Coronavirus infection: సాధారణ కోవిడ్ లక్షణాలను ఎదుర్కోవడానికి ఈ ఆయుర్వేద చిట్కాలు బాగా సహాయడపతాయి..

Published : May 09, 2022, 11:41 AM IST

Coronavirus infection: ఆయుర్వేద వైద్యం కూడా ఎన్నో రోగాలను దూరం చేస్తుంది. ముఖ్యంగా కొన్ని రకాల ఆయుర్వేద చిట్కాలు ఇమ్యూనిటీ వపర్ ను పెంచి.. కోవిడ్ లక్షణాలను ఎదుర్కోవడానికి ఎంతో సహాయపడతాయి. అవేంటంటే.. 

PREV
18
Coronavirus infection: సాధారణ కోవిడ్ లక్షణాలను ఎదుర్కోవడానికి ఈ ఆయుర్వేద చిట్కాలు బాగా సహాయడపతాయి..

Coronavirus infection: తగ్గుతుందనుకుని కాస్త ఊపిరి పీల్చుకునే లోపే కరోనా మహమ్మారి మళ్లీ విరుచుకుపడుతోంది. ఒకటి పోతే ఇంకోటి అన్నట్టు.. రకరకాల రూపాలతో వస్తోంది. ఈ మహమ్మారి నుంచి మనల్ని మనం రక్షించుకోవాల్సిన అవసరం ఎంతో ఉందని ప్రభుత్వాలు ప్రజలకు హెచ్చరికలు జారీ చేస్తున్నాయి. ముఖ్యంగా దీని బారిన పడుకుండా ఉండాలన్నా.. దీని నుంచి త్వరగా బయటపడాలన్నా మన రోగ నిరోధక వ్యవస్థ బాగుండాలి. అప్పుడే మీరు ఆరోగ్యంగా, ఎలాంటి అపాయం లేకుండా ఉంటారు. అయితే మన ఇమ్యూనిటీ పవర్ ను పెంచడానికి మన వంటింట్లో ఉండే కొన్ని మూలికలు, సుగంధ ద్రవ్యాలు బాగా ఉపయోగపడతాయి. అంతేకాదు కోవిడ్ సాధారణ లక్షణాల నుంచి మనల్ని తొందరగా బయటపడేయడానికి సహాయపడతాయి. 

28

కోవిడ్ సాధారణ లక్షణాలు.. తలనొప్పి, గొంతునొప్పి, ముక్కు కారడం వంటి లక్షణాలు కోవిడ్ సాధారణ లక్షణాలు. వీటి బారిన పడ్డప్పుడు ఆయుర్వేద చిట్కాలను ఫాలో అయితే ఈ లక్షణాలు తొందరగా తగ్గుతాయి. అవేంటంటే.. 

38

తులసి..  తులసిలో యాంటీ వైరట్, యాంటీ బ్యాక్టీరియల్, యాంటీ ఫంగల్, యాంటీ ప్రొటోజోల్, యాంటీ మలేరియా, యాంటీ డయేరియా, యాంటీ ఆక్సిడెంట్, యాంటీ ఇన్ణ్లమేటరీ, కెమోప్రెవెంటివ్, న్యూరో ప్రొటెక్టివ్, యాంటీ ప్రొటెక్టివ్, యాంటీ డయాబెటిక్, యంటీ హైబర్ పొలెస్టెరోలెమియా, యాంటీ హైపర్ టెన్షన్ వంటి మరెన్నో ముఖ్యమైన గుణాలున్నాయి. ఇవన్నీ మనల్ని ఎన్నో రోగాలు, అనారోగ్య సమస్యల నుంచి మనల్ని రక్షిస్తాయి. అలాగే ఇది జలుబును తగ్గించడానికి కూడా ఎంతో సహాయపడుతుంది. 

48

అల్లం.. అల్లంలో జింజెరోల్స్, పారాడోల్స్ యాంటీ ఇన్ఫ్లమేటరీ, యాంటీ మైక్రోబయల్ వంటి లక్షణాలు ఉంటాయి. అంతేకాదు దీనిలో β-బిసాబోలీన్, α-కర్కుమిన్, జింగిబెరీన్, α-ఫర్నేసీన్ మరియు β-సెస్క్విఫెల్లాండ్రీన్ వంటి అనేక టెర్పీన్ సమ్మేళనాలు కూడా ఉన్నాయి. ఇవి యాంటీ ఆక్సిడెంట్ లా పనిచేస్తాయి. అలాగే కోవిడ్ లక్షణాలను అధిగమించడానికి కూడా సహాయపడతాయి. ఇందుకోసం రెండు ఎండు అల్లం ముక్కలను 2 కప్పుల నీటిలో ఉడకబెట్టి.. చల్లారిన తర్వాత రోజంతా నెమ్మదిగా అప్పుడప్పుడూ తాగుతూ ఉండాలి. 

58

త్రిఫల.. త్రిఫల మూడు ముఖ్యమైన  మూలికల మిశ్రమం. ఈ త్రిఫల ను వేడి నీటితో తీసుకుంటే పేగు ఆరోగ్యంగా ఉంటుందని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. దీనిని టీగా చేసుకుని కూడా తీసుకోవచ్చు. ఈ త్రిఫల ను రాత్రి పడుకునే ముందు తీసుకుంటే మంచి ఫలితాలొస్తాయి. 

68

త్రికటు చూర్ణం.. జలుబు, గొంతునొప్పి వంటి సమస్యల నివారణకు త్రికాటు బాగా ఉపయోగపడుతుంది. త్రికటు చూర్ణానాన్ని నల్లమిరియాలు, పొడవైన మిరియాలు, అల్లాన్ని కలిపి తయారుచేస్తారు. నిపుణుల అభిప్రాయం ప్రాకారం.. ఈ మిశ్రమం యాంటీ ఆన్ఫ్లమేటరీ గుణాలను కలిగి ఉంటుంది. ఇది రోగ నిరోధక శక్తిని పెంచుతుంది. నల్లమిరియాల ఘాటును తగ్గించడానికి ఈ మిశ్రమంలో కాస్త తేనెను కలపొచ్చు. ఈ మిశ్రమాన్ని రోజంతా అప్పడప్పుడు నాకితే మంచి ఫలితం ఉంటుంది. 

78

పసుపు.. హల్దీ దూద్ గా పిలవబడే పసుపు కలిపిన పాలు జలుబును తగ్గించడానికి ఎంతో సహాయపడతాయి. అంతేకాదు ఇది ఇమ్యూనిటీ పవర్ ను పెంచడానికి కూడా ఎంతో సహాయపడుతుంది.  ఇందుకోసం 150 మిల్లీలీటర్ల వేడి పాలలో అర టీ స్పూన్ పసుపును వేసి.. రోజుకు రెండు సార్లు తీసుకుంటే మంచి ఫలితం ఉంటుంది. 
 

88

హెర్బల్ టీ.. తులసి ఆకులు, దాల్చిని చెక్క, నల్లమిరియాలు, ఎండు అల్లం, ఎండుద్రాక్షలతో హెర్బల్ టీని తయారుచేస్తారు. దీనిలో రుచి కోసం బెల్లం లేదా.. నేచురల్ షుగర్ ను, తాజా నిమ్మరసాన్ని యాడ్ చేసుకోవచ్చు. ఈ టీ రోగ నిరోధక శక్తిని పెంచడానికి ఎంతో సహాయపడుతుంది. 

Read more Photos on
click me!

Recommended Stories