Cooler: అప్పుడ‌ప్పుడు కూల‌ర్‌లో గాలి ఎందుకు వేడిగా వ‌స్తుంది.? చ‌ల్ల‌గా రావాలంటే ఏం చేయాలి.?

Published : May 06, 2026, 01:26 PM IST

Cooler Cooling Tips: వేసవి కాలంలో ఉష్ణోగ్రతలు పెరిగే కొద్దీ ఇంట్లో ఉండటం కూడా కష్టంగా మారుతోంది. అందుకే చాలా మంది తక్కువ ఖర్చుతో చల్లదనం ఇచ్చే కూలర్‌ను ఉపయోగిస్తారు. కానీ కొన్ని సందర్భాల్లో కూలర్ నుంచి కూడా చ‌ల్లని గాలి రాదు. అలాంటప్పుడు ఏం చేయాలంటే 

PREV
15
కూలర్ నుంచి చల్లని గాలి రాకపోవడానికి కారణాలు

కూల‌ర్ నుంచి వేడి గాలి వ‌స్తే అది పాడైపోయింద‌ని చాలా మంది అనుకుంటారు. కానీ ప్రతి సారి అది నిజం కాదు. కూలింగ్ ప్యాడ్స్‌పై దుమ్ము, మట్టి పేరుకుపోవడం వల్ల గాలి సరిగ్గా చల్లబడదు. నీటి సరఫరా సరిగా లేకపోవడం, ట్యాంక్‌లో మురికి లేదా పాకురు (ఆల్గీ) పేరుకుపోవడం, గాలిలో తేమ ఎక్కువగా ఉండటం లేదా పంప్ సరిగ్గా పనిచేయకపోవడం కూడా కారణాలు కావచ్చు. ఈ సమస్యలు ఉన్నప్పుడు కూలర్ నుంచి వచ్చే గాలి తక్కువ చల్లగా అనిపిస్తుంది.

25
కూలర్ నీళ్లలో ఇదొక్క‌టి వేస్తే చాలు

కూలర్ నీళ్లలో ఒక చిన్న ముక్క ప‌టిక వేస్తే మంచి ఫలితం కనిపిస్తుంది. దీనికి సహజంగా శుభ్రపరిచే లక్షణాలు ఉంటాయి. ఇది నీటిలో ఉన్న దుమ్ము, మట్టి వంటి చిన్న కణాలను అడుక్కు చేరేలా చేస్తుంది. దీంతో నీరు స్వచ్ఛంగా మారుతుంది. అలాగే కూలర్ ట్యాంక్‌లో ఉండే దుర్వాసనను తగ్గించడంలో కూడా ఇది సహాయపడుతుంది.

35
దోమల సమస్యకు ఎలా ఉపశమనం?

కూలర్ నీటిలో దోమలు గుడ్లు పెట్టడం సాధారణ విషయం. దీని వల్ల ఇంట్లో దోమల సమస్య పెరుగుతుంది. కానీ ప‌టిక‌ వేసిన తర్వాత నీరు ఎక్కువ కాలం శుభ్రంగా ఉంటుంది. దోమలు పెరగడానికి అవకాశాలు తగ్గుతాయి. దీంతో గది లోపల కూడా దోమల ఇబ్బంది కొంత వరకు తగ్గుతుంది.

45
ప‌టిక వేస్తే గాలి చ‌ల్ల‌గా ఎలా మారుతుంది.?

నీరు శుభ్రంగా ఉంటే అది కూలింగ్ ప్యాడ్స్‌కి సరిగ్గా చేరుతుంది. ప్యాడ్స్ మీద మురికి తక్కువగా పేరుకుపోవడంతో గాలి సరిగ్గా చల్లబడుతుంది. దీనివల్ల కూలర్ నుంచి వచ్చే గాలి మరింత ఫ్రెష్‌గా, చల్లగా అనిపిస్తుంది. అంటే ప‌టిక‌ వాడకం కూలింగ్ ఎఫెక్ట్‌ను పరోక్షంగా పెంచుతుంది.

55
కూలర్ లైఫ్ పెరగడానికి ఎలా సహాయపడుతుంది?

ప‌టిక‌ కేవలం గాలి నాణ్యతను మాత్రమే కాదు, కూలర్ ఆయుష్షును కూడా పెంచుతుంది. ట్యాంక్‌లో మురికి పేరుకుపోవడం తగ్గుతుంది. పంప్ మిష‌న్‌లో జామ్‌ అవ్వడం తగ్గి, ప్యాడ్స్ ఎక్కువకాలం పనిచేస్తాయి. అలాగే తెల్లటి పొర (స్కేల్) ఏర్పడే అవకాశం కూడా తగ్గుతుంది. దీని వల్ల కూలర్ ఎక్కువ రోజులు స‌క్ర‌మంగా పనిచేస్తుంది.

Read more Photos on
click me!

Recommended Stories