Chanakya Niti
చాణక్య నీతిలో.. ఆచార్య చాణక్యుడు మన జీవితాన్ని సుఖసంతోషాలతో, విజయవంతంగా మలచుకోవడానికి ఎన్నో ఉపయోగకరమైన సూచనలు చేశారు. ఆచార్య చాణక్యుడి ప్రకారం.. తెలివైన వ్యక్తులు కొన్ని తప్పులు అస్సలు చేయకూడదు. ఒకవేళ అలా చేస్తే ఎన్నో ఇబ్బందులను, సమస్యలను ఎదుర్కోవాల్సి వస్తుంది. అందుకే తెలివైన వారు ఎలాంటి తప్పులు చేయకూడదో ఇప్పుడు తెలుసుకుందాం పదండి.
Chanakya Niti
ఇలాంటి వారి పట్ల జాగ్రత్త
తెలివైన వ్యక్తులు ఎప్పుడూ కూడా శత్రువు, బలహీనమైన స్నేహితుడి పట్ల ఎంతో జాగ్రత్తగా ఉండాలని చాణక్య నీతి చెబుతుంది. ఎందుకంటే మిమ్మల్ని చూసి, మీ సంతోషాలను చూసి ఓర్వలేరు. ఇది వాళ్లకు బాధ కలిగిస్తుంది. అందుకే మీరు మీ జీవితంలో సంతోషంగా, ఆనందంగా ఉండాలంటే వీళ్లతో చాలా జాగ్రత్తగా ఉండాలి.
ఈ ప్రదేశానికి వెళ్లొద్దు
మీకు గౌరవం లేని చోట మీరు వెళ్లకపోవడమే మంచిది. అలాగే సంపాదన, జ్ఞానం లేని ప్రదేశంలో కూడా మీరు ఉండకూడదని చాణక్య నీతి చెబుతోంది. అలాగే స్నేహితులు, బంధువులు లేని చోట నివసించడం వల్ల కూడా ఎలాంటి ప్రయోజనం ఉండదు. కాబట్టి ఇక్కడికి వెళ్లకపోవడమే మంచిది.
Chanakya Niti
కర్మ
జీవితంలో విజయం సాధించడానికి చాణక్యుడు రెండు ఫార్ములాల గురించి వివరించాడు. చాణక్య నీతి ప్రకారం.. ఒక పక్షి తన రెండు రెక్కల సహాయంతో ఆకాశంలో ఎగరగలిగినట్టే.. కర్మ, జ్ఞానం అనే రెండు రెక్కల ఆధారంగా ఒక వ్యక్తి కూడా విజయ ఆకాశంలో ఎగరగలుగుతాడు.