Chanakya Niti: మనిషి జీవితంలో ఎదుగుదల, పతనం ఒక్క రోజులో జరగవు. మనకు ఉన్న కొన్ని చిన్న చిన్న అలవాట్లే మన ఆలోచనా విధానాన్ని, సంబంధాలను, సంపదను, భవిష్యత్తును ప్రభావితం చేస్తాయి. చాణక్య నీతి ప్రకారం మనిషి పతనానికి దారితీసే ఆ అలవాట్లు ఏంటో చూద్దాం.
మనిషి జీవితంలో ఎదుగుదల అనేది కేవలం అదృష్టం మీద ఆధారపడదు. మన ఆలోచనలు, నిర్ణయాలు, అలవాట్లు కూడా మన భవిష్యత్తును ప్రభావితం చేస్తాయి. ఆచార్య చాణక్యుడు తన నీతి బోధనల్లో మనిషి జీవితంలో పాటించాల్సిన నియమాలతో పాటు, పతనానికి దారితీసే ప్రవర్తనల గురించి అనేక విషయాలు చెప్పాడు. చాణక్య నీతి ప్రకారం కొన్ని అలవాట్లు వ్యక్తి సంపాదించిన గౌరవం, సంపద, సంబంధాలు, అవకాశాలను క్రమంగా దెబ్బతీస్తాయట. అవేంటో తెలుసుకుందాం.
26
అతి కోపం
కోపం వచ్చిన సమయంలో మనిషి ఆలోచించే విధానం మారిపోతుంది. ఆ సమయంలో మాట్లాడే మాటలు, తీసుకునే నిర్ణయాలు తర్వాత పశ్చాత్తాపానికి కారణం కావచ్చు. చాణక్యుడి బోధనల్లో ఆత్మనిగ్రహానికి ఎంతో ప్రాధాన్యం ఉంది. ఒక చిన్న విషయానికి కోపంతో స్పందించడం వల్ల ఎన్నో సంవత్సరాలుగా ఉన్న సంబంధాలు దెబ్బతినవచ్చు. కోపాన్ని అదుపులో పెట్టుకోలేకపోవడం అవకాశాలను కోల్పోయేలా చేయవచ్చు. అందుకే సమస్య ఎదురైనప్పుడు వెంటనే స్పందించకుండా, కొంత సమయం తీసుకుని ఆలోచించి నిర్ణయం తీసుకోవడం మంచిదని చాణక్య నీతి సూచిస్తోంది.
36
అతి నమ్మకం
మన లైఫ్ లో ఎవరిని ఎంతవరకు నమ్మాలి అనే విషయంలో వివేకం అవసరం అని చాణక్యుడి బోధనలు సూచిస్తున్నాయి. వ్యక్తిగత విషయాలు, ఆర్థిక విషయాలు లేదా భవిష్యత్ ప్రణాళికలను అందరికీ చెప్పడం వల్ల వాటిని ఇతరులు దుర్వినియోగం చేసే అవకాశం ఉంటుంది. స్నేహం, బంధుత్వం ఉన్నప్పటికీ ప్రతి విషయం ప్రతి ఒక్కరితో పంచుకోవాల్సిన అవసరం లేదనే జాగ్రత్త చాణక్యుడి బోధనల్లో కనిపిస్తుంది.
జీవితంలో అవకాశాలు వచ్చినప్పుడు వాటిని ఉపయోగించుకోవడానికి కృషి అవసరం. కానీ పని వాయిదా వేయడం, సమయాన్ని నిర్లక్ష్యంగా గడపడం, బాధ్యతలను తప్పించుకోవడం వంటి అలవాట్లు వ్యక్తి ఎదుగుదలకు అడ్డంకిగా మారవచ్చు. చాణక్య నీతిలో సమయం, క్రమశిక్షణ, కృషికి ప్రత్యేక స్థానం ఉంది. ప్రతిభ ఉన్నప్పటికీ దాన్ని ఉపయోగించేందుకు శ్రమించకపోతే ఆశించిన ఫలితాలు రావు. చేయాల్సిన పనిని సరైన టైంలో పూర్తి చేయడం జీవితంలో ముందుకు వెళ్లడానికి అవసరమని చాణక్యనీతి చెబుతోంది.
56
అత్యాశ
అవసరానికి మించి సంపద, అధికారం లేదా ఇతరుల దగ్గర ఉన్న వాటిని పొందాలనే కోరిక మనిషిని తప్పు నిర్ణయాల వైపు నడిపించవచ్చు. అభివృద్ధి చెందాలనే కోరిక సహజమే. కానీ దానికి హద్దులు లేకుండా పోయినప్పుడు సమస్యలు మొదలవుతాయి. ఇతరులతో పోల్చుకుంటూ ఎప్పటికీ ఇంకా ఎక్కువ కావాలని కోరుకోవడం వల్ల మన దగ్గర ఉన్నదానిపై సంతృప్తి కోల్పోవచ్చు. ధనం సంపాదించడం ఎంత ముఖ్యమో, దాన్ని వివేకంతో ఉపయోగించడం, కాపాడుకోవడం, అవసరమైన చోట సద్వినియోగం చేయడం అంతే ముఖ్యమని చాణక్య బోధనలు చెబుతున్నాయి.
66
రహస్యాలను బయటపెట్టడం
ప్రతి విషయం అందరితో పంచుకోవడం తెలివైన ప్రవర్తన కాదనే భావన చాణక్య నీతిలో కనిపిస్తుంది. వ్యక్తిగత సమస్యలు, ఆర్థిక పరిస్థితి, భవిష్యత్ ప్రణాళికలు లేదా వ్యూహాత్మక నిర్ణయాలను ఎవరితో పంచుకోవాలో తెలుసుకోవడం కూడా ఒక నైపుణ్యమే. మన బలహీనతలు, ప్రణాళికలు ఇతరులకు అనవసరంగా తెలిసేలా చేయడం వల్ల భవిష్యత్తులో ఇబ్బందులు ఎదురయ్యే అవకాశం ఉంటుంది.