చిన్న పిల్లలకు ఆయిల్‌ మసాజ్‌ ఎందుకు చేస్తారు.? నిజంగానే ఎముకలు బలంగా మారుతాయా..

First Published | Jan 11, 2025, 1:34 PM IST

నవజాత శిశువుల ఆరోగ్యం విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలని ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఇంట్లో పెద్దలు చిన్నారుల విషయంలో పలు జాగ్రత్తలు తీసుకుంటారు. వీటిలో ఒకటి చిన్నారులకు ఆయిల్‌ మసాజ్‌ చేయడం. రోజూ రెండుసార్లు ఆయిల్‌తో మసాజ్‌ చేస్తుంటారు. ఇంతకీ ఇలా మసాజ్‌ చేయడం వల్ల చిన్నారులకు ఎలాంటి ప్రయోజనాలు కలుగుతాయో ఇప్పుడు తెలుసుకుందాం.. 
 

నవజాత శిశువులకు ఆయిల్‌ మసాజ్‌ చేస్తుండడం మనం చూస్తూనే ఉంటాం. మన ఇళ్లలో ఇలాంటి దృశ్యాలు కచ్చితంగా కనిపిస్తుంటాయి. పిల్లలకు మూడు నెలలు వచ్చే వరకు ఇలా ఆయిల్‌తో మసాజ్‌ చేస్తుంటారు.

అయితే ఇలా ఆయిల్‌ మసాజ్‌ చేయడం వల్ల చిన్న పిల్లల ఎముకల బలంగా మారుతాయని, కాళ్లు బలంగా మారి త్వరగా నడక అలవాటు అవుతుందని భావిస్తుంటారు. మరి ఇందులో ఎంత వరకు నిజం ఉంది.? నిజంగానే ఆయిల్‌ మసాజ్‌ ఎముకలను దృఢంగా మారుస్తుందా.? ఇప్పుడు తెలుసుకుందాం. 
 

ఆయిల్‌ మసాజ్‌ వల్ల ఎముకలకు ప్రత్యేకంగా ఎలాంటి ప్రయోజనం ఉండదని నిపుణులు చెబుతున్నారు. పెద్దలు దీన్ని ఒక సంప్రదాయంగా పాటిస్తున్నారు. అయితే మసాజ్‌తో ఎముకలు బలంగా మారుతాయన్న దాంట్లో ఎలాంటి శాస్త్రీయ ఆధారాలు లేవని అంటున్నారు. మసాజ్‌ చేయకపోతే పిల్లలు త్వరగా నడవని, నడకలో ఇబ్బందులు ఏర్పడుతాయని చాలా మంది విశ్వసిస్తారు. అయితే ఇందులో ఎలాంటి నిజం లేదు. 


కేవలం జన్యుపరమైన, పౌష్టికాహార లోపం కారణంగానే నడవడం ఆలస్యమవుతుందని అంటున్నారు. పిల్లల ఎముకలు దృఢంగా మారాలాంటే నవజాత శిశువులకు తల్లిపాలతో పాటు క్రమేణ పౌష్టికాహారం ఇవ్వాలని నిపుణులు చెబుతున్నారు.

అలాగే వారికి పోషకాలు అందించే పండ్లను అందించాలని అంటున్నారు. అంతేతప్ప కేవలం ఆయిల్‌ మసాజ్‌ ద్వారానే చిన్నారుల ఎముకలు బలంగా మారుతాయని చెప్పడంలో ఎలాంటి నిజం లేదని నిపుణులు అంటున్నారు. 
 

లాభాలు అస్సలే ఉండవా.? 

అయితే ఆయిల్‌ మసాజ్‌ వల్ల చిన్నారులకు అస్సలు ఎలాంటి ప్రయోజం ఉండదా అంటే.. ఇందులో కూడా నిజం లేదు. నూనెతో మసాజ్‌ చేయడం వల్ల శరీరం ఫ్లిక్స్‌బిలిటీ పెరుగుతుంది. అంతేకాకుండా చర్మ ఆరోగ్యం మెరుగవుతుంది, ఇన్ఫెక్షన్‌ వచ్చే అవకాశం తగ్గుతుంది.

ఆయిల్‌ మసాజ్‌ చేయడం వల్ల చిన్నారుల్లో రక్త ప్రసరణ మెరుగవుతుంది. కణాలలో ఆక్సిజన్ పెరుగుతుంది. ఇది చిన్నారుల్లో నాణ్యతను పెంచుతుంది, ఒత్తిడిని దూరం చేస్తుంది. 

Latest Videos

click me!