
భారతదేశంలోని గొప్ప గొప్ప పండితుల్లోఆచార్య చాణక్యుడు ఒకరు. ఈయన మానవ జీవితానికి సంబంధించిన ప్రతి అంశానికి తన అభిప్రాయాలను తెలియజేశారు. ఈ విషయాలు ఎంతో నిరాడంబరంగా, స్పష్టంగా ఉంటాయి. అందుకే ఆయన మాటలకు ఆ రోజుల్లో ఎంత ప్రాముఖ్యత ఉందో.. ఈ రోజుల్లో కూడా అంతే ప్రాముఖ్యత ఉంది. ముఖ్యంగా చాణక్యుడు మన ఆరోగ్యానికి సంబంధించిన ఎన్నో విషయాలను తన పాలసీల్లో ప్రస్తావించారు.
వీటిలో పగటిపూట నిద్రపోవడం వల్ల వచ్చే సమస్యల గురించి కూడా ఆయన ఒక శ్లోకంలో చెప్పారు. మనలో చాలా మంది మధ్యాహ్నం తిన్న తర్వాత ఖచ్చితంగా నిద్రపోతుంటారు. కానీ చాణక్య నీతి ప్రకారం.. ఈ అలవాటు అస్సలు మంచిది కాదు. ఎందుకు ఇలా చెప్పారో ఇప్పుడు తెలుసుకుందాం పదండి.
చాణక్య నీతి ప్రకారం.. మధ్యాహ్నం నిద్రపోవడం వల్ల వచ్చే సమస్యలు
పనిని కోల్పోతారు
చాణక్య నీతి ప్రకారం.. మధ్యాహ్నం నిద్రపోయే వారు ఇతరుల కంటే పని తక్కువగా చేస్తారు. దీంతో వారి పని పోతుంది. ఇలాంటి వారు సమయం వృధా చేయడం తప్ప జీవితంలో ఏమీ చేయరు. ఇలాంటి వారు ఒక్కోసారి డబ్బును కూడా బాగా నష్టపోవాల్సి వస్తుంది. చాణక్య నీతి ప్రకారం.. జబ్బు చేసిన వారు, గర్భిణులు, చిన్న పిల్లల్ని కలిగున్న వారు మాత్రమే మధ్యాహ్నం నిద్రపోవాలి. ఇలాంటి వారికి మాత్రమే పగటిపూట నిద్రపోయే హక్కు ఉంటుందంటారు చాణక్యుడు. మీరు గనుక ఆరోగ్యంగా ఉంటే మాత్రం మీ జీవితంలోని ప్రతి క్షణాన్ని ఉపయోగించుకోండి. ఇలా మధ్యాహ్నం నిద్రపోతే సమయం చాలా వేస్ట్ అవుతుంది.
రోగాల ప్రమాదం పెరుగుతుంది
ఆచార్య చాణక్యుడి ప్రకారం.. మధ్యాహ్నం నిద్రపోవడం వల్ల కూడా అనారోగ్య సమస్యలొచ్చే ప్రమాదం ఉంది. మధ్యాహ్నం పోతే గ్యాస్, ఎసిడిటీ, అజీర్ణం వంటి కడుపునకు సంబంధించిన సమస్యలు వస్తాయి. అందుకే డాక్టర్లు కూడా మధ్యాహ్నం నిద్ర ఆరోగ్యానికి మంచిది కాదని అంటారు. మధ్యాహ్నం 10 నుంచి 15 నిమిషాల పాటు పవర్ న్యాప్ తీసుకుంటే ఎలాంటి సమస్య రాదు. కానీ మీరు 2 నుంచి 3 గంటల పాటు నిద్రపోతే మాత్రం ఆరోగ్యం దెబ్బతింటుందని డాక్టర్లు చెబుతున్నారు. మధ్యాహ్నం నిద్రపోవడం వల్ల కడుపునకు సంబంధించిన సమస్యలు రావడమే కాకుండా రాత్రిపూట సరిగ్గా నిద్రపట్టదు.
ఆయుర్దాయం తక్కువ
మధ్యాహ్నం నిద్రపోతే మీ ఆయుష్షు తగ్గుతుందని ఆచార్య చాణక్యుడు నమ్ముతారు. ఈ విషయాన్ని చాణక్యుడు "ఆయుక్తయి దివ నిద్ర" అనే శ్లోకం ద్వారా చెప్పాడు. మధ్యాహ్నం నిద్రపోతే ఆయుష్షు తగ్గుతుందని ఈ శ్లోకం అర్థం. భగవంతుడు మనిషి ప్రతి శ్వాసను లెక్కిస్తాడని, నిద్రపోతున్నప్పుడు మనిషి శ్వాస వేగంగా తీసుకుంటాడని ఆచార్య చాణక్యుడు విశ్వసిస్తాడు. అందుకే మధ్యాహ్నం నిద్రపోయే వారికి ఆయుష్షు తగ్గడం ప్రారంభమవుతుందని చాణక్యుడు అంటాడు.
శరీరంలో ఎనర్జీ తక్కువగా ఉంటుంది
ఆచార్య చాణక్యుడి ప్రకారం.. మధ్యాహ్నం నిద్రపోవడం వల్ల శరీరంలో శక్తి స్థాయిలు తగ్గుతాయి. మీకు తెలుసా? మధ్యాహ్నం నిద్ర వల్ల సోమరితనం కలుగుతుంది. అలాగే శరీరంలో శక్తి తగ్గడం ప్రారంభమవుతుందని ఆచార్య నమ్ముతారు. అందుకే ఇలాంటి వారు మధ్యాహ్నం తర్వాత ఏ పనీ చేయాలనుకోరు. కానీ ఇది వారి కెరీర్ ను పాడు చేస్తుంది. చాణక్య నీతి ప్రకారం.. మధ్యాహ్నం నిద్రపోయే వారిలో స్వీయ క్రమశిక్షణ భావన తగ్గుతుంది. దీనివల్ల వారి పని, బాధ్యతలపై నేరుగా ప్రభావం పడుతుంది.