Cold: ఎండాకాలంలో కూడా జలుబు చేయడానికి కారణాలు.. నివారణా మార్గాలు..

Published : Apr 23, 2022, 12:28 PM IST

Cold: చలికాలంలో జలుబు చేయడం సర్వ సాధారణం. చల్లటి వెదర్ కు జలుబు చేస్తుందని మనందరికీ తెలిసిందే. కానీ మండుటెండల్లో కూడా కొందరికీ జలుబు చేస్తుంటుంది. దీనికి కారణమేంటో తెలుసా..? 

PREV
112
Cold: ఎండాకాలంలో కూడా జలుబు చేయడానికి కారణాలు.. నివారణా మార్గాలు..

Cold: చలికాలంలోనే జలుబు చేస్తుందని మనందరికీ తెలిసిందే. ఆ సీజన్ లో వెదర్ ఎల్లప్పుడూ కూల్ గా ఉండటంతో అలా అవుతుంది. కానీ కొంతమందికి ఎండాకాలంలో కూడా జలుబు చేస్తుంది. చలికాలంలో అయితే ఇది కామన్ అనుకోవచ్చు. కానీ ఈ మండుటెండల్లో కూడా జలుబు ఎందుకు చేస్తుందబ్బా? అని కొంతమందికి ప్రశ్నలు తలెత్తుతుంటాయి. 

212

ఒక వైపు దంచి కొడుతున్న ఎండలైతే.. మరోవైపు దారుణమైన ఉక్కపోత.. దీనికి తోడు బెట్ట జలుబు. ఈ మూడింటితో ఇబ్బందులు పడే వారు చాలా మందే ఉన్నారు. మరి ఈ సీజన్ లో కూడా జలుబు చేయడానికి కారణాలేంటో ఈ ఆర్టికల్ ద్వారా తెలుకుందాం పదండి. 

312

శరీర ఉష్ణోగ్రతలు వాతావరణంలో మార్పులు రావడం వల్ల హెచ్చుతగ్గులకు లోనవుతుంది. అంతేకాదు సీజన్ల మార్పుల వల్ల మన శరీరంలో రోగ నిరోధక శక్తి కూడా తగ్గిపోతూ ఉంటుంది. దీంతో దగ్గు, జలుబు వంటి సమస్యలు వస్తుంటాయి. 

412
cold

వేసవిలో జలుబు చేయడానికి కారణాలు ఇవే.. రినోవైరస్ వల్లే ఈ ఎండాకాలంలో జలుబు చేస్తుంది. ఈ వైరస్ వేడి వాతావరణంలో కూడా వ్యాపించగలదు. ముఖ్యంగా ఇది పిల్లలకు ఎక్కువగా వ్యాపించే అవకాశం ఉంది. ఎందుకంటే పిల్లలు ఎక్కువగా బయట ఆడుకుంటూ ఉంటారు. అలాగే ఐస్ క్రీమ్స్ లేదా కూల్ డ్రింక్స్ ను ఎక్కువగా తాగుతుంటారు. దీనివల్ల కూడా జలుబు చేస్తుంది

512

కొన్నికొన్నిసార్లైతే.. వేడి కారణంగా కూడా జలుబు చేస్తుంది. ఎలా అంటే.. విపరీతమైన ఎండల నుంచి మీరు ఇంట్లోకి వచ్చి.. బాడీ హీట్ ను తగ్గించుకోవడానికి ఎయిర్ కండీషనర్ ప్లేసెస్ లో ఉంటారు. అప్పుడు మీ ఒంట్లో ఉండే వేడంతా బహిర్గతం అవుతుంది. అయితే ఈ సమయంలో శరీరం నిర్ణీత డిగ్రీల్లో ఉష్ణోగ్రతను క్రమబద్దం చేయలేకపోతుంది. చలి, విపరీతమైన వేడి కారణంగా జలుబు చేస్తుంది. 
 

612

వేసవిలో జలుబును తగ్గించే చిట్కాలు.. విటమిన్లు ఎక్కువగా ఉండే ఆహారాలను తీసుకోవడం వల్ల శరీరంలో రోగనిరోధక శక్తి పెరుగుతంది. ఈ రోగనిరోధక శక్తి వేడిని, జలుబును తగ్గించేందుకు ఎంతో సహాయపడుతుంది. విటమిన్ సి ఎక్కువగా ఉండే సిట్రస్ ఫ్రూట్స్ తీసుకుంటే ఆరోగ్యం బాగుంటుంది. 
 

712

శరీరంలో విషపదార్థాలు బయటకు పోవాలంటే ప్రతిరోజూ నీళ్లను ఎక్కువ మొత్తంలో తీసుకుంటూ ఉంటాలి. శరీరానికి సరిపడా నీళ్లను తాగడం వల్ల ఎలాంటి అనారోగ్య సమస్యలు వచ్చే అవకాశమే ఉండదు. 

812
hand wash

ముఖ్యంగా పబ్లిక్ రెస్ట్ రూమ్స్ ను ఉపయోగించిన తర్వాత  చేతులను శుభ్రంగా కడగాలి. లేదంటే లేనిపోని రోగాలు మిమ్మల్ని చుట్టుకునే ప్రమాదం ఉంది.
 

912

జలుబు ఉన్న వారితో దగ్గరగా ఉండి మాట్లాడకండి. వారి నుంచి మీకు సోకే ప్రమాదం ఉంది. ఆకుకూరలను ఎక్కువగా తింటూ ఉండండి. అలాగే దోసకాయ, బచ్చలి కూరలను తినడం వల్ల మీ శరీరం శుభ్రపడుతుంది. ఇవి రోగనిరోధక శక్తిని కూడా పెంచుతాయి. జలుబును కూడా తగ్గిస్తాయి. 
 

1012

జలుబు నుంచి ఉపశమనం పొందాలంటే.. కొబ్బరి నీళ్లను రెగ్యులర్ గా తీసుకోండి. రోజుకు రెండు పూటలా కొబ్బరి నీళ్లను తాగితే వేసవి జలుబు నుంచి సులభంగా బయటపడతారు. 

1112
steam

ఆవిరి పడితే జలుబు సమస్య నుంచే కాదు దగ్గు, గొంతు నొప్పి నుంచి కూడా ఉపశమనం పొందుతారు. జలుబుతో బాధపడేవారు మిరియాలు, వెల్లుల్లి ఆహారాలను ఎక్కువగా తీసుకుంటే ఉపశమనం లభిస్తుంది. 

1212

ఈ సమస్య నుంచి తొందరగా బయటపడేయడానికి పండ్ల రసాలు బాగా ఉపయోపడతాయి. అందులో విటమిన్ సి ఉండే ఫ్రూట్స్. నారింజ, నిమ్మ, పైనాపిల్, పుచ్చకాయ వంటి పండ్లను ఎక్కువగా తింటే జలుబు నుంచి బయటపడతారు. 

click me!

Recommended Stories