Last Roti: హిందూ ధర్మంలో వంటగదిలో చేసే ప్రతి పనికి ఒక అర్థం ఉంటుంది. అలాగే మొదటి, చివరి రోటీలు లేదా చపాతీల విషయంలో కూడా చాలా ప్రాముఖ్యత ఉంది. మొదటి రొట్టెను ఆవుకు పెడతారు. అలాగే చివరి రోటీని కుక్కకు తినాపించాలని శాస్త్రాలు చెబుతున్నాయి.
హిందూ ధర్మ శాస్త్రాలు మనుషులు పాటించాల్సిన ఎన్నో నిమయాలను వివరించాయి. వంటగదిలో చేసే రొటీలు లేదా చపాతీలకు సంబంధించి కూడా కొన్ని ప్రత్యేక నియమాలున్నాయి. చాలా ఇళ్లలో మొదటి రోటీ ఆవుకు పెడతారు. ఆవులో 33 కోట్ల దేవతలు కొలువై ఉంటారని నమ్మకం. ఆవుకు ఆహారం పెడితే ఆ దేవతలందరికీ పెట్టినంత పుణ్యం దక్కుతుంది. ఆవుకు మొదటి రోటీ పెడితే ఇంట్లో సుఖసంతోషాలు ఉంటాయని, ధనధాన్యాలకు లోటు ఉండదని భావిస్తారు.
24
చివరి రోటీ ఎవరికి?
అలాగే శాస్త్రాల ప్రకారం చివరి రోటీ లేదా చపాతీని ఇంట్లో ఉన్నవారు ఎవరూ తినకూడదు. దాన్ని కుక్కకు తినిపించాలి. ఇలా తినిపించడం వల్ల ఇంట్లో ఉన్న కష్టాలు పోయి సంతోషకరమైన వాతావరణం ఏర్పడుతుంది. పుణ్యం దక్కుతుందని నమ్మకం. ఇది కుటుంబ సభ్యుల ఆరోగ్యాన్ని కూడా కాపాడుతుంది.
34
కుక్కకు రొట్టె తినిపిస్తే కలిగే లాభాలు
కుక్కను యముడి దూతగా చెప్పుకుంటారు. అందుకే చివరి రోటీని కుక్కకు తినిపించడం వల్ల అకాల మరణ భయం ఉండదు.కాలభైరవుడి వాహనం కూడా శునకమే. కాబట్టి ఆ దేవుడి అనుగ్రహం కూడా దక్కుతుంది. రోజూ కుక్కకు రోటీలు, చపాతీలు పెట్టడం వల్ల శని, రాహు, కేతువు వంటి గ్రహాల చెడు ప్రభావాలు తగ్గుతాయని అంటారు.
చాలా మంది ఇంట్లో ఉన్న సభ్యులను లెక్కపెట్టి రోటీలు, చపాతీలు చేస్తారు. అలా చేయడం ఏమాత్రం మంచిది కాదు. ఇది ధనధాన్యాల కొరతకు దారితీస్తుందని చెబుతారు. ఎప్పుడూ కూడా రెండు నుంచి మూడు రొట్టెలు అదనంగా చేసి వాటిని జంతువులకు తినిపించాలి. రాత్రి మిగిలిపోయిన పిండిని తిరిగి ఉదయం వాడకూడదు. అది ఇంట్లోకి నెగెటివ్ శక్తిని ఆకర్షిస్తుంది. భోజనం ప్లేటులో ఎప్పుడూ మూడు రోటీలు లేదా చపాతీలు వేసుకుని తినకూడదు.