తమన్నా మాటల్లో..
తమన్నా తన ఫిట్నెస్ సీక్రెట్ గురించి తాజాగా ఓ ఇంటర్వ్యూలో మాట్లాడారు. ఎంత బిజీగా ఉన్నా ఉదయం యోగా, స్విమ్మింగ్ లాంటివి చేస్తారట. నానబెట్టిన బాదంపప్పులతో తన డేలీ డైట్ ప్రారంభిస్తారట. అంతేకాదు ప్రోటీన్స్ ఎక్కువగా ఉండే ఫుడ్ తీసుకుంటారట. మంచి ఫుడ్, నీళ్లు ఎక్కువగా తాగడం, సరైన వ్యాయామాలు తన చర్మ సౌందర్య రహస్యమని తమన్నా చెప్పుకొచ్చారు.
అంతేకాదు మరికొన్ని విషయాలను తమన్నా ఫ్యాన్సుతో పంచుకున్నారు. 'నేను నా శరీరాన్ని ఇష్టపడతాను, ప్రేమిస్తాను. రోజంతా పని చేసిన తర్వాత, స్నానం చేసేటప్పుడు నా బాడీలోని ప్రతి భాగాన్ని తాకి థాంక్స్ చెప్పుకుంటాను. వినడానికి ఇది కొంచెం వింతగా అనిపించవచ్చు. కానీ ఎందుకు అలా చేయకూడదు? ప్రతిరోజూ నా శరీరం ఎంతో కష్టపడుతుందని నాకు తెలుసు. నాకు మంచిగా సహకరించినందుకు ధన్యవాదాలు చెప్పుకుంటాను' దాంట్లో తప్పేముందని తమన్నా అన్నారు.