని గుర్తుంచుకొని, పగ తీర్చుకునే తెలివితేటలు పాములకు ఉండవు.

34
చనిపోయిన పాము దగ్గరికి మరో పాము ఎలా వస్తుంది?

ఒక పాము చనిపోయినప్పుడు  ఆ ప్రాంతంలోనే మరో పాము తిరుగుతూ కనపడుతుంది. ప్రతీకారం తీర్చుకోవడానికే ఆ పాము వచ్చింది అనే చాలా మంది భయపడిపోతూ ఉంటారు. కానీ.. దీని వెనక మరో కారణం ఉంటుంది. ఒక పాము  చనిపోయినప్పుడు, దాని శరీరం నుంచి ఒక ప్రత్యేకమైన వాసన విడుదల చేస్తుంది. ఈ వాసన దాని భాగస్వామి అయిన మరో పామును ఆకర్షిస్తుంది. అందుకే.. ఆ ప్రాంతంలో మరో పాము తిరుగుతూ కనిపిస్తుంది. అంతే తప్ప.. ప్రతీకారం ఏమీ ఉండదు.

44
అపోహ మాత్రమే...

కాబట్టి గుర్తుంచుకోవాల్సిన విషయం ఏంటంటే, పాము ఎవరిపైనా పగ తీర్చుకోదు. తనకు ప్రమాదం ఉందని భయపడినప్పుడు మాత్రమే దాడి చేస్తుందని శాస్త్రవేత్తలు స్పష్టంగా చెబుతున్నారు.

పాము కనిపించినప్పుడు తీసుకోవాల్సిన జాగ్రత్తలు…

పాము కనిపించిన వెంటనే  వీలైనంత వరకు దూరంగా ఉండాలి. దానిని కొట్టడానికి, చంపడానికి ప్రయత్నాలు చేయకూడదు. అంతేకాదు.. ఇంటి పరిసర ప్రాంతాల్లో పాములు రాకుండా జాగ్రత్త వహించాలి. ఇంటిని శుభ్రంగా ఉంచుకోవాలి.

Read more Photos on
click me!

Recommended Stories