భారతీయులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూసే పండుగల్లో ధనత్రయోదశి ఒకటి. ఈ పండుగ ఈ ఏడాది నవంబర్ 10 అంటే ఈ రోజునే జరుపుకుంటున్నాం. ధనత్రయోదశిని ధన్వంతరి త్రయోదశి అని కూడా పిలుస్తారు. ఈ పండుగ ఐదు రోజుల దీపావళి పండుగ ప్రారంభాన్ని కూడా సూచిస్తుంది. ధనత్రయోదశి నాడు లక్ష్మీదేవికి నిష్టగా పూజలు చేస్తారు. ఈ రోజు అమ్మవారి అనుగ్రహం లభిస్తే జీవితంలో ఆర్థిక సమస్యలే రావని నమ్మకం ఉంది. అంతేకాదు ఇంట్లో సిరి, సంపదలు కూడా పెరుగుతాయంటారు పండితులు.
Image: Freepik
ధనత్రయోదశి ప్రాముఖ్యత
ధనత్రయోదశి అనే పదం 'ధన' అనే పదం నుండి ఉద్భవించింది. ధన అంటే సంపద అని అర్థం. కార్తీక మాసంలో కృష్ణపక్షం 13వ రోజున ఈ ప్రత్యేకమైన రోజు వస్తుంది. ధనత్రయోదశి మన జీవితాల్లో సంపద, శ్రేయస్సు, సంతోషం రాకను సూచిస్తుంది. ఈ పవిత్రమైన రోజున జనాలు తమ ఇండ్లను శుభ్రం చేసి అదంగా అలంకరించి లక్ష్మీదేవికి ఆహ్వానం పలుకుతారు. అలాగే అమ్మవారి విగ్రహం ముందు దీపం వెలిగించి నిష్టగా పూజ చేస్తారు. ఈ పవిత్రమైన రోజున బంగారం, వెండి, కొత్త పాత్రలను కొనే ఆనవాయితీ కూడా ఉంది. మరి ఈ ప్రత్యేకమైన రోజున ప్రియమైన వారికి, స్నేహితులకు, కుటుంబ సభ్యులకు ఎలా శుభాకాంక్షలు చెప్పాలో ఇప్పుడు తెలుసుకుందాం..
ఈ ధనత్రయోదశి మీ జీవితాన్ని సంతోషం, శ్రేయస్సుతో ప్రకాశవంతం చేయాలని కోరకుంటూ.. హ్యాపీ ధనత్రయోదశి..
ఈ ధనత్రయోదశి సందర్భంగా మీకు అపారమైన సిరి సంపదలు కలగాలని కోరుకుంటున్నాను. ధనత్రయోదశి శుభాకాంక్షలు
ఈ పవిత్రమైన రోజున మీరు వెలిగించే దీపాలలాగే మీ జీవితం కూడా ప్రకాశవంతంగా మెరిసిపోవాలి. ధనత్రయోదశి శుభాకాంక్షలు
ఈ రోజున మీరు చేసే పూజలతో లక్ష్మీదేవి మీకు ప్రేమ, శ్రేయస్సును ప్రసాదించాలని కోరుకుంటున్నాను. హ్యాపీ ధనత్రయోదశి
ఈ ధనత్రయోదశితో మీ జీవితంలోని అన్ని కష్టాలు తొలగిపోవాలి. అలాగే మీ జీవితం అంతులేని అవకాశాలు, శ్రేయస్సుతో నిండి పోవాలి. ధనత్రయోదశి శుభాకాంక్షలు!
ఈ ధనత్రయోదశి వెలుగు మీ జీవితంలో ఎనలేని ఆనందాన్ని అందించాలి. ప్రతి పనిలో మీరు విజయం సాధించాలని కోరకుంటూ హ్యాపీ ధనత్రయోదశి
బంగారం లాగే విలువైనది, వెండి లాగే స్వచ్ఛమైన ధనత్రయోదశి శుభాకాంక్షలు
ఈ ధనత్రయోదశికి లక్ష్మీదేవి దివ్య ఆశీస్సులు మీ జీవితాన్ని సంపద, శ్రేయస్సుతో నింపాలి. ధంతేరాస్ శుభాకాంక్షలు!
ఈ పవిత్రమైన రోజున మీ సంపద రెట్టింపు కావాలి, మీ కష్టాలన్నీ మటుమాయం కావాలి. ధనత్రయోదశి శుభాకాంక్షలు!
ఈ ధనత్రయోదశికి వెలిగించే దీపాల వెలుగులు, గంటల శబ్దాలు మీ జీవితంలో సంతోషాన్ని, విజయాన్ని తీసుకురావాలి. ధనత్రయోదశి శుభాకాంక్షలు!