దారుణమైన దురాచారాలు.. చనిపోయిన భర్త గోళ్ళతో, జుట్టుతో సూప్ చేసి భార్యకు?

First Published Oct 24, 2021, 6:51 PM IST

వివాహబంధంతో (Marriage bond) ఒక్కటైన భార్యాభర్తలు నిండు నూరేళ్లు ఒకరికొకరు తోడుగా తమ జీవితాన్ని సాగించాలని కోరుకుంటారు. కానీ విదివైపరీత్యం వారిని ఒకరికొకరుగా దూరం చేస్తుంది. 

వివాహబంధంతో (Marriage bond) ఒక్కటైన భార్యాభర్తలు నిండు నూరేళ్లు ఒకరికొకరు తోడుగా తమ జీవితాన్ని సాగించాలని కోరుకుంటారు. కానీ విదివైపరీత్యం వారిని ఒకరికొకరుగా దూరం చేస్తుంది. భర్త అకాల మరణంతో (Death) భార్య వితంతువుగా మారుతుంది. కానీ పూర్వకాలంలో భర్తతోపాటు భార్యను కూడా చితిలో వేసేవారు.
 

ఇక మరికొన్ని చోట్లలో కూడా వితంతువు స్త్రీ కి దారుణమైన దురాచారాలు (Evils) ఉండేవి. దీంతో పూర్వకాలపు అలవాట్లు, వారి చాదస్తాల వల్ల వితంతువులపై దురాచారాలు, మూఢనమ్మకాలు  వారిపాలిట శాపంగా (Curse) మారేవి. వారు తినే ఆహారంతో పాటు కొన్ని ప్రత్యేక నియమాలను వితంతువులకు ఉండేవని కొన్ని కథనాలలో తెలిపారు. అవేంటో తెలుసుకుందాం.
 

వితంతువుగా ఉన్నప్పుడు రంగు రంగు చీరలు (Colors sarees) కట్టుకోకూడదని, తెల్లని (White) వస్త్రాలకే పరిమితం చేస్తారు. బయటకు వెళ్లే ముందు వారు ఎదురువస్తే మంచిది కాదని భావించేవారు.
 

వారు తీసుకునే ఆహారంలో కొన్ని నియమాలు ఉండేవి. పోషకాహారాలు (Nutrition) ఉండే ఆహారాన్ని ఇచ్చేవారు కాదు. అందరితో కలిసి భోజనం తినకూడదనే నియమం ఉండేది. దారుణమైన, ప్రమాదకర దురాచారాలు (Evils)పాటించేలా వారిపై ఒత్తిడి చేసేవారు. 
 

ఉత్తర ఘనాలో వితంతువులపై ఘోరమైన దురాచారాలను పాటించాలని వారిపై ఒత్తిడి (Stress) చేస్తుంటారు. స్త్రీకి భర్త చనిపోతే శవానికి స్నానం చేయించిన నీళ్లలో గోళ్లు, జుట్టు కలిపి తాగమంటారు. ఘనాలో పేద వితంతువులు (Widows) ఇలాంటి సంప్రదాయాలకు ఎక్కువగా గురవుతుంటారు.
 

అయితే కొంత మంది వితంతువులు వీటిపై పోరాటం (Fight) చేసారు. వారి హక్కులను వారు కాపాడుకునే ప్రయత్నం చేసుకున్నారు. కానీ కొంత మంది పేద వితంతువులు మాత్రం ఈ దురాచారాలకు (vices)  బలి అవుతున్నారు.
 

పూర్వకాలంలో భర్త చనిపోతే ఆస్తి పై హక్కులు (Rights) అతడి కుటుంబ సభ్యులకే చెందుతాయి. భర్త కుటుంబంలోని మరొకరిని పెళ్లి (Married) చేసుకుంటేనే ఆ స్త్రీకి తిరిగి ఆస్తులు వస్తాయని నియమాలు ఉండేవి.
 

కొన్ని దశాబ్దాల ముందువరకూ పశ్చిమ బెంగాల్‌లోని ఉన్నత కులాలకు చెందిన హిందూ మహిళలు భర్త మరణానికి మూల్యం (Value) చెల్లించుకోవాల్సివచ్చేదని బెంగాలీ చరిత్రలో ఉండేది. భర్త చనిపోతే పాపం అని భావించి, దానికి సరైన ప్రాయశ్చిత్తం (Atonement) చేసుకోవాలని చెప్పేవారు. 
 

ఈ ప్రాయశ్చిత్తంలో భాగంగా తినే ఆహారంలో చేపలు, మాంసం, గుడ్లు, ఉల్లి, వెల్లుల్లి వంటి ఆహారపదార్థాలకు (Foods) దూరంగా ఉండేవారు. వితంతు జీవితాలపై పోషకాహారంలోపం, ఆహారపు అలవాట్లు గట్టి ప్రభావం చూపుతున్నట్లు పరిశోధనలో (Research) కూడా తేలింది.

click me!