మురికిగా ఉన్న సింక్‌ను శుభ్రం చేయడానికి మీరు పటికను కూడా ఉపయోగించవచ్చు. నీటిలో పటికను కలిపి ద్రావణాన్ని తయారు చేయండి. ఈ నీటిని 10 నిమిషాల పాటు మరిగించండి. ఆ తర్వాత, ఈ పేస్ట్‌ను సింక్‌కు పూసి, అంతటా పరచండి. కొంత సమయం తరువాత, బ్రష్‌తో సింక్‌ను శుభ్రం చేయండి.
నిమ్మకాయ , ఉప్పు
మీ సింక్ మురికిగా ఉంటే, మీరు నిమ్మకాయ , ఉప్పును ఉపయోగించవచ్చు. మురికిగా ఉన్న సింక్‌ను శుభ్రం చేయడానికి, 5 నుండి 6 నిమ్మ తొక్కలను తీసుకోండి. ఆ తొక్కలను ఉప్పుతో బాగా రుబ్బండి. ఈ పేస్ట్‌ను సింక్‌కు పట్టించండి. బ్రష్‌తో సింక్‌ను రుద్దండి. ఇలా చేస్తే.. మీ సింక్ కొత్త దానిలా మెరిసిపోతుంది.