Color Cities: పింక్ సిటీ నుంచి గోల్డెన్ సిటీ వరకు.. మన దేశంలో ఈ సిటీలకు ఆ పేరు ఎలా వచ్చింది? ఈ కలర్ కోడ్ సీక్రెట్ ఏంటి?

Published : Nov 04, 2026, 11:19 AM IST

Color Cities: మన దేశంలో కొన్ని ఫేమస్ నగరాలను కొన్ని రకాల కలర్స్ తో పిలుస్తూ ఉంటారు. పింక్ సిటీ, గోల్డెన్ సిటీ అని కొన్ని రకాల కలర్స్ తో పిలుస్తారు. ఆ కలర్ కోడ్ వెనక సీక్రెట్ ఏంటి?

PREV
13
ఈ నగరాలకు ఈ రంగులు ఎలా వచ్చాయి?

మన భారతదేశం సంస్కృతుల నిలయమే కాదు.. అనేక రంగుల కలయిక కూడా. మన దేశంలో కొన్ని స్పెషల్ సిటీలకు కలర్ కోడ్స్ ఉన్నాయి అనే విషయం మీకు తెలుసా? జైపూర్ ని పింక్ సిటీ, జోధ్ పూర్ ని బ్లూ సిటీ, జైసల్మేర్ ను గోల్డెన్ సిటీ అని పిలుస్తారని మనకు తెలుసు. కానీ, అసలు ఆ నగరాలకు ఆయా రంగుల పేర్లు ఎలా వచ్చాయో, వాటి వెనక ఉన్న అసలు రహస్యమేమిటో తెలుసా? ఆ నగరాల కలర్ కోడ్ వెనక సీక్రెట్ ఏంటో చూద్దాం...

23
జైపూర్.. ది పింక్ సిటీ...

రాజస్థాన్ రాజధాని జైపూర్ అనగానే మనకు ముందుగా గుర్తుకు వచ్చేది పింక్ సిటీ. దీని వెనక 1876 నాటి ఒక చరిత్ర ఉంది. అప్పట్లో వేల్స్ యువరాజు, విక్టోరియా రాణి జైపూర్ పర్యటనకు వచ్చారు. వారి రాకను ఘనంగా స్వాగతం పలుకుతూ అప్పటి జైపూర్ పాలకుడు మహారాజా సవాయ్ రామ్ సింగ్ నగరం మొత్తాన్ని టెర్రకోటా పింక్ తో ముస్తాబు చేయించారు. ఆ తర్వాత, నగరంలోని భవనాలు, ఇళ్లకు ఈ రంగునే వేయాలని ఒక చట్టాన్ని కూడా తీసుకువచ్చారు. ఆ సంప్రదాయాన్ని ఇప్పటికీ అలాగే కొనసాగిస్తున్నారు. అందుకే, ఇది పింక్ సిటీగా మారిపోయింది..

ఉదయ్‌పూర్ – ది వైట్ సిటీ (శ్వేత నగరం)

విశాలమైన రమణీయ సరోవరాలు, ధగధగమెరిసే స్పటిక లాంటి పాలరాతి కట్టడాలకు ఉదయ్‌పూర్ వేదిక. అందుకే దీనిని 'వైట్ సిటీ' అని పిలుస్తారు. రాజభవనాలు, కోటలు తెల్లటి పాలరాతి అందాలతో కంటికి వెన్నెల కురిపిస్తుంటాయి. 'సిటీ ఆఫ్ లేక్స్' , 'వెనిస్ ఆఫ్ ది ఈస్ట్' అని పిలవబడే ఈ నగరాన్ని తిలకించేందుకు ఏటా ప్రపంచం నలుమూలల నుండి పర్యాటకులు తరలివస్తుంటారు.

33
జోధ్ పూర్.. ది బ్లూ సిటీ..

జోధ్ పూర్ సిటీని బ్లూ సిటీ అని పిలుస్తారు. అక్కడి ఎత్తైన మెహ్రాన్ గడ్ కోట పై నుంచి కిందికి చూస్తే.. కళ్లకు అద్భుతమైన నీలి రంగు ఇళ్లు ఒక సముద్రంలా కనిపిస్తాయి. మొదట్లో ఇక్కడి బ్రాహ్మణ సామాజికవర్గం తమ ఇళ్లకు ప్రత్యేక గుర్తింపుగా బ్లూ రంగు వేసుకోవడం ప్రారంభించారు. కాలక్రమేణా ఇది నగరంలో ఒక ట్రెండ్‌గా మారిపోయి, ఊరంతా నీలి వర్ణ శోభను సంతరించుకుంది. అంతేకాదు, ఈ బ్లూ రంగు వేయడం వల్ల వేడి తగ్గడంతో పాటు చీమలు, క్రిమికీటకాలు రాకుండా ఉంటాయని అక్కడి ప్రజలు నమ్ముతారు.

జైసల్మేర్ – ది గోల్డెన్ సిటీ

థార్ ఎడారి ఇసుక తిన్నెలపై సూర్యకిరణాలు పడినప్పుడు ఆ దృశ్యం ఎలా ఉంటుందో ఊహించుకోండి... మెరిసే బంగారు కాంతులతో కన్నులపండువగా ఉంటుంది కదూ. జైసల్మేర్ కూడా అచ్చం అలానే కనపడుతుంది. అందుకే, దీనిని గోల్డెన్ సిటీ అని పిలుస్తారు.

5. తిరువనంతపురం – ది ఎవర్ గ్రీన్ సిటీ

కేరళ అనగానే మనకు పచ్చదనమే గుర్తుకొస్తుంది. కానీ, ఇక్కడి తిరువనంతపురం నగరంలోని నిత్య పచ్చదనాన్ని, దానికి ఉన్న నిరంతర శోభను చూసి సాక్షాత్తూ మహాత్మా గాంధీ ఈ నగరానికి "ది ఎవర్ గ్రీన్ సిటీ" అని నామకరణం చేశారు. ఈ సిటీ చూడటానికి రెండు కళ్లు కూడా సరిపోవు.

Read more Photos on
click me!

Recommended Stories