హైదరాబాద్ కు వెళ్తున్నారా.. అయితే ఖచ్చితంగా ఈ క్రేజీ రెస్టారెంట్స్ ని ఒకసారి చూడాల్సిందే!

Navya G   | Asianet News
Published : Feb 04, 2022, 02:59 PM IST

ఒకప్పుడు హోటల్స్ ఎలా ఉండేవో మనందరికీ తెలుసు. ఒక షెడ్డు లాగా ఉండి.. అందులో కొన్ని టేబుల్స్ ఉండేవి. ఇక రాను రాను టెక్నాలజీ పెరగటంతో ఎన్నో మార్పులు వచ్చాయి. హోటల్స్ కాస్త రెస్టారెంట్లు గా మారాయి. అవి చూడ్డానికి అచ్చం ఇంద్రభవనంలా కనిపిస్తుంటాయి. పైగా ఎన్నో రుచికరమైన పదార్థాలు కూడా దొరుకుతుంటాయి. మామూలుగా మనం రెస్టారెంట్ లోకి వెళ్తే అక్కడ దొరికే స్పెషల్ ఫుడ్ మాత్రమే చూస్తాము. అంతేకానీ ఆ రెస్టారెంట్ లో ఉండే ఆ అందాలను మాత్రం చూడము. కానీ అలాంటి అందాలను ఆస్వాదిస్తూ రుచికరమైన భోజనం తినాలి అంటే ఒక్కసారైనా ఈ రెస్టారెంట్ లను ట్రై చేయండి. ఇంతకీ అవేంటో ఒకసారి చూద్దాం.  

PREV
120
హైదరాబాద్ కు వెళ్తున్నారా.. అయితే ఖచ్చితంగా ఈ క్రేజీ రెస్టారెంట్స్ ని ఒకసారి చూడాల్సిందే!

ఖైదీ రసోయ్ (బంజారా హిల్స్): ఈ రెస్టారెంట్ చూడటానికి జైలు మాదిరిగా ఉంటుంది. ఇందులో పనిచేసే సర్వర్స్ కూడా ఖైదీ లాగా డ్రెస్ వేసుకొని ఉంటారు.
 

220

టాకింగ్ హాండ్స్ (బేగంపేట్): ఈ రెస్టారెంట్ చాలా భిన్నంగా ఉంటుంది. ఇందులో ఆర్డర్ చెప్పాలంటే సైన్ లాంగ్వేజ్ లో ఆర్డర్ చేయాలి.
 

320

డైలాగ్ ఇన్ ద డార్క్ (ఇనార్బిట్ మాల్): ఈ రెస్టారెంట్ లో చీకట్లో తినాలి. ముఖ్యంగా ఇందులో సర్వీస్ చేసేవాళ్ళు బ్లైండ్ పీపుల్స్ మాత్రమే. చీకట్లోనే ఫుడ్డు ని సర్వే చేస్తూ ఉంటారు.
 

420

ద గ్రాండ్ ట్రంక్ రోడ్ (మాదాపూర్):  ఈ రెస్టారెంట్లో బ్యాక్గ్రౌండ్ మొత్తం పంజాబీ స్టైల్ లో ఉంటుంది. ఇక్కడ ఫుడ్డు కూడా చాలా బాగుంటుంది.
 

520

బీచ్ హౌస్ (మాదాపూర్): ఈ రెస్టారెంట్ చాలా అందంగా ఉంటుంది. ఇందులో ఉంటే బీచ్ లో ఉన్నట్టు ఫీలింగ్ అనిపిస్తుంది.
 

620

సాహిబ్ సింధ్ సుల్తాన్ (బంజారా హిల్స్): ఈ రెస్టారెంట్ ట్రైన్ రెస్టారెంట్ మాదిరిగా ఉంటుంది. ఇందులో ట్రైన్లో కూర్చొని ఫుడ్డు తినవచ్చును.
 

720

ఒహరీస్ సిరెంగేటి (బంజారా హిల్స్): ఈ రెస్టారెంట్ మొత్తం ఫారెస్ట్ లో తిన్నట్టు ఉంటుంది. చెప్పాలంటే ఆఫ్రికన్ రైన్ ఫారెస్ట్ లో వెళ్లినట్లు ఉంటుంది.
 

