సమ్మర్ లో కూల్ కుర్తాలు.. స్పెషల్లీ అబ్బాయిల కోసమే..!

First Published May 27, 2021, 1:28 PM IST

ఈ కాటన్ కుర్తీలు మాత్రం చాలా డిఫరెంట్ అంటున్నారు ఫ్యాషన్ నిపుణులు. సమ్మర్ లో ఏకంగా పార్టీలకు, ఫంక్షన్లకు కూడా వేసుకునే వీలుండేలా కూల్ కూల్ కుర్తాలను డిజైన్ చేశారు.

ఎండాకాలం వచ్చేసింది. ఈ సీజన్ లో హాయిగా అనిపించే దుస్తులు వేసుకోవాలని అందరూ ఇష్టపడతారు. ఎండలు మండుతున్నా హాయిగా ఉండాలన్నా.. చిరాకు పుట్టకుండా ఉండాలన్నా.. కాటన్ కి మించిన దుస్తులు ఏమంటాయి..? కానీ.. ఈ కాలం అబ్బాయిలు.. కాటన్ షర్ట్స్ వేసుకొని తిరగమంటే ఒప్పుకుంటారా..? సమ్మర్ అయినా.. స్వెర్ట్ షర్ట్స్, టీ షర్ట్స్ వేసుకొని ఇబ్బంది పడుతుంటారు. ఎందుకంటే వారికి అవి మాత్రమే స్టైలిష్ గా కనిపిస్తాయి.
undefined
అయితే.. ఈ కాటన్ కుర్తీలు మాత్రం చాలా డిఫరెంట్ అంటున్నారు ఫ్యాషన్ నిపుణులు. సమ్మర్ లో ఏకంగా పార్టీలకు, ఫంక్షన్లకు కూడా వేసుకునే వీలుండేలా కూల్ కూల్ కుర్తాలను డిజైన్ చేశారు. వాటి స్పెషాలిటీ ఏంటో ఓసారి చూద్దాం..
undefined
1.కలర్ బ్లాకింగ్ కుర్తా.. ఈ కలర్ బ్లాక్డ్ కుర్తాని లేటెస్ట్ ఫ్యాషన్ గా చెప్పొచ్చు. ఈ రంగుల కాంబినేషన్ తో దీనిని డిజైన్ చేశారు. ఒకటి ముందు రంగు అయితే.. మరొకటి లేత రంగు ఉంటుంది. కాటన్ తో తయారు చేస్తారు కాబట్టి సమ్మర్ లో వేసుకోవడానికి సౌకర్యంగానూ ఉంటుంది. మరో వైపు లేటెస్ట్ గా కనిపించాలనే కోరిక కూడా తీరుతుంది.
undefined
2.క్లాసిక్ వైట్ లెనిన్.. ఎంత కాస్ట్ లీ షర్ట్స్, టీ షర్ట్స్ వేసినా రాని హుందాతనం లెనిన్ క్లాత్ తో కుట్టిన కుర్తా వేసుకుంటే వస్తుందని ఫ్యాషన్ ప్రియులు చెబుతున్నారు. సమ్మర్ లో హాయిని ఇవ్వడంతోపాటు.. హుందాగా కనిపిస్తారు. అయితే... దీనినే ఇంకాస్త స్టైలిష్ గా ఇప్పుడు మన ముందుకు తీసుకువస్తున్నారు. దీనిని కూడా ట్రై చేయవచ్చు.
undefined
3.కుర్తా కి కాంట్రాస్ట్ పైపింగ్.. కుర్తా విత్ కాంట్రాస్ట్ పైపింగ్.. ఈ మోడల్ కూడా చాలా బాగుంటుంది. లేత రంగు కుర్తా ఎంచుకుంటే.. దాని మీద ముదురు రంగుతో.. డిజైన్ రూపంలో పైపింగ్ చేస్తారు. చాలా స్టైలిష్ గా కనిపిస్తారు. కొత్తగానూ ఉంటుంది.
undefined
4.చాక్లెట్ కలర్ కుర్తా.. ఇక ఇది మరొక ఫ్యాషన్. మట్టి రంగులు.. ముదురు రంగులు.. చాక్లెట్ రంగు.. ప్లెయిన్ కుర్తాలు కూడా చాలా స్టైలిష్ గా ఉంటాయి. దానికి ఆపోజిట్ ప్యాంట్ వేసుకుంటే బాగా సెట్ అవుతుంది.
undefined
5. బ్లూ కలర్.. ఈ బ్లూకలర్ కుర్తాలు కూడా చాలా బాగా సూట్ అవుతాయి. కూల్ లుక్ ని ఇస్తాయి. కంప్లీట్ గా ఒక రకం బ్లూ ఎంచుకున్నా పర్లేదు.
undefined
click me!