సాధారణంగా ఆడవారే అభద్రతా భావానికి లోనవుతారు. శరీరం మరీ సన్నగా, లేదా మరీ ఎక్కువ లావుగా ఉండటం, రొమ్ముల పరిమాణం చిన్నగా ఉండటం వంటి విషయాల్లో ఆడవారు అభద్రతా భావానికి లోనవుతారు. ఇవి పురుషులను ఆకర్శించలేవు లేదా వారు సంతోషించేలా చేయవని భావిస్తుంటారు. ఆడవాళ్ల మాదిరిగానే మగవారు కూడా సెక్స్ విషయంలో ఎన్నో అభద్రతా భావానికి లోనవుతారు. వీళ్లు మంచంపై ఎలా పనిచేస్తారు? తమ భాగస్వామిని మెప్పించగలరా లేదా అనే దాని గురించి చాలా ఇబ్బందికరంగా, విచిత్రంగా భావిస్తారు. ఈ సాధారణ అభద్రత భావాలు పురుషుల ఆత్మవిశ్వాస స్థాయిలను, ఆత్మగౌరవాన్ని కూడా ప్రభావితం చేస్తుంది. లైంగిక పనితీరు విషయానికి వస్తే పురుషులు ఎదుర్కొనే సాధారణ అభద్రత భావాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం..