చీకటిపై వెలుగు సాధించిన విజయానికి ప్రతీకగా దీపావళి పండుగను జరుపుకుంటారు. ఈ పండుగ సందర్భంగా బహుమతులను కూడా ఇచ్చిపుచ్చుకుంటారు. అయితే కొన్ని రకాల బహుమతులు చాలా రొటీన్ గా అనిపిస్తాయి. మీరెచ్చే బహుమతులు అవతలివారికి ఎంతో నచ్చే విధంగా ఉండాలి. అలాగే ఉపయోగపడేదై ఉండాలి. మీకు ఎలాంటి బహుమతులు ఇవ్వాలో తెలియడం లేదా? అయితే ఈ టిప్స్ మీకోసమే..
diwali 2023
హ్యాండ్ మేడ్ దీపాలు, కొవ్వొత్తులు
చెడుపై మంచి సాధించిన విజయానికి ప్రతీకగా దీపాలను, కొవ్వొత్తులు దీపావళి నాడు పక్కాగా వెలిగిస్తారు. అందుకే ఈ దీపావళికి మీరు మీ చేత్తో తయారుచేసిన దీపాలు, సువాసనలు వెదజల్లే కొవ్వొత్తులను బహుమతిగా ఇవ్వండి. ఇది అవతలి వారికి ఎంతో నచ్చుతుంది. ఈ బహుమతులు వారిని సంతోషపెట్టడమే కాకుండా వారి ఇంటి అందాన్ని కూడా పెంచుతాయి.
స్వీట్లు, స్నాక్స్
దీపావళికి టేస్టీ టేస్టీ స్వీట్లు, స్నాక్స్ ఖచ్చితంగా ఉండాల్సిందే. స్వీట్లు లేకుండా పండుగ సంపూర్ణం కాదు మరి. అందుకే ఈ పండుగ సందర్భంగా లడ్డూలు, జిలేబీలు లేదా డ్రై ఫ్రూట్స్ వంటి సాంప్రదాయ భారతీయ స్వీట్ల బాక్సును బహుమతిగా ఇవ్వండి.
దుస్తులు
దీపావళి కి కొత్త బట్టలను వేసుకునే సంప్రదాయం కూడా ఉంది. అందుకే ఈ పండుగ సందర్భంగా చీరలు, కుర్తా-పైజామా వంటి సాంప్రదాయ భారతీయ దుస్తులను లేదా ఆభరణాలు వంటి స్టైలిష్ యాక్సెసరీలను బహుమతిగా కూడా ఇవ్వొచ్చు. ఇది మీ ప్రియమైన వారిని ఎంతో సంతోషపెడుతుంది.
వెల్ నెస్ బహుమతులు
దీపావళికి బట్టలు, స్వీట్లే కాకుండా వారి శ్రేయస్సు కోసం వెల్ నెస్ బహుమతులను కూడా ఇవ్వొచ్చు. ఎసెన్షియల్ ఆయిల్ డిఫ్యూజర్లు, యోగా మ్యాట్లు లేదా స్పా వోచర్లు వంటి వెల్నెస్ వస్తువులను కూడా దీపావళి బహుమతిగా ఇవ్వండి. ఈ బహుమతులు విశ్రాంతి తీసుకోవడానికి, స్వీయ సంరక్షణను ప్రోత్సహిస్తాయి. ఈ గజిబిజీ ప్రపంచంలో ఇది చాలా అవసరం.