మలబద్దకం సమస్య నుంచి బయటపడాలంటే ఇలా చేయండి..

Published : May 01, 2022, 05:06 PM IST

మలబద్దకం సమస్య కారణంగా ఎన్నో అనారోగ్య సమస్యలను ఎదుర్కోవాల్సి ఉంటుంది. అయితే కొన్ని ఇంటి చిట్కాలతో ఈ సమస్యకు చెక్ పెట్టొచ్చు. అవేంటంటే..   

PREV
15
మలబద్దకం సమస్య నుంచి బయటపడాలంటే ఇలా చేయండి..

ఈ గజిబిజీ లైఫ్ లో మనుషులకు వండుకుని తినే సమయమే లేకుండా పోయింది. దీంతో అనారోగ్యకరమైన ఆహారాలను అలవాటు చేసుకుంటున్నారు. దీనివల్ల ఎన్నో అనారోగ్య సమస్యలు చుట్టుకునే ప్రమాదం ఉంది అందులో మలబద్దకం కూడా ఒకటి. ఇది చిన్న సమస్యగా కనిపించినా.. దీనివల్ల ప్రమాదకరమైన హేమోరాయిడ్స్ వంటి వ్యాధులు వచ్చే అవకాశం ఉంది. ఇలాంటి పరిస్థితి రాకూడదంటే ఈ చిట్కాలను పాటించండి. 
 

25

ఆహారంలో మార్పులు.. ఆయిలీ ఫుడ్స్ ఎక్కువగా తీసుకుంటే కూడా మలబద్దకం సమస్య వచ్చే అవకాశం ఎక్కువగా ఉంది. అందులోనూ ఇదివరకే మలబద్దకం సమస్య ఉంటే మీరు ఆయిలీ ఫుడ్స్ ను అస్సలు తీసుకోకండి. ఇవి అంత తొందరగా జీర్ణం కావు. అందుకే తొందరగా జీర్ణం అయ్యే ఆహారాలనే తింటూ ఉండండి. మరొక ముఖ్యమైన విషయం ఏమిటంటే.. ప్రతి గంట గంటలకు తినే అలవాటును కూడా మానుకోవాలి. 

35

సెలెరీ, జీలకర్ర.. మలబద్దకం నుంచి మిమ్మల్ని బయటపడేసేందుకు సెలెరీ, జీలకర్ర ఎంతో సహాయపడతాయి. ఈ రెండు మసాలా దినుసులను తేలికపాటి మంట మీద వేయించి పౌడర్ గా తయారుచేసుకోవాలి. దీన్ని రెగ్యులర్ గా తీసుకుంటే మలబద్దకం సమస్య తొలగిపోతుంది. 

45

గోరువెచ్చని నీళ్లు.. ప్రతిరోజూ నిద్రలేచిన వెంటనే ఒక గ్లాస్ గోరువెచ్చని నీటిని తాగితే మలబద్దకం సమస్య నుంచి బయటపడొచ్చు. గోరువెచ్చని నీళ్లను తాగినప్పుడు కొంచెం ఒత్తిడికి గురైతే.. కొద్ది సేపటి తర్వాత మీరు మలవిసర్జనకు వెళ్లండి. 

55

వేడి పాలలో నెయ్యి.. పాలు సంపూర్ణ ఆహారం. ఎందుకంటే పాలలో ఎన్నో పోషకాలుంటాయి. రాత్రి పడుకునే ముందు గ్లాస్ గోరువెచ్చని పాలలో కొద్దిగా నెయ్యిని కలిపి తాగితే పొట్ట శుభ్రపడుతుంది. మలబద్దకం సమస్య కూడా పోతుంది.  
 

click me!

Recommended Stories