మధుమేహులు క్రమం తప్పకుండా వ్యాయామం చేయాలి. ధ్యానం చేయాలి. యోగ చేయాలి. టైం ప్రకారమే తినాలి. లేదంటే రక్తంలో చక్కెర స్థాయిలు దారుణంగా పెరిగిపోతాయి. మధుమేహులు ఆరోగ్యం విషయంలో కాస్త జాగ్రత్తగా ఉండాలి. లేదంటే ఎన్నో అనారోగ్య సమస్యలు వస్తాయి. షుగర్ పేషెంట్లు ఉదయం వాకింగ్ చేయడం, శారీరక శ్రమ చేయడం ఆరోగ్యానికి మంచిదని డాక్టర్లు, ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. ముఖ్యంగా మధుమేహుల ఆరోగ్యానికి నడక మంచి ప్రయోజనకరంగా ఉంటుందని నిపుణులు చెబుతున్నారు. ఒక కొత్త అధ్యయనం ప్రకారం.. మధుమేహులు ఉదయం నడక కంటే సాయంత్రం, మధ్యాహ్నం తర్వాత నడకతో పాటు శారీరక శ్రమచేస్తే మంచిది. మధ్యాహ్నం, సాయంత్రం వేలల్లో వ్యాయామం చేయడం వల్ల ఇన్సులిన్ నిరోధకత తగ్గుతుంది. ఉదయం పూట వ్యాయామం చేయడం కంటే సాయంత్రం వ్యాయామం చేయడం వల్ల శరీరంలో కొన్ని అవయవాల పనితీరు మెరుగుపడుతుందట. ఇది ఇన్సులిన్ నిరోధకతను కలిగి ఉన్న కణాలను నియంత్రిస్తుందని నిపుణులు చెబుతున్నారు.