జనవరి 26 గురించి ఈ విషయాలు మీకు తెలుసా?

Published : Jan 25, 2025, 10:31 AM ISTUpdated : Jan 25, 2025, 10:40 AM IST

రిపబ్లిక్ డే గురించి కొన్ని ఆసక్తికర విషయాలు కూడా ఉన్నాయి. అవేంటో ఓసారి తెలుసుకుందామా...

PREV
15
జనవరి 26 గురించి ఈ విషయాలు మీకు తెలుసా?

ప్రతి సంవత్సరం మనమంతా జనవరి 26న గణతంత్ర దినోత్సవాన్ని జరుపుకుంటాం. 1950, జనవరి 26 వ తేదీన మన భారత రాజ్యాంగాన్ని ఆమోదించారు. అప్పటి నుంచి మనం ఈ వేడుకలు జరుపుకుంటూ వస్తున్నాం.  ఇక్కడి వరకు  ప్రతి ఒక్కరికీ తెలుసు. కానీ,  ఈ రిపబ్లిక్ డే గురించి కొన్ని ఆసక్తికర విషయాలు కూడా ఉన్నాయి. అవేంటో ఓసారి తెలుసుకుందామా...
 

25
republic day


జనవరి 26వ తేదీనే రిపబ్లిక్ డే ఎందుకు జరుపుకుంటారు..?

భారత రాజ్యాంగం జనవరి 26వ తేదీన 1950వ తేదీన అమలులోకి వచ్చింది. 1930లో ఇదే తేదీన లాహోర్‌లో జరిగిన భారత జాతీయ కాంగ్రెస్ సమావేశంలో పూర్ణ స్వరాజ్యాన్ని ప్రకటించారు.   గణతంత్ర దినోత్సవం ద్వారా భారత్ సార్వభౌమ ప్రజాస్వామ్య గణరాజ్యంగా అవతరించింది.  
 

35

పరేడ్ ప్రత్యేకత..
న్యూడిల్లీలో జరిగే గణతంత్ర దినోత్సవ పరేడ్ ప్రధాన ఆకర్షణగా ఉంటుంది.  భారత సైనిక శక్తి, సాంస్కృతిక వైవిధ్యం, సాంకేతిక అభివృద్ధిని ఈ పరేడ్‌లో ప్రదర్శిస్తారు.  భారత రాష్ట్రపతి సైనిక బలగాల నుండి సెల్యూట్ స్వీకరిస్తారు.  వివిధ రాష్ట్రాల సాంస్కృతిక విలువలను ప్రతిబింబించే శకటాలు పరేడ్‌లో ప్రధాన ఆకర్షణగా నిలుస్తాయి.  

45

మొదటి రిపబ్లిక్ డే ఎక్కడ చేశారు..?
1950 జనవరి 26న డాక్టర్ రాజేంద్ర ప్రసాద్ తొలిసారిగా భారత రాష్ట్రపతిగా ప్రమాణ స్వీకారం చేశారు.  ఈ వేడుకల సందర్భంగా భారత రాజ్యాంగం అధికారికంగా అమలులోకి వచ్చింది.  మొదటి గణతంత్ర దినోత్సవ పరేడ్ ఐరన్ కట్టే ఇండియా గేట్ వద్ద నిర్వహించారు.  

ముఖ్య అతిథులు...

ప్రతి గణతంత్ర దినోత్సవానికి ఓ విదేశీ దేశాధ్యక్షుడిని ముఖ్య అతిథిగా ఆహ్వానించడం ఒక సంప్రదాయంగా ఉంది.   1950లో ఇండోనేషియా అధ్యక్షుడు సుకార్నో గణతంత్ర దినోత్సవానికి తొలి ముఖ్య అతిథిగా హాజరయ్యారు.   ప్రతీ సంవత్సరం ఈ అతిథుల ఎంపిక దేశ విదేశాంగ విధానానికి ప్రతిబింబంగా ఉంటుంది.  
 

55

జాతీయ గీతాలాపన..
జాతీయ గీతాలైన "జన గణ మన" , "సారే జహాన్ సె అచ్ఛా" వినిపించడం గణతంత్ర వేడుకల ముఖ్య భాగం.   భారత సైన్యం, వాయు, నౌకాదళ బలగాల బ్యాండ్ల ప్రదర్శన ఈ వేడుకలో ప్రత్యేక ఆకర్షణ.  ఈ గీతాలు భారత దేశభక్తిని, ఐక్యతను చాటుతాయి.  

click me!

Recommended Stories