ధనత్రయోదశి నాడు యమదీపం ఎందుకు వెలిగిస్తారో తెలుసా?

First Published Nov 10, 2023, 10:31 AM IST

Dhanteras 2023: హిందూ మతంలో ధనత్రయోదశి పండుగకు ఎంతో ప్రాముఖ్యత ఉంది. పురాణాల ప్రకారం.. ఈ రోజు బంగారం, వెండిని కొనడం వల్ల లక్ష్మీదేవి అనుగ్రహం పొందుతారని నమ్మకం. అంతేకాదు ఈ రోజున యముడికి దక్షిణ దిశలో నాలుగు ముఖాల దీపం కూడా వెలిగిస్తారు. ఈ దీపాన్ని వెలిగించడం వల్ల..

దీపావళి పండుగ ధనత్రయోదశి నుంచే ప్రారంభమవుతుంది. ప్రతి ఏడాది కార్తీక మాసంలో కృష్ణ పక్షం త్రయోదశి తిథి నాడే ధన త్రయోదశి పండుగను జరుపుకుంటారు. ధనత్రయోదశి నాడు బంగారం, వెండితో చేసిన వస్తువులను కొనడం శుభప్రదంగా భావిస్తారు. ఈ ధనత్రయోదశి నాడు సాయంత్రం పూట లక్ష్మీదేవిని, కుబేరుడిని పూజిస్తారు. అంతేకాదు ఈ రోజు యముడిని కూడా పూజించే ఆచారం ఉంది. అవును ఈ రోజు యమరాజుకు దీపాన్ని కూడా వెలిగిస్తారు. అసలు ధనత్రయోదశి నాడు యమ దీపాన్నిఎందుకు వెలిగిస్తారు.. దీని ప్రాముఖ్యత, సరైన సమయం గురించి ఇప్పుడు తెలుసుకుందాం.. 
 

దీపం వెలిగించడానికి కారణం ఇదే

ధనత్రయోదశి నాడు మరణదేవుడిగా పిలువబడే యమరాజును కూడా పూజిస్తారు తెలుసా? అంతేకాదు ఈ రోజు సాయంత్రం పూట దక్షిణ దిశలో నాలుగు ముఖాల యమ దీపాన్ని వెలిగిస్తారు. ఈ దిక్కునే ఎందుకంటే జ్యోతిషశాస్త్రంలో దక్షిణదిశను యముడి దిక్కుగా భావిస్తారు.
 

పురాణాల ప్రకారం.. ధనత్రయోదశి నాడు దక్షిణ దిశలో యమదీపాన్ని వెలిగిస్తే యమరాజు సంతోషిస్తాడట. అలాగే ఈ రోజున కుటుంబ సభ్యుల భద్రత కోసం ధంతేరాస్ ఇంటి బయట యముడి కోసం ఈ దీపాన్ని వెలిగిస్తారు. దీనిని యమరాజుకు దీపదానం లేదా యమదీపం అని కూడా అంటారు. 
 

దీపం వెలిగించడానికి శుభ సమయం

ధనత్రయోదశి నాడు యమరాజు దీపాన్ని వెలిగించడానికి సాయంత్రం ఉత్తమ సమయంగా భావిస్తున్నారు. అందుకే ధనత్రయోదశి నాడు యమదీపం వెలిగించడానికి మంచి సమయం సాయంత్రం 05.30 నుంచి 06.49 వరకు ఉంటుందని జ్యోతిష్యులు చెబుతున్నారు. 
 

యమదీపం వెలిగించడానికి సరైన మార్గం

ధనత్రయోదశి నాడు యమ దీపం వెలిగించడానికి.. పిండితో నాలుగు ముఖాల దీపాన్ని తయారు చేయండి. దీనిలో ఆవనూనె పోసి నాలుగు ఒత్తులు పెట్టి  ఇంటి వెలుపల దక్షిణదిశగా వెలిగించండి. ఇది మీ కుటుంబం మొత్తాన్ని ఆరోగ్యంగా, ఆనందంగా ఉంచుతుంది.

click me!