
ఒక వయసు తర్వాత జుట్టు తెల్లబడటం చాలా సహజం. కానీ ఈ రోజుల్లో చాలా మందికి చిన్నవయసులోనే జుట్టు తెల్లగా అవుతుంది. శరీరంలో పోషకాలు తగ్గడం, ఎండకు ఎక్కువగా ఉండటం, కాలుష్యం, ఒత్తిడి, కొన్ని అనారోగ్య సమస్యల వల్ల చిన్న ఏజ్ లోనే తెల్ల జుట్టు వస్తుంది.
అందుకే చాలా మంది ఈ తెల్ల జుట్టును దాచడానికి హెయిర్ కలర్ ను వాడుతుంటారు. కానీ ఈ హెయిర్ కలర్ ఎక్కువ రోజులు ఉండదు. వారం కంటే ముందే జుట్టు కలర్ పోతుంది. అందుకు చాలా మంది జుట్టుకు తరచుగా కలర్ ను వేస్తుంటారు. కానీ వీటిలో కెమికల్స్ ఉంటాయి. ఇవి జుట్టును డ్యామేజ్ చేస్తాయి. వెంట్రుకలు ఊడిపోయేలా చేస్తాయి. అందుకే హెయిర్ కలర్ ను వాడొద్దని నిపుణులు చెబుతున్నారు.
అందుకే తెల్ల వెంట్రుకలను దాచడానికి బదులుగా ఏం చేస్తే తెల్ల వెంట్రుకలు రాకుండా ఉంటాయో చూసుకోవాలి. ఇందుకోసం మీరు తినే ఆహారంపై శ్రద్ధ పెట్టాలి. నిపుణుల ప్రకారం.. ఆరోగ్యకరమైన ఆహారం తెల్ల జుట్టు రాకుండా చేస్తుంది. అయితే మీ శరీరానికి అవసరమైన పోషకాలు తగ్గితే మీరెన్ని ప్రయత్నాలు చేసినా జుట్టు తెల్లబడకుండా ఉండదు. అయితే కొన్ని ఇంటి చిట్కాలు జుట్టు తెల్లబకుండా చేయడానికి సహాయపడతాయి. ముఖ్యంగా ఒక స్పెషల్ పేస్ట్ ను జుట్టుకు పెడితే జుట్టు తెల్లబడదు. అలాగే జుట్టు రాలడం కూడా తగ్గుతుంది. ఇందుకోసం ఏం పేస్ట్ ను జుట్టుకు పెట్టాలో తెలుసుకుందాం పదండి.
జుట్టు తెల్లబడకుండా ఏం పెట్టాలి?
కరివేపాకు పేస్ట్ తెల్ల జుట్టు రాకుండా చేయడంలో చాలా ఎఫెక్టీవ్ గా పనిచేస్తుంది. అలాగే జుట్టు నల్లగా నిగనిగలాడేలా చేస్తుంది. ఒకవేళ తెల్ల జుట్టు ఉన్న నల్లగా అవుతుంది. నిపుణుల ప్రకారం.. కరివేపాకు మెలనిన్ ఉత్పత్తిని పెంచుతుంది. ఇది మీ జుట్టును నల్లగా చేస్తుంది. కరివేపాకును జుట్టుకు పెట్టడం వల్ల జుట్టు పొడుగ్గా పెరుగుతుంది. చిన్న వయసులో తెల్ల జుట్టు రాకుండా చేస్తుంది. నెత్తిమీదున్న చుండ్రును కూడా తగ్గిస్తుంది. అంతేకాదు ఇది మన జుట్టు సాఫ్ట్ గా, మెరిసేలా చేస్తుంది.
కరివేపాకును జుట్టుకు పెడితే జుట్టు రాలడం తగ్గి.. బలంగా పెరుగుతుంది. అలాగే జుట్టుకు మంచి పోషణ కూడా అందుతుంది. కరివేపాకులో యాంటీ ఆక్సిడెంట్స్, విటమిన్ సి, విటమిన్ బి, ప్రోటీన్స్ పుష్కలంగా ఉంటాయి. ఇవి జుట్టుకు సంబంధించిన సమస్యలను తగ్గించడానికి సహాయపడతాయి. కరివేపాకు పేస్ట్ ను జుట్టుకు పెట్టిస్తే మీ జుట్టు చాలా బలంగా అవుతుంది. దీనిలో పుష్కలంగా ఉండే యాంటీ ఆక్సిడెంట్లు జుట్టు రంధ్రాలను బలంగా చేస్తాయి. అలాగే నెత్తిమీద రక్తప్రసరణ పెరిగి తెల్లజుట్టు రాకుండా ఉంటుంది.
కరివేపాకు పేస్ట్ ను జుట్టుకు ఎలా పెట్టాలి?
ఇందుకోసం గుప్పెడు కరివేపాకులో పెరుగును వేసి మెత్తగా గ్రైండ్ చేయండి. అంతే ఈ పేస్ట్ ను నేరుగా తలకు బాగా పట్టించండి. ఒక అరగంట తర్వాత తలస్నానం చేయండి. ఇలా తరచుగా చేస్తే మీ జుట్టు చిన్న వయసులో తెల్లబడకుండా ఉంటుంది. ఒకటిరెండు తెల్ల వెంట్రుకలు వచ్చినా అవి పెరగకుండా ఉంటాయి.