820

ఒహరీస్ గూఫా (బషీర్ బాగ్): ఈ రెస్టారెంట్ ను చూస్తే ఒక గుహలో కూర్చుని తిన్నట్లు అనిపిస్తుంది. ఇందులో లైట్స్ కూడా చాలా డల్ గా అనిపిస్తాయి. అంతేకాకుండా స్టాఫ్ మొత్తం వేటగాళ్లు లాగా డ్రెస్సులు వేసుకుంటారు.
 

920

విలేజ్ ది సోల్ ఆఫ్ ఇండియా (హైటెక్ సిటీ): ఈ రెస్టారెంట్ మొత్తం జాతర వలె ఉంటుంది. మొత్తం పల్లెటూర్లో ఉన్నట్టు అనిపిస్తుంది.
 

1020

రియల్ అరేబియన్ దాబా (చంద్రాయణ్ గుట్ట): ఈ రెస్టారెంట్ లో కూర్చొని భోజనం చేస్తే అరేబియన్ లో ఉన్నట్లు ఫీల్ వస్తుంది. పైగా భోజనం కూడా బాగుంటుంది.
 

1120

ఒహరీస్ 1857 (నెక్లెస్ రోడ్): ఇది ఒకప్పటి రాజుల కాలంలో ఉన్న విధంగా ఉంటుంది. ఇక్కడ ఫుడ్డు కూడా చాలా బాగుంటుంది.
 

1220

లాగూన్ - ది షాక్ ( సైనిక పురి): ఇక ఇది ఒక బీచ్ మాదిరిగా ఉంటుంది. ఇందులో ఫుడ్డు చేస్తుంటే బీచ్ లో ఉండి చేసినట్లు అనిపిస్తుంది.
 

1320

ది పైరేట్ బ్రేవ్ ( జూబ్లీహిల్స్): ఈ రెస్టారెంట్ లో షిప్ మీద కూర్చొని బుడ్డి చేసిన ఫీలింగ్ అనిపిస్తుంది. నైట్ టైం లో ఇక్కడ చాలా బాగుంటుంది.
 

1420

ది ఫిషర్ మాన్స్ వార్ఫ్ (గచ్చిబౌలి): ఈ రెస్టారెంట్ కి వెళ్తే గోవా కి వెళ్లినట్లు ఫీలింగ్ అనిపిస్తుంది. ఇక ఇక్కడ కూడా మంచి ఫుడ్ దొరుకుతుంది.
 

1520

ఒహరీస్ 70ఎమ్ ఎమ్ (నెక్లెస్ రోడ్): ఇక ఈ రెస్టారెంట్ ఒకప్పుడు బాలీవుడ్ స్టైల్ మాదిరిగా ఉన్నట్లు అనిపిస్తుంది.
 

1620

ఓలీవ్ బిస్ట్రో (జూబ్లీహిల్స్): ఈ రెస్టారెంట్ లో యూరోపియన్ కల్చర్ కనిపిస్తుంది. ఇక్కడ వెళ్లి ఫుడ్డును ఎంజాయ్ చేస్తూ చేయవచ్చు.
 

1720

ఒహరీస్ మెహ్ఫిల్ (సికింద్రాబాద్): ఈ రెస్టారెంట్ లోపల డిజైన్స్ చాలా అద్భుతంగా ఉంటాయి. ఎవరినైనా ఇంప్రెస్స్ చెయ్యాలి అంటే ఈ రెస్టారెంట్ చాలు.
 

1820

జ్యువెల్ ఆఫ్ నిజాం (మాసబ్ ట్యాంక్): ఈ రెస్టారెంట్ లో నిజాం కల్చర్ బాగా కనిపిస్తుంది. అంతేకాకుండా చాలా రిచ్ గా కూడా అనిపిస్తుంది.
 

1920

ది అటోమన్ లీఫ్ కేఫ్ (జూబ్లీహిల్స్): ఇక ఈ రెస్టారెంట్లో కూర్చుని భోజనం చేస్తే గార్డెన్ లో కూర్చొని చేసినట్లు అనిపిస్తుంది. ఇక్కడ డిజైన్స్ కూడా  చాలా అందంగా ఉంటాయి.
 

2020

డాక్ 46 (జూబ్లీహిల్స్): ఇక ఈ రెస్టారెంట్ మాత్రం ఆనందంగా ఉంటుంది. లోపల ఇంటీరియర్స్ చూస్తే మాత్రం మతి పోవాల్సిందే. కాబట్టి వీలు దొరికినప్పుడు వీటిని ట్రై చేయండి.

click me!

Recommended Stories