Hair growth: జుట్టు ఒత్తుగా, పొడుగ్గా పెరగాలంటే..ఇలా చేయడి..

Published : May 29, 2022, 03:32 PM IST

Hair growth: జట్టుకు లోపలి నుంచి పోషణ అందినప్పుడే జుట్టు బలంగా, ఒత్తుగా పెరుగుతుంది.  లేదంటే జుట్టు పలుచబడే అవకాశం ఉంది. కొని రకాల ఆహారాలు జుట్టు మంచి పోషణను అందిస్తాయి. అవేంటంటే. 

PREV
18
Hair growth: జుట్టు ఒత్తుగా, పొడుగ్గా పెరగాలంటే..ఇలా చేయడి..

కొన్ని రకాల ఆహార పదార్థాలు ఎన్నో అనారోగ్య సమస్యలను దూరం చేయడంతో పాటుగా.. జుట్టును కూడా ఆరోగ్యంగా ఉంచుతాయి. ముఖ్యంగా వీటిని మీ రోజు వారి ఆహారంలో చేర్చుకుంటే హెయిర్ ఫాల్ సమస్య తొలగిపోవడమే కాదు జుట్టు ఒత్తుగా, బలంగా తయారవుతుంది. అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం. 

28

గుడ్లు (Eggs)..  గుడ్లు సంపూర్ణ ఆహారం. దీనిలో జుట్టు ఒత్తుగా పెరిగేందుకు అవసరమైన ప్రోటీన్లు, విటమిన్ బి5 పుష్కలంగా ఉంటాయి. అంతేకాదు దీనిలో బేసిక్ న్యూట్రియెంట్స్ కూడా ఉంటాయి. ఇవి జుట్టును బలంగా చేయడంతో పాటుగా హెయిర్ ఫాల్ సమస్యను కూడా తొలగిస్తుంది. 

38

పెరుగు (Yogurt).. పెరుగు మన ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. దీనిలో జుట్టు ఆరోగ్యానికి అవసరమైన బయోటిన్, విటమిన్ 12, జింక్ వంటి ఎన్నో ముఖ్యమైన పోషకాలు పుష్కలంగా ఉంటాయి. ఇవన్నీ జట్టు రాలడాన్ని ఆపి.. జుట్టు ఒత్తుగా పెరిగేందుకు సహాయపడతాయి. 

48

చేపలు (Fish).. చేపల్లో ఒమేగా 3 ఫ్యాటీ ఆమ్లాలు పుష్కలంగా ఉంటాయి. ఇవి జుట్టు ఆరోగ్యానికి ఎంతో తోడ్పడుతాయి. వీటిని తరచుగా తినడం వల్ల జుట్టు రాలిపోయే సమస్య నుంచి బయటపడటమే కాదు జుట్టు తేమగా కూడా ఉంటుంది. 

58

దాల్చిన చెక్క (Cinnamon) .. దాల్చిన చెక్కలో ఎన్నో ఔషదగుణాలున్నాయి. ఇవి రక్తప్రసరణను మెరుగ్గా జరిగేలా చేస్తాయి. దాంతో కుదుళ్లకు పోషణ మంచిగా అందుతుంది. దీంతో కుదుల్లు బలంగా తయారవడంతో పాటుగా.. జుట్టు ఒత్తుగా పెరుగుతుంది. 
 

68

చిలగడదుంప (Sweet potato).. స్వీట్ పొటాటోలో ఎన్నో పోషకాలుంటాయి. ఇందులో ఉండే విటమిన్ ఎ.. చర్మంలో Oil glands పనితీరును మెరుగుపరడానికి ఎంతో సహాయపడుతుంది. దీంతో జుట్టు ఊడిపోయే సమస్యే రాదు. అలాగే జుట్టు కూడా ఒత్తుగా, షైనిగా పెరుగుతుంది. 

78

పప్పులు (Pulses).. పప్పులు కూడా జుట్టు పెరుగుదలకు ఎంతో సహాయపడుతాయి. తరచుగా పప్పు కూరల్ని తినడం ద్వారా జుట్టు ఒత్తుగా పెరుగుతుంది. వీటిలో ఉంటే పోషకాలు హెయిర్ ఫాల్ సమస్యను తగ్గిస్తాయి. 

88

బాదం  పప్పులు (Almond beans).. బాదం పప్పులు మన ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. వీటిలో ప్రోటీన్స్, సెలీనియం, ఫైబర్, మాంగనీస్ వంటివన్నీ పుష్కలంగా ఉంటాయి. ఇవన్నీ ఒట్టును నల్లగా, ఒత్తుగా పెరిగేలా చేస్తాయి. 
 

click me!

Recommended Stories