Diwali 2023: మన దేశంలో దీపావళి పండుగను ఎంతో గ్రాండ్ గా సెలబ్రేట్ చేసుకుంటారు. కొత్తబట్టలు, దీపాల కాంతులు, టపాసుల వెలుగులు, నోరూరించే స్వీట్లు, పిండివంటకాలు.. ఇలా00 ఒక్కటేమిటీ.. ఈ పండుగకున్న ప్రత్యేకత అందరికీ తెలుసిందే. దీపావళికి ఎక్కడెక్కడో ఉద్యోగాలు చేస్తున్న వారు కూడా తమ సొంతూళ్లకు వెళుతుంటారు. అందుకే దీపావళికి ప్రతి ఒక్కరూ ఇండ్లను శుభ్రం చేస్తారు. పెయింటింగ్స్ ను కూడా వేయిస్తుంటారు. దీపావళి నాడు ఇళ్లు అందంగా కనిపించాలంటే ఇవి మాత్రమే సరిపోవు. దీపావళి పండుగ కళ మీ ఇంటికి కనిపించాలంటే మాత్రం ఎంతో కాస్త డెకరేషన్ చేయాల్సిందే. మరి సింపుల్ గా, చాలా ఈజీగా ఇంటిని ఎలా అందంగా మార్చాలో మనం ఇప్పుడు తెలుసుకుందాం..
పువ్వులు, ఆకులు
పువ్వులు, ఆకులతో డెకరేషన్ ఏంటని అనుకోకండి. వీటితో కూడా ఇంటిని అందంగా మార్చేయొచ్చు. దీపావళికి మీ ఇంటి తలుపులను అలంకరించడానికి గులాబీ, బంతిపూలు, మామిడి లేదా అశోక చెట్టు ఆకులు వంటి వివిధ రకాల పువ్వులు, ఆకులతో అందంగా తోరణాలను తయారుచేసి వాటిని మీ తలుపులకు వేలాడదీయండి. ఇది మీ ఇంటిని అందంగా మారుస్తుది. అలాగే పువ్వులను ఉపయోగించి పెండెంట్లను తయారు చేయొచ్చు. వీటిని తలుపులు, కిటికీలు, దేవుడి గుడికి వేలాడదీయొచ్చు.
రంగురంగుల లైట్లు
దీపావళి అంటే దీపాల పండుగ. దీపాలు మన ఇంటిని కాంతులతో నింపుతాయి. అందుకే ఈ దీపావళికి దీపాలతో పాటుగా రంగురంగుల లైట్లను కూడా పెట్టండి. నక్షత్రాలు, దీపాల ఆకారపు దీపాల లైట్లను వెలిగించి ఇంటిని అందంగా మార్చేయండి. అంతేకాదు రంగులు మారే ఫెయిరీ లైట్లతో కూడా మీ ఇంటిని అందంగా మార్చేయొచ్చు. మీ బాల్కనీలో లైట్లను డెకరేట్ చేయండి.
అందమైన రంగోలీ ముగ్గులు
రంగురంగుల ముగ్గు కూడా పండుగల ఉత్సాహాన్ని పెంచుతుంది. ఇందుకోసం ఎన్నో రకాల ముగ్గులను వేసి అందులో రంగులు నింపొచ్చు. ఇంటిముందు రంగోలి వేయడానికి పువ్వులు, ఆకులు, బియ్యం మొదలైన వాటిని కూడా ఉపయోగించొచ్చు తెలుసా? కాళీ ముగ్గుకు బదులుగా రంగులు వేస్తే మీ ఇంటికి పంగుడ కళ వస్తుంది. రకరకాల పువ్వులతో వేసిన రంగోలి కూడా చాలా అందంగా కనిపిస్తుంది.
షో పీస్ లతో అలంకరణ
ఈ దీపావళికి మీ ఇంటిని రకరకాల షో పీస్ లను ఉపయోగించి అందంగా తయారుచేయొచ్చు కూడా. వీటిని టేబుల్ పై, గోడలపై లేదా షో కేస్ లో ఉంచొచ్చు. ఇవి ఇంటిని అందంగా కనిపించేలా చేస్తాయి. అంతేకాదు మీకు నచ్చిన షో ముక్కలను కూడా ఇంటి మూలల్లో అందంగా డెకరేట్ చేయొచ్చు.