క్రాన్ బెర్రీల్లో ఉండే పోషకాలు.. 100 గ్రాముల క్రాన్ బెర్రీ పండ్లలో 46 గ్రాముల కేలరీలు, 3.6 గ్రాముల ఫైబర్, 4.3 గ్రాముల చక్కెర, 11 మి.గ్రా భాస్వరం, 91 మైక్రోగ్రాముల లుటిన్ ఉంటాయి. ఈ పండులో తక్కువ కేలరీలు, అధిక పోషకాలుంటాయి. ఈ పండులో.. వృద్ధాప్యం కారణంగా వచ్చే దృష్టి నష్టాన్ని (Vision loss) ను నివారించడంలో సహాయపడే పదార్థాలు కూడా ఉన్నాయి.