ప్రతి సంవత్సరం డిసెంబర్ 25 నే క్రిస్మస్ పండుగను ఎందుకు జరుపుకుంటారో తెలుసా?

First Published | Dec 24, 2023, 4:38 PM IST

Christmas 2023: రేపే క్రిస్మస్ పండుగ. ఇప్పటికే క్రిస్మస్ ఏర్పాట్లను పూర్తి చేసే ఉంటారు. ఈ పండుగను ప్రతి సంవత్సరం డిసెంబర్ 25 న అంగరంగ వైభవంగా జరుపుకుంటారు. అయితే ఈ రోజును ఎందుకు జరుపుకుంటారు? దీనిని జరుపుకోవడానికి గల అసలు కారణాలేంటో తెలుసా? 
 


క్రిస్మస్ అంటే ?

క్రిస్మస్ అనే పదం "క్రీస్తు", "మాస్" అనే రెండు పదాల నుంచి ఉద్బవించింది. అంటే యేసుక్రీస్తు పవిత్ర మాసం అని అర్థం. ఈ రోజును క్రైస్తవ మత స్థాపకుడు యేసుక్రీస్తు జన్మదినంగా జరుపుకుంటారు. క్రిస్మస్ కోసం ప్రజలు నెల రోజుల ముందు నుంచే ఏర్పాట్లు చేసుకుంటారు. ముందుగా ఇంటినంతా శుభ్రం చేసి డెకరేట్ చేస్తారు. ఈ రోజు చాలా మంది ఒక పార్టీలను కూడా చేస్తారు. దీనిలో అందరూ కలిసి కొవ్వొత్తులు వెలిగించి యేసుక్రీస్తును ప్రార్థిస్తారు. ఆ తర్వాత కేక్ ను కట్ చేసి.. అందరితో కలిసి పాడటం, నృత్యం చేయడం, రుచికరమైన వంటకాలను ఆస్వాదించడం వంటివిచేస్తారు. ఆ తర్వాత వీళ్లలో ఒకరు శాంటాగా మారి గిఫ్ట్ లను ఇస్తారు. 
 

క్రిస్మస్ ను ఎందుకు జరుపుకుంటారు?

యేసుక్రీస్తు పుట్టిన తేదీ బైబిల్ లో ఇవ్వబడలేదు. అందుకే ఈ పండుగను నమ్మకాల ఆధారంగా మాత్రమే జరుపుకుంటారు. క్రైస్తవ మతం విశ్వాసం ప్రకారం.. యేసుక్రీస్తు డిసెంబర్ 25 న జన్మించాడు. అందుకే ఈ రోజును ప్రభువైన యేసుక్రీస్తు జన్మదినంగా జరుపుకుంటారు.
 

Latest Videos


ఇది కూడా ..

క్రీస్తుపూర్వం 336 లో యేసుక్రీస్తు అనుచరుడైన మొదటి క్రైస్తవ రోమన్ చక్రవర్తి డిసెంబర్ 25 ను మొదటిసారి యేసుక్రీస్తు జన్మదినంగా జరుపుకున్నాడని చెప్తారు. కొన్ని సంవత్సరాల తర్వాత పోప్ జూలియస్ కూడా ఈ రోజును యేసుక్రీస్తు జన్మదినంగా జరుపుకుంటామని అధికారికంగా ప్రకటించారు. అప్పటి నుంచి డిసెంబర్ 25ను యేసుక్రీస్తు జన్మదినంగా జరుపుకునే సంప్రదాయం కొనసాగుతోంది. అయితే ఈ విషయంపై మరింత వివాదం చెలరేగింది. కానీ నమ్మకాల ఆధారంగా.. ఈ రోజును క్రిస్మస్ గా జరుపుకుంటారు అనేది కూడా నిజం.

click me